శారయి దేవుని వాక్యాన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంది?
"ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చును" (ఆదికాండము 16:2)
ప్రభువు నుండి ప్రత్యక్ష వాక్యాన్ని పొందుకోవడం ఒక అద్భుతమైన అనుభవం అయితే దేవుడు వాస్తవానికి చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకోవడం కూడా అంతే ప్రమాదకరం.
'బహుశా (ఒకవేళ)' అనే అహంకారపూరిత పదం ద్వారా దేవుడు చెప్పినట్లు శారయి తప్పుగా అర్థం చేసుకోవడం ఇక్కడ మనం చూస్తున్నాము.
తిరిగి ఏదెను తోట యెద్దకు వెళ్లుదాం, పాము హవ్వతో, "దేవుడు నిజంగా అలా చెప్పాడా?" అని చెప్పింది. దేవుడు చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు.
కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.
అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయెను. ఆమె తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు ఆమె యజమానురాలు ఆమె దృష్టికి నీచమైన దాయెను. (ఆదికాండము 16:3-4)
దీనర్థం అబ్రాము గొడ్డొడు కాదు కానీ శారా గర్భం మూసి వేయబడింది.
హాగరు అనుకొని ఉండాలి, "నా యజమానురాలు శారయి కంటే నేను దేవుని యందు గొప్పదానిని, ఎందుకంటే నా యజమానురాలు నా యజమానితో ఉన్నన్ని రోజులు, ఆమె గర్భం దాల్చలేదు, కానీ ప్రభువు నాకు చాలా తక్కువ సమయంలో అతని ద్వారా గర్భం కలిగించాడు."
యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని, "శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు?" (ఆదికాండము 16:7-8)
ఆమె అబ్రాము బిడ్డను కన్నప్పటికీ, అది దేవుని యందు ఆమె గుర్తింపును మార్చలేదు. ఆమె ఇప్పటికీ హాగరు, శారయి పనిమనిషి'
దేవుడు మార్చే వరకు మీ గుర్తింపు మారదు.
మీరు ఈ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా?

నీవు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు?
ఒక వ్యక్తి ఈ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే, అయితే మీరు సురక్షితంగా ఉన్నారు.
యేసు ప్రభువు ఎక్కడ నుండి వచ్చాడో మరియు ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలుసు.
తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి యుండెను. (యోహాను 13:3)
శారాకు లోబడి యుండుమని ప్రభువు హాగరుతో ఎందుకు చెప్పాడు?
అప్పుడు యెహోవా దూత, "నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి (తగ్గించుకొని) యుండుమని ఆమెతో చెప్పెను. (ఆదికాండము 16:9)
ఎదురు తిరుగవద్దని హాగరుకు లోబడి యుండుమని చెప్పబడింది. ఏ వ్యక్తికైనా ఎదురు తిరగడం సహజ ధోరణి. కానీ లోబడి యుండటంలో ఒక దీవెన ఉంది. దీవెన అనేది మీరు లోబడి యుండిన వ్యక్తి నుండి రాదు, కానీ ప్రభువు నుండి వస్తుంది.
ఇష్మాయేలు గురించిన ప్రవచనాలు ఏమిటి?
"అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు.
అతని చెయ్యి అందరికిని,
అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును.
అతడు తన సహోదరులందరి యెదుట నివసించును" (ఆదికాండము 16:12)
1. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు
ఇది సంచార జీవనాన్ని సూచిస్తుంది
2. అతని చెయ్యి అందరికిని,
అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును
ఇష్మాయేలు చెయ్యి "ప్రతి మనిషికి విరోధముగా ఉండటం" అతడు చాలా గొడవలు మరియు కలహాలు సృష్టించే మరియు పోరాడే వ్యక్తి అని సూచిస్తుంది. దీని అర్థం "యుద్ధం లాంటి స్వభావం" అని కూడా.
3. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవును. (ఆదికాండము 16:10)
సరిగ్గా ప్రవచించినట్లుగా — ఇష్మాయేలు పెరిగాడు, ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నాడు మరియు పన్నెండు మంది కుమారులను కన్నాడు, వారు తమ వంశములలో రాజకుమారులుగా ఎదిగారు (ఆదికాండము 25:12-16 చూడండి).
ఈ ప్రజలు హవిలా (బహుశా NW అరేబియాలో) మరియు షూరు (ఐగుప్తు సరిహద్దుకు సమీపంలో) మధ్య భూభాగంలో నివసించారు మరియు అరబ్బుల పూర్వీకులైన అనేక మంది ప్రజలలో ఒకరు. అరబ్బు సంతతికి చెందిన చాలా మంది ముస్లింలు ఇష్మాయేలు ద్వారా అబ్రాము వరకు తమ వంశాన్ని గుర్తించారు.
అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. (ఆదికాండము 16:13)
చూచుచున్న దేవుడవు నీవే: హాగరు తనకు కనిపించినది దేవదూత కాదని తెలుసు. ప్రభువు యొక్క దూత కూడా-చూచుచున్న దేవుడు, అదే దేవుడు హాగరు మరియు ఇష్మాయేలును చూస్తున్నాడు.
ఇష్మాయేలు పుట్టకముందే బైబిల్లో తన పేరును పొందిన మొదటి వ్యక్తి.
అబ్రాము తన కుమారునికి ఇష్మాయేలు అని ఎందుకు పేరు పెట్టాడు?
తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మా యేలను పేరు పెట్టెను. (ఆదికాండము 16:15)
ఆసక్తికరమైన విషయమేమిటంటే, హాగరుకు పుట్టిన బిడ్డకు అబ్రాము ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.
హాగరు అబ్రాముతో దేవునితో తన సమావేశం గురించి చెప్పి ఉండాలి.
అబ్రాము ఆమె సమావేశమును భారంగా దాటవేయలేదని మరియు దేవుడు చెప్పినట్లుగా బిడ్డకు 'ఇష్మాయేలు' అని పేరు పెట్టడం ద్వారా దానిని ఆమోదించిన ఘనత అబ్రాముకే చెందాలి.

Chapters
- అధ్యాయం 1
- అధ్యాయం 2
- అధ్యాయం 3
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 6
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 10
- అధ్యాయం 11
- అధ్యాయం 12
- అధ్యాయం 13
- అధ్యాయం 14
- అధ్యాయం 15
- అధ్యాయం 16
- అధ్యాయం 17
- అధ్యాయం 18
- అధ్యాయం 19
- అధ్యాయం 20
- అధ్యాయం 21
- అధ్యాయం 22
- అధ్యాయం 23
- అధ్యాయం 24
- అధ్యాయం 25
- అధ్యాయం 26
- అధ్యాయం 27
- అధ్యాయం 28
- అధ్యాయం 29
- అధ్యాయం 30
- అధ్యాయం 31
- అధ్యాయం 32
- అధ్యాయం 33
- అధ్యాయం 34
- అధ్యాయం 35
- అధ్యాయం 36
- అధ్యాయం 37
- అధ్యాయం 38
- అధ్యాయం 39
- అధ్యాయం 40
- అధ్యాయం 41
- అధ్యాయం 42
- అధ్యాయం 43
- అధ్యాయం 44
- అధ్యాయం 45
- అధ్యాయం 46
- అధ్యాయం 47
- అధ్యాయం 48
- అధ్యాయం 49
- అధ్యాయం 50