వారితో యిట్లనెను, "మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు" (ఆదికాండము 31:5)
లాబాను యాకోబును మోసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దేవుడు అతన్ని ప్రతి విధాల రక్షించాడు.
యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు? (కీర్తనలు 118:6).
.... దేవుడు మీతో చెప్పునది, చేయుడి. (ఆదికాండము 31:16)
ఇది కానా వివాహ విందులో మరియ సంఘటన లాగా అనిపిస్తుంది (యోహాను 2:5)
ఆమె కూడా సేవకులతో ఇలా చెప్పింది, " ఆయన (యేసు) మీతో చెప్పునది చేయుడి.
లేయా మరియు రాహేలు సోదరీమణులు వారు దేని గురించి అయిన అంగీకరించడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి కావచ్చు.
లాబాను తన గొఱ్ఱలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను. (ఆదికాండము 31:19)
యాకోబు అభ్యుదయానికి విగ్రహాలే కారణమని రాహేలు భావించి ఉండవచ్చు. రాహేలుకు ప్రభువుతో నిజమైన సాంగత్యం లేదని ఇది తెలియజేస్తుంది.
అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండ మీద అతని కలిసికొనెను. (ఆదికాండము 31:23)
లాబాను యాకోబును ఏడు రోజులు వెంబడించాడు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని రోజుల తరబడి వెంబడించారు
నేటికీ దేవుని ప్రజలు దుష్ట శక్తులచే వెంబడించబడుతున్నారు.
నా దేవతల నేల దొంగిలితి (ఆదికాండము 31:30)
లాబాను ప్రశ్న విగ్రహారాధన యొక్క అవివేకాన్ని చూపుతుంది. దొంగిలించబడే దేవతలను కలిగి ఉండటం విచారంగా మరియు వింతగా ఉంది.
యాకోబు, "నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని", ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. (ఆదికాండము 31:31-32)
తెలియకుండానే యాకోబు తన భార్య రాహేలును చావుతో శపించాడు. చాలా సార్లు తెలియకుండానే మనము కూడా అలా శపించుకుంటాము
లాబాను చాలా కాలం పాటు యాకోబుతో ఉన్నాడు కానీ అతడు యాకోబు యొక్క విశ్వాసాన్ని పొందుకోలేదు.
రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు. (ఆదికాండము 31:34)
రాహేలు తన తండ్రి నుండి మోసపూరిత మార్గాలను బాగా నేర్చుకుంది. ఆమె విగ్రహాల గురించి తన తండ్రిని మోసం చేయడంలో విజయం సాధించింది.
నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను. (ఆదికాండము 31:42)
ఇస్సాకు భయపడిన
ఇది దేవుని గురించి చాలా విచిత్రమైన నామముగా కనిపిస్తుంది. ఏదేమైనా, యాకోబు దీనిని ఉపయోగించినందున, దేవుని ప్రతి నామము శాశ్వతమైన నామము కనుక మనం దానిని పరిగణించాలి.
దురదృష్టవశాత్తూ, యాకోబు ఎక్కడా దేవుడు తన సొంతమని చెప్పుకోలేదు; అతడు దేవుని తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుడని మరియు అతని తాత అబ్రహము దేవుడు అని పేర్కొన్నాడు.
వివాహ ప్రసంగము
యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియుమనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము, మన యొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. (ఆదికాండము 31:45-50)
నీవు నా కుమార్తెలను బాధపెడితే - దేవుడు సాక్షి
నీవు యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను - దేవుడు సాక్షి
యాకోబు స్మారక చిహ్నాన్ని నిర్మించినప్పటికీ, లాబాను దాని ప్రతిష్టతను స్వాధీనం చేసుకొని ఇలా అన్నాడు, "మరియు లాబానునాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము. హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి" (ఆదికాండము 31:51–52, NLT).
అవిశ్వాసి ఆశీర్వదించబడునా?
తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి [దేవుని దయ కోరుతూ] బయలు దేరి తన ఊరికి వెళ్లి పోయెను. (ఆదికాండము 31:55)
ఒక అధికార వ్యక్తిగా, అవును!
ఈ సందర్భంలో లాబాను అవిశ్వాసి మరియు అయినా అతడు తన కుమారులను తన కుమార్తెలను ఆశీర్వదించాడు.
Chapters
- అధ్యాయం 1
- అధ్యాయం 2
- అధ్యాయం 3
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 6
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 10
- అధ్యాయం 11
- అధ్యాయం 12
- అధ్యాయం 13
- అధ్యాయం 14
- అధ్యాయం 15
- అధ్యాయం 16
- అధ్యాయం 17
- అధ్యాయం 18
- అధ్యాయం 19
- అధ్యాయం 20
- అధ్యాయం 21
- అధ్యాయం 22
- అధ్యాయం 23
- అధ్యాయం 24
- అధ్యాయం 25
- అధ్యాయం 26
- అధ్యాయం 27
- అధ్యాయం 28
- అధ్యాయం 29
- అధ్యాయం 30
- అధ్యాయం 31
- అధ్యాయం 32
- అధ్యాయం 33
- అధ్యాయం 34
- అధ్యాయం 35
- అధ్యాయం 36
- అధ్యాయం 37
- అధ్యాయం 38
- అధ్యాయం 39
- అధ్యాయం 40
- అధ్యాయం 41
- అధ్యాయం 42
- అధ్యాయం 43
- అధ్యాయం 44
- అధ్యాయం 45
- అధ్యాయం 46
- అధ్యాయం 47
- అధ్యాయం 48
- అధ్యాయం 49
- అధ్యాయం 50