1. తండ్రీ, నేను (నా కుటుంబం) మహోన్నతుని చాటున నివసిస్తున్నందుకు మరియు నేను ర్వశక్తుని నీడను విశ్రమిస్తూన్నందుకు నీకు వందనాలు.
2. నేను ధైర్యంగా ప్రభువు గురించి చెబుతున్నాను, "ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడు."
3. నిశ్చయంగా వేటకాని ఉరిలోనుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నన్ను రక్షించును.
4. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
5-6. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నేను భయపడకుందును.
7-8. నా ప్రక్కను వేయి మంది పడినను నా కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నా యొద్దకురాదు. నేను కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును.
9. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుని నేను నివాసస్థలముగా చేసికొనియున్నాను.
10. నాకు అపాయమేమియు రాదు ఏ తెగులును నా గుడారమును సమీపించదు.
11. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును.
12. నా పాదములకు రాయి తగులకుండ వారు నన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు.
13. నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదను.
14. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనుక నన్ను తప్పించెదడు నేను ఆయన నామము నెరిగినవాడు గనుక నేఆయన నన్ను ఘనపరచెను.
15. నేను ఆయనకు మొఱ్ఱపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను శ్రమలో ఆయన నాకు తోడై యుండెను నన్ను విడిపించి నన్ను గొప్ప చేసెను, దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరచెను ఆయన రక్షణ నాకు చూపించెను.
Join our WhatsApp Channel