ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తల... నందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా (1 రాజులు 19:1)
దేవుని ప్రజల కార్యాలను నిరంతరం పర్యవేక్షించే ఆత్మల విభాగం అనేది ఉంది. ఈ దుష్ట ఆత్మలను ‘పర్యవేక్షణ ఆత్మలు’ అని అంటారు. ఈ సందర్భంలో, అహాబు ప్రవక్తయైన ఏలీయా చేసినదంతా యెజెబెలుకు చెప్పాడు.
2 యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. 3 కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడు కొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పెను. (1 రాజులు 19:2-3)
బయలు యొక్క నిశ్శబ్దం మరియు కార్మెలు పర్వతం మీద యెహోవా నుండి వచ్చిన అగ్ని యెజెబెలును పశ్చాత్తాపపడేలా చేయలేదు. కొన్ని విధ్వంసం కోసం గుర్తించబడ్డాయి. "నాశనానికి మాత్రమే సరిపోయే వారి మీద, ఇంతకాలం తాను సహనంతో ఉన్న వారి మీద తన కోపాన్ని మరియు శక్తిని చూపించే పరిపూర్ణ హక్కు దేవునికి లేదా?" (రోమీయులకు 9:22 TLB)
విశ్వాసం వినడం ద్వారా వస్తుంది (రోమీయులకు 10:17), మరియు ఇది సత్యం. కానీ విచారకరమైన మాట ఏమిటంటే భయం కూడా దుష్టున్ని స్వరం వినడం ద్వారా వస్తుంది. ఏలీయా యెజెబెలు బెదిరింపులు విన్నప్పుడు, అతని హృదయంలో భయం ప్రవేశించింది, మరియు అతడు లేచి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షము క్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థన చేసెను. (1 రాజులు 19:4)
ఏలీయా ప్రాణము కోసం ప్రార్థించాడు, కానీ వాస్తవం ఏమిటంటే అతడు నిజంగా మరణాన్ని కోరుకుంటే, అతడు యెజెబెలు నుండి ఎందుకు పారిపోయాడు? అతని నోరు ఒకటి చెప్పింది, అతని హృదయం మరొకటి చెప్పింది. మన నోటి మాటలను వినడమే కాకుండా మన హృదయాల నిశ్శబ్ద రోదనలను వినే దేవునికి నేను కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను.
అవును అనే మాటను పొందుకోవడం కంటే చాలాసార్లు కాదు అని దేవుని నుండి సమాధానంగా పొందుకోవడం మంచిదని కూడా ఇది రుజువు చేస్తుంది.
5 అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. 6 అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. 7 అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. (1 రాజులు 19:5-7)
ఈసారి ప్రభువు ఏలీయాను కాకి మేత కోసం ఒక వాగు వద్దకు పంపలేదు, అలాగే విధవరాలి వద్దకు పంపలేదు. చాలా మంది బైబిలు పండితులు 'ప్రభువు యొక్క దేవదూత' అనే పదం ముందు అవతారమైన క్రీస్తు యొక్క ప్రత్యక్షతను సూచిస్తుందని చెప్పారు.
ప్రవక్త ఏలీయా నేరుగా ప్రభువు చేతి భోజనము తినేవాడు. ఎంత కృప! ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఒక మనిషి దేవుని యొద్ద నుండి పారిపోయాడు, అయినా దేవుడు అతని యొద్ద నుండి పారిపోలేదు! ఆయన నిరుత్సాహపడిన తన ప్రవక్తకు ఆహారం ఇచ్చాడు.
మీరు యోహాను 21:1-14 చదివినట్లైతే, యేసు బంధించబడినప్పుడు, శిష్యులు ఆయనను విడిచిపెట్టారు, మరియు ఆయన మరణానంతరం, వారు తమ పాత వృత్తి యొద్దకు తిరిగి వెళ్లారు. వారు పూర్తిగా నిరుత్సాహపడ్డారు మరియు హృదయ విదారకంగా ఉన్నారు. కానీ యేసు వారిని ఆ స్థితిలో వదిలిపెట్టలేదు. ఆయనే గలిలయ తీరంలో వారికి అల్పాహారం సిద్ధం చేసి తినిపించాడు. ఇక్కడే పేతురు కూడా పునరుద్ధరించబడ్డాడు.
అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణము చేసి, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. (1 రాజులు 19:8)
బీర్షెబా నుండి హోరేబు చాలా దూరం. బీర్షెబా మరియు హోరేబు పర్వతాల మధ్య దూరం దాదాపు 420 కి.మీ. ఏలీయా 40 పగళ్లు 40 రాత్రులు ఆహారము లేకుండా ఉపవాసం ఉండేవాడు.
అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. (1 రాజులు 19:21)
ఎలీషా తన పాత వ్యాపారానికి తిరిగి వెళ్లకుండా అతని వెనుక ఉన్న అన్ని వంతెనలను కాల్చాడు. మరోవైపు, ప్రభువైన యేసు మరణం తర్వాత అపొస్తలులు తమ పాత వ్యాపారానికి తిరిగి వెళ్లారు. అయితే, పరిశుద్ధాత్మ వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత, వారు ఎన్నడూ తిరిగి వెళ్ళలేదు.

Join our WhatsApp Channel
Chapters