నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిం చెదననెను. (ఆదికాండము 24:3-4)
కనానీయులు ఎవరు?
కనానీయులు అత్యంత నీచమైన విగ్రహారాధకులు. వారి దేవుళ్ళు మరియు దేవతలు నరబలి మరియు హేతుబద్దమైన లైంగిక సంతానోత్పత్తి ఆచారాలను కలిగి ఉన్న భక్తిని ప్రోత్సహించారు.
నేటి కనానీయులు ఎవరు?
సరే, మీరు ఆసక్తి కలిగి ఉన్న లేదా డేటింగ్ (సహజీవనం) చేస్తున్న, సంఘానికి వేళ్ళని, నరబలి లేదా లైంగిక ఆచారాలను ప్రోత్సహించే వ్యక్తి కావచ్చు.
నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను? మీరు ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువు మరియు రక్షకుడిగా తెలుసా? ఆ వ్యక్తి ప్రభువు కొరకు జీవిస్తున్నాడా? ఆధునిక కనానీయులు అంత స్పష్టంగా అన్యమతస్థులు కాదు. వారు మతపరంగా కనిపిస్తారు మరియు వారి లోపలి రూపములో ఎటువంటి పరివర్తన శక్తి లేకుండా బాహ్య రూపాన్ని కలిగి ఉంటాయి. "పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు" (2 తిమోతి 3:5)
2 కొరింథీయులకు 6:14-15లో బైబిలు ఏమి చెబుతుందో గమనించండి, “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అపొస్తలుడైన పౌలు ఈ సంగతులను వ్రాసినప్పుడు, అతడు ప్రత్యేకంగా వివాహం గురించి సూచించలేదు కానీ సిధ్ధాంతం ఖచ్చితంగా వర్తిస్తుంది.
భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలై యుండును, భర్త మృతిపొందిన యెడల ఆమె కిష్టమైన వానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువు నందు మాత్రమే పెండ్లి చేసికొనవలెను. (1 కొరింథీయులకు 7:39)
ఒక విధవరాలు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆమె "ప్రభువులో" ఉన్న వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలని ఈ లేఖనాలు సూచిస్తున్నాయి. దేవుని వాక్యంలో ఉన్న సిధ్ధాంతాల ప్రకారం జీవించే వ్యక్తి "ప్రభువులో" ఉన్న వ్యక్తి. ఈ సిధ్ధాంతం కేవలం విధవరాలుకే కాదు, పెళ్లి చేసుకోవాలనుకునే వారందరికీ వర్తిస్తుంది.
ఆరాధన ముగించుకుని వచ్చిన కొద్దిసేపటికే, ఒక యువతి తన చేతిలో ఛాయాచిత్రంతో (ఫొటోతో) నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అది ఒక అందమైన యువకుడి ఫోటో. ఆమె అతనితో డేటింగ్ (సహజీవనం) చేస్తోంది మరియు ఇప్పుడు వివాహం గురించి ఆలోచిస్తోంది. నేను ఆమెను ప్రధానమైన ప్రశ్న అడిగాను, “అతడు ప్రభువులో ఉన్నాడా?” ఆమె జవాబు ఇస్తూ, “అవును, అతడు గొప్ప సంఘానికి వెళ్తున్నాడు లేదా హాజరవుతున్నాడు.”
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం కోసం ప్రార్థనలు కోరుతూ నాకు ఇదే విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు. "ఆ వ్యక్తి ప్రార్థనా కూడికకు హాజరవుతున్నాడు" ఇక్కడే చాలా మంది మోసపోతున్నారు. ప్రార్థనా కూడికకు, పరిచర్యకు లేదా సంఘానికి హాజరుకావడం మంచిది, కానీ మీరు "ప్రభువులో" వివాహం చేసుకోవాలని కోరుకునే వ్యక్తి - ప్రభువైన యేసుక్రీస్తుకు కట్టుబడి ఉన్నాడా? మీరు గమనించండి, అతడు/ఆమె ప్రార్థన కూడికకు లేదా సంఘానికి తప్పుడు కారణాలతో హాజరవుతూ ఉండవచ్చు. కేవలం మిమ్మల్ని కలవడం కూడా ఒక కారణం కావచ్చు.
మెసొపొటేమియా ఆధునిక ఇరాక్కు దేశం
సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసెను. (ఆదికాండము 24:11)
సాయంకాలము అంటే స్త్రీలు నీళ్లు తోడుకోవడానికి వెళ్ళే సమయం - (ఆదికాండము 24:11) మధ్యాహ్న సమయంలో కాదు, యేసును బావి దగ్గర కలుసుకున్న సమరయ స్త్రీ లాగా. స్పష్టంగా, సమరయ స్త్రీ ప్రజల నుండి దాక్కుంటోంది.
ప్రార్థన: ఓ దేవా మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రీ, దయచేసి ఈ రోజు నాకు సఫలము దయచేయి మరియు నా కుటుంబం మరియు నా పట్ల నీ కృపను చూపుము. (ఆదికాండము 24:12)
ప్రార్థన: అబ్రాహాము దేవా, దయచేసి ఈ రోజు నాకు సఫలము దయచేయి మరియు నా యందు నీ కృపను చూపుము, యేసు నామంలో. (ఆదికాండము 24:12 ఆధారంగా)
ఇస్సాకు వధువును పొందడంలో ప్రార్థన కీలక పాత్ర పోషించింది
పెండ్లికుమారుని తండ్రి (అబ్రాహాము (తన కుమారుని కోసం వధువుకై వెతకడానికి ముందు ప్రార్థించాడు (ఆదికాండము 24:7)
ఎలీయెజెరు అతడు వెతికే ముందు (వివాహం చేసేవాడు ప్రార్థించాడు) (ఆదికాండము 24:12)
ఇస్సాకు ప్రార్థించే దాసుడు (పెండ్లికుమారుడు కూడా ప్రార్థించాడు) (ఆదికాండము 24:63)
వారి వివాహం సఫలం కావడంలో ఆశ్చర్యం లేదు
ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా. (ఆదికాండము 24:16)
రిబ్కా చాలా అందంగా ఉంది, అదే సమయంలో ఆమె కష్టజీవి. ఈ క్రింది వచనాలను గమనించండి:
అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహ మిచ్చెను. మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. (ఆదికాండము 24:18-20)
ఇప్పుడు ఒంటెలు ఒక గ్లాసు నీళ్లు తాగవు కానీ చాలా నీళ్లు తాగుతాయి. 10 ఒంటెలు నీరు ఎక్కువగా తాగుతాయి కాబట్టి ఇది అంత తేలికైన పని కాదు. వాటిని ఎడారి ఓడలు అని పిలవడంలో ఆశ్చర్యమేముంది. రిబ్కాకు సేవ హృదయం ఉందని ఇది తెలియజేస్తుంది. మీ క్రియలు మీ హృదయ స్థితిని కూడా వెల్లడిస్తాయి. కొందరు కేవలం సున్నితమైన బొమ్మలాగా ఉంటారు.
ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించెననెను. (ఆదికాండము 24:26-27)
ఎలీయెజెరు తన లక్ష్యం మీద దృష్టి సారించిన వ్యక్తి
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎలీయెజెరు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి. అతడు రిబ్కా అందాన్ని చూసి తడబడలేదు. అతడు నపుంసకుడు కాదు మరియు రిబ్కా వంటి స్త్రీ అందాన్ని ఖచ్చితంగా మెచ్చుకుని ఉండాలి. అయినప్పటికీ, అతడు పంపిన కార్యము మీద దృష్టిని కోల్పోలేదు. అమ్మాయిలు, బంగారం మరియు ఘనత వంటి వాటి ద్వారా శత్రువు తరచుగా దేవుని దాసుని లేదా దేవుని దాసి యొక్క లక్ష్యాన్ని తప్పించాడు.
అతనికి భోజనము పెట్టించెను గాని అతడు, "నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా" లాబాను చెప్పుమనెను. (ఆదికాండము 24:33)
అతనికి భోజనము కంటే లక్ష్యం ముఖ్యం. యేసయ్య వారితో ఇలా అన్నాడు: "నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై యున్నది." (యోహాను 4:34)
ఆహారం మరియు పానీయం తప్పు కాదు కానీ అది దేవుని ఉద్దేశ్యం మరియు ప్రణాళికల నుండి కలవరపాటుగా ఉండకూడదు.
ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పదిదినములైనను మా యొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి. అప్పుడతడు, "యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని" చెప్పెను. (ఆదికాండము 24:55-56)
ఎలీయెజెరు ఆనందంలో తన సమయాన్ని వృధా చేసుకోలేదు కానీ తన లక్ష్యం మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు అతని లక్ష్యం నెరవేరింది, అతడు తిరిగి వచ్చాడు
వారు ఆ చిన్న దానిని పిలిచి, "ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని" రిబ్కాను పిలిచి, "ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు" అందుకు "ఆమె వెళ్లెదననెను." (ఆదికాండము 24:57-58)
రిబ్కా కూడా విశ్వాసం గల స్త్రీ. ఆమె ఇస్సాకును కలవలేదు. ఆమె విశ్వాసంతో ముందు అడుగు వేసింది. ఇది దైవిక నడిపింపు.

Chapters
- అధ్యాయం 1
- అధ్యాయం 2
- అధ్యాయం 3
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 6
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 10
- అధ్యాయం 11
- అధ్యాయం 12
- అధ్యాయం 13
- అధ్యాయం 14
- అధ్యాయం 15
- అధ్యాయం 16
- అధ్యాయం 17
- అధ్యాయం 18
- అధ్యాయం 19
- అధ్యాయం 20
- అధ్యాయం 21
- అధ్యాయం 22
- అధ్యాయం 23
- అధ్యాయం 24
- అధ్యాయం 25
- అధ్యాయం 26
- అధ్యాయం 27
- అధ్యాయం 28
- అధ్యాయం 29
- అధ్యాయం 30
- అధ్యాయం 31
- అధ్యాయం 32
- అధ్యాయం 33
- అధ్యాయం 34
- అధ్యాయం 35
- అధ్యాయం 36
- అధ్యాయం 37
- అధ్యాయం 38
- అధ్యాయం 39
- అధ్యాయం 40
- అధ్యాయం 41
- అధ్యాయం 42
- అధ్యాయం 43
- అధ్యాయం 44
- అధ్యాయం 45
- అధ్యాయం 46
- అధ్యాయం 47
- అధ్యాయం 48
- అధ్యాయం 49
- అధ్యాయం 50