english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
ఇ-బుక్స్

మీ పొరపాట్లను అద్భుతా కార్యములుగా మార్చడం

2 207
ఇతరులు మన పట్ల తప్పు చేసినప్పుడు ఇది ఒక విషయముగా భావించబడుతుంది; దేవుడు మనలను పునఃస్థాపిస్తాడని విశ్వాసం మనకు ఉంటుంది, కానీ మన మీద మనమే ఇబ్బంది తెచ్చుకున్నప్పుడు, మనమే గందరగోళం సృష్టించి దేవుడు మనకు సహాయం చేయడని భావించి, విచారం మరియు బాధతో జీవిస్తాము.

కృపగల మన పరలోకపు తండ్రి, తన అనంతమైన జ్ఞానంతో, మన తప్పులను మరియు బలహీనతలను ఊహించి, మన వైఫల్యాలను అద్భుతాలుగా మార్చడానికి ఒక ప్రణాలికను రూపొందించారు! దేవుడు మంచి సమయాల కోసం మాత్రమే ప్రణాలిక చేయలేదు; మనం గందరగోళంలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మన తప్పులను చూసి ఆశ్చర్యపోడు.

యిర్మీయా 29:11 ఇలా చెబుతోంది, "నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు." దేవుని యొద్ద ‘ప్రణాళిక’ మాత్రమే కాదు, మన కోసం ఆయన యొద్ద ‘ప్రణాళికలు’ కూడా ఉన్నాయి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఆయన మన కోసం ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, దేవుడు మన బలహీనతల గురించి ముందే తెలుసుకుని ఉన్నాడు.

13 తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. 14  మనము నిర్మింపబడినరీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు. (కీర్తనలు 103:13-14)

మనము ప్రలోభాలలో పడవచ్చు, మనస్తాపం చెందవచ్చు మరియు అక్కడక్కడ తప్పుడు పదాలను ఉపయోగించవచ్చని ప్రభువుకు తెలుసు; ఆయనకు మన కార్యముల గురించి తెలుసు.

ఈ అద్భుతమైన వ్యక్తిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ ఉండేది, కానీ బలహీనమైన క్షణంలో, ఆమె కార్యాలయంలో ఎవరితోనో మానసికంగా చిక్కుకుంది. వాస్తవానికి, ఆమె దాని గురించి పశ్చాత్తాపపడింది మరియు తన భర్తకు కూడా చెప్పింది, అతడు దయతో ఆమెను క్షమించి, ఆమెను అంగీకరించాడు. అయితే, ఇది ఆమెను లోపల తినేస్తూనే ఉంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడల్లా, ఆమె స్వరాలు వినడం ప్రారంభించింది. ఈ స్వరాలు ఆమెకు "రైలు నుండి దూకు" అని చెబుతుండేది. ఒకరోజు ఆమె రైలు ఫుట్‌బోర్డ్‌కు దగ్గరగా వచ్చి రైలు నుండి చిన్న గొయ్యిలోకి పాడటానికి ప్రయత్నించింది, కానీ దేవుని దయతో, ఎవరో ఆమె చేయి పట్టుకున్నారు.

మీలో కొందరు మీరు విఫలమయ్యారని చెప్పే స్వరాలను వింటూ ఉన్నారు; మీ జీవితంలో మంచి ఏమీ జరగడం లేదు; మీరు దాని నుండి బయటపడే మార్గం లేనంత ఘోరంగా గందరగోళానికి గురయ్యారు. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను.

యేసు ప్రభువు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? ఆయన; నేనొక బోధకుడని; నేను ఒకఅద్భుతకరుడను అని చెప్పలేదు. మీ చరిత్ర పుస్తకాలను పరిశోధించండి మరియు మీకై మీరు తెలుసుకోండి. చాలా మంది ఇలా అంటారు, “ఇదే మార్గము, ఇటు వెళ్లు”, మొదలగునవి. ప్రభువైన యేసు మాత్రమే తానే మార్గమని చెప్పాడు. (యోహాను 14:6) ఆయన మీ తప్పులన్నిటి నుండి, మీ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని మీకు చేస్తాడు. అందుకే మీరు ఆయనను విశ్వసించాలి!

మరొక స్త్రీ, కొన్ని చిన్న సమస్యల కారణంగా, తన భర్త ఇంటిని విడిచిపెట్టి, తన తల్లి వద్ద ఉండడం మొదలుపెటింది. మీ జీవితంలో అగ్నిలో ఆజ్యం పోసే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారని ఇప్పుడు మీకు తెలుసు. ఆమె స్నేహితులు ఆమెతో ఇలా అన్నారు, “నువ్వు నీ పక్షంలో సరైనవే; చలించకు." ఆమె తన భర్తను ప్రేమిస్తుంది, కానీ అగ్నికి ఆజ్యం పోసినందున, ఆమె తన తల్లి వద్ద మూడు వారాల పాటు కొనసాగింది. మరో వైపు కూడా అగ్నిలో ఆజ్యం పోస్తున్న వారు ఉన్నారు. "ఆమె ఎవరనో ఉంచుకుందని మరియు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడానికి కారణం అదే" అని పుకార్లు వ్యాపించాయి. తన భర్తను విడిచిపెట్టమని అత్తమామలు ఒత్తిడి చేయగా, త్వరలోనే ఆమెకు విడాకుల నోటీసు వచ్చింది. ఆమె కన్నీళ్లతో మా కూడికలలో ఒక కూడికకు వచ్చింది, "పాస్టర్ గారు నా వివాహాన్ని దేవుడు విమోచించగలడా?" కాబట్టి చిన్న విషయాలు విపరీతంగా ఎలా పెద్దవిగా మారతాయో మీరు గమనించారా.

మీరు లూకా 15 చదివినట్లయితే, ఈ కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు, “నువ్వు బ్రతికే ఉన్నావని నాకు తెలుసు, కానీ నా నిమ్మితము నువ్వు చనిపోయావు; నా వారసత్వాన్ని నాకు ఇచ్చేయి." ఆ రోజుల్లో, తండ్రి చనిపోయినప్పుడు మాత్రమే కుమారునికి వారసత్వం ఇవ్వబడేది. తండ్రి, ఎటువంటి వాదనలు లేకుండా, ఖచ్చితంగా బాధపడ్డాడు, తన కుమారునికి వారసత్వాన్ని ఇచ్చాడు.  సామెతలు 20:21లో బైబిలుఇలా చెబుతోంది, "మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.” కుమారుని విషయంలో సరిగ్గా అదే జరిగింది.

కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. (లూకా 15:13)

అతడు అంత ఖర్చు చేసిన తర్వాత, కరువు ఏర్పడింది మరియు జీవించడానికి, అతడు పందుల పొలములో పని చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు, ఈ కుమారుడు యువరాజులతో సహవాసం చేసేవాడు, ఇప్పుడు అతడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనుచున్నాడు. ఒక రోజు, అతడు బుద్ది తెచ్చుకొని, నేను మా నాన్నగారి ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

మీ తప్పులలో, మీ పరిస్థితులలో ఒక మలుపును అనుభవించడంలో మొదటి విషయం ఏమిటంటే, మీ తండ్రి కృపగలవాడని తెలుసుకోవడం. మీ పొరుగువారు మరియు మీ బంధువులు మీ పట్ల కృప చూపలేదేమో, కానీ మీ పరలోకపు తండ్రి కృపగలవాడు. (లూకా 6:36) దేవుడు దయగలవాడు మరియు క్షమించేవాడు! ఆయన మనకు అర్హమైనది ఇవ్వడు. దేవుని నుండి పారిపోవద్దు; ఆయన వైపు తిరుగు.

కాబట్టి అతడు (తప్పిపోయిన కుమారుడు) లేచి తన [సొంత] తండ్రి వద్దకు వచ్చాడు. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. (లూకా 15:20)

అతడు ఇంకా చాలా దూరంలో ఉన్నప్పుడే అతని తండ్రి అతన్ని చూశాడు అంటే అతని తండ్రి ప్రతిరోజూ అతని కోసం చూస్తున్నాడు, ఏదో ఒక రోజు, నా కుమారుడు తిరిగి ఇంటికి వస్తాడని. మన పరలోకపు తండ్రి కూడా అదే విధంగా మన కోసం చూస్తున్నాడు, మనం ఆయన వైపు తిరిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

తండ్రి కుమారుని వైపు పరుగెత్తినట్లు లేఖనం చెబుతోంది. ఆ కాలములోని మధ్యప్రాచ్య సంస్కృతిలో, గౌరవప్రదమైన వ్యక్తి తన వస్త్రాలను పైకి లాగి పరుగెత్తడం సిగ్గుచేటుగా భావించేవారు. అయితే తప్పిపోయిన కుమారుని ఎవరైనా ముందుగా కలుసుకుంటే, కుటుంబాన్ని అవమానపరిచినందుకు అతన్ని కొట్టి, పంపించివేయవచ్చని లేదా బహిరంగంగా అవమానించవచ్చని తండ్రికి తెలుసు. అటువంటి దుష్టుని పట్ల సమాజానికి అసహ్యం తప్ప మరొకటి లేదు. అందుకే సమాజం అవమానాన్ని తనపై వేసుకుని తండ్రి తన కుమారుడి వైపు పరుగెత్తాడు.

రక్షణానికి సంబంధించిన విషయం ఇక్కడ ఉంది: దేవుడు - చేతులు చాచి, మనల్ని ఆలింగనం చేసుకోవడానికి మాత్రమే కాకుండా, మన శిక్షకు కేటాయించబడిన మేకులు కోటించుకోవడానికి మానవజాతి వైపు పరుగెత్తుతున్నాడు.

పందులతో సహవాసం చేసే వ్యక్తి యొద్ద వాసన వస్తూ ఉంటుంది, అయినప్పటికీ తండ్రి తన కుమారుని వైపు పరిగెత్తడమే కాకుండా అతనిని కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. “ముందు నువ్వు స్నానం చెయ్యి ఆ తర్వాత నేను నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాను” అని తండ్రి చెప్పలేదు. అతడు తన కుమారుడు ఎలా ఉన్నాడో అలానే అంగీకరించాడు. ఇది దేవుని హృదయం. ఆయన మీ వైపు పరుగెత్తాడు; మీరు ఉన్న పరిస్థితిలో ఆయన మిమ్మల్ని కౌగిలించుకుంటాడు మరియు ముద్దు పెట్టుకుంటాడు. అతను  కోరుకునేది మీరు అతను వైపు తిరగడం మాత్రమే.

ప్రకటన 1:5 ఇలా చెబుతోంది, “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించిన వానికి” అనే పదాల క్రమాన్ని గమనించండి: మొదట ప్రేమించి తర్వాత విడిపించాడు. దేవుడు మనల్ని కొంత కర్తవ్య భావం నుండి విడిపించి, ఆపై మనం శుభ్రంగా ఉన్నందున మనల్ని ప్రేమించాడని కాదు. మనం మురికిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ ఆ తర్వాత మనల్ని విడిపించాడు.

మీరు ఏడుస్తూ ఉండవచ్చు, “పాస్టర్ గారు, నా వివాహం అపజయం ఆయెను; నా వ్యాపారం విఫలమయింది."విఫలము నుండి వర్ధిల్లడంలో మరియు మీ తప్పులను అద్భుతాలుగా మార్చడంలో దేవుడే గిప్పవాడు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు 8:28లో ఇలా వ్రాశాడు, "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము." "మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని" సమస్త విషయాలలో మన తప్పులు కూడా ఉన్నాయి.

దేవుడు అబ్రాహాము మరియు శారాలకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. సంవత్సరాలు గడిచాయి, మరియు నిజంగా ఏమీ జరగలేదు. వారు తమ చేతుల్లోకి తీసుకొని దేవుని సహాయం పొందుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇది జరిగింది. శారా తన పనిమనిషి హాగరుతో పడుకోమని అబ్రాహాముతో చెప్పింది మరియు వారికి ఇషామాయేలు అనే కుమారుడు పుట్టాడు. దేవుడు తన వాగ్దానానికి జవాబిచ్చినట్లుగా అన్ని విషయాలు కనిపించాయి. కానీ నిజం ఏమిటంటే ఇస్మాయిల్ వాగ్దానం చేయబడిన పిల్లవాడు కాదు. ఇష్మాయేలు అబ్రాహాము ఇంటిలో తగాదాలు మరియు పరిస్థితి తెచ్చిన పెద్ద తప్పు.

అబ్రాహాము ప్రభువు దగ్గరకు వెళ్లి ఈ పరిస్థితి గురించి మాట్లాడాడు. ఇక్కడ మరొక కీలక విషయం ఏమిటంటే "మీ తప్పులను ప్రభువుకు చెప్పండి." సమస్య ఏమిటంటే, సూర్యుని క్రింద ఉన్న ప్రతి ఒక్కరికీ మన తప్పుల గురించి చెబుతాము, కాని మనం ఎప్పుడూ ప్రభువుకు చెప్పము.

మరియు దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అది భయంకరమైన గందరగోళంగా ఉన్నప్పటికీ, "ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను" (ఆదికాండము 17:20 NLT ). సంవత్సరాల తర్వాత, ఆదికాండము 37లో, యోసేపు సహోదరులు అసూయతో అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మివేయడం మనం చూస్తాము, వారు అతన్ని ఐగుప్తుకు అమ్మారు. మిగిలిన విషయము మీకు తెలుసు. యోసేపు ఐగుప్తు అధికారి అయ్యాడు మరియు ఇశ్రాయేలు యొక్క పన్నెండు తెగలు కరువులో నశించకుండా రక్షించబడటానికి కారకుడు అయ్యాడు.

ఆశ్చర్యకరంగా, ఇష్మాయేలు సంతతివారు సరైన సమయంలో వచ్చి, అబ్రాహాము యొక్క మనవడు అయిన యోసేపు, అతని సహోదరులు అతనికి ద్రోహం చేసినప్పుడు గొయ్యిలో చనిపోకుండా ఉంచారు (ఆదికాండము 37 చూడండి).

నేను ఏమి చెప్తున్నాను అంటే? అబ్రాహాము చేసిన తప్పు యోసేపు యొక్క అద్భుత కార్యముగా మారింది, అతడు వారి కుటుంబాన్ని రక్షించడంలో సహాయం చేశాడు. దేవుడు ఎంత అద్భుతమైనవాడు. మనం విఫలమైనప్పుడు కూడా మంచిని ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు.

మనందరికీ కొంతమంది ఇస్మాయిల్ ఉన్నారు. మనమందరం దానిని పడవేసి, మనం చేయకూడని విషయాలలో పాలుపంచుకోవడం మరియు గందరగోళానికి గురయ్యే సందర్భాలు ఉన్నాయి. అపవాది నిరంతరం గుసగుసలాడేవాడు, "నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. దేవుడు నీకు ఎప్పటికీ సహాయం చేయడు." ఆ అబద్ధాలు నమ్మొద్దు. దేవుడు కృపతో నిండి ఉన్నాడు. మీరు తప్పులు చేసినప్పుడు ఆయన వెనుదిరగడు.

ప్రార్థన క్షిపణి
1. నా గత తప్పుల ఫలితంగా ఓటమి, అపరాధం మరియు వ్యక్తిగత విమర్శ యొక్క ప్రతి చెడు స్వరాన్ని నేను యేసు నామములో శాంతపరుస్తున్నాను. 
 
2. నా తండ్రీ, యేసు నామములో, నాకు నూతన ప్రారంభము దయచేయి.

3. నా ఓటమి మరియు విఫలం గురించి విన్న వారు యేసు నామములో నా విజయాన్ని జరుపుకుంటారు.

4. నా గతానికి నన్ను వెనక్కి లాగుతున్న నింద మరియు బాధ యొక్క ప్రతి స్వరం యేసు నామములో శాంతించును గాక.

5. యేసు నామములో నా అందమైన భవిష్యత్తులోకి ప్రవేశించడానికి నేను ధైర్యం మరియు సాహసం యొక్క ఆత్మను పొందుకుంటున్నాను.

6. యేసు యొక్క శక్తివంతమైన నామములో, నేను ఓటమి పాలుడను కాదు. నేను విఫలుడను కాదు. నేను ఫలవంతం మరియు విజయవంతుడను,

Join our WhatsApp Channel
అధ్యాయాలు
  • మీ పొరపాట్లను అద్భుతా కార్యములుగా మార్చడం
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్