అనుదిన మన్నా
0
0
75
ఆశీర్వాదం యొక్క శక్తి
Monday, 7th of July 2025
Categories :
ఆశీర్వాదం (Blessing)
అప్పుడు యెహోవా, "నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును .ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను." (ఆదికాండము 18:17-19)
జోనాథన్ ఎడ్వర్డ్స్, గొప్ప సందేశం, "కోపంతో ఉన్న దేవుని చేతిలో పాపులు", అతని బోధన కింద కూర్చున్న వ్యక్తులు పశ్చాత్తాపంతో అరుస్తూ నేలపై పడిపోతారని నాకు తెలియజేయబడింది.
నరక జ్వాలలు తమ కాళ్లను కాల్చేస్తున్నాయని కొందరు ఏడ్చేవారు. ఇంకా, జోనాథన్ ఎడ్వర్డ్స్, తన వ్యక్తిగత జీవితంలో, చాలా ప్రేమగల, దయగల వ్యక్తి, అతడు తన కుటుంబంతో యోగ్యమైన వ్యక్తిగత సమయాన్ని గడపడం ఆనందించాడు. ఎడ్వర్డ్స్‌కు పదకొండు మంది పిల్లలు ఉన్నారు మరియు అతడు ప్రతిరోజూ తన పిల్లలపై ఆశీర్వాదం చెప్పడం ఇష్టపడేవాడు.
జోనాథన్ ఎడ్వర్డ్స్ వారసులను ట్రాక్ చేసే ఒక అధ్యయనం నిర్వహించబడింది మరియు చాలామంది రచయితలు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సువార్త సేవకులు మరియు కొందరు యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వంలో ఉన్నత పదవులను కూడా కలిగి ఉన్నారని కనుగొనబడింది.
హెబ్రీయులకు 7:8-10 మనకు చాలా ముఖ్యమైన సిధ్ధాంతాన్ని చెబుతుంది, తన పిల్లలు పుట్టడానికి సంవత్సరాల ముందు తండ్రి చేసే క్రియలు తీసుకున్న చర్యలపై ఆధారపడి ఆ పిల్లలపై సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.
అపొస్తలుడైన పౌలు అబ్రాహాము మరియు యెరూషలేములో మొదటి రాజు మరియు యాజకుడైన మెల్కీసెదుకు గురించి వ్రాసాడు. అపొస్తలుడైన పౌలు లేవీ ఇంకా పుట్టనప్పుడు అబ్రాహాము గృహములో దశమభాగాలు చెల్లిస్తున్నాడని, నిజంగా ఆలోచించాల్సిన విషయం గురించి ప్రస్తావించాడు.
నేను ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పడుకునే ముందు, మీ పిల్లలపై చేతులు వేసి, వారిపై ఆశీర్వాదం పలకండి (వారు ఒకటి లేదా యాభై సంవత్సరాలు ఉన్న పరవలేదు).
గర్భిణీ స్త్రీలు, మీ పొట్టపై చేతులు వేసుకుని, రోజంతా మీకు వీలైనన్ని సార్లు మీ బిడ్డను ఆశీర్వదించండి. సంతానం కోసం తహతహలాడుతున్న వారు కూడా పొట్టపై చేయి వేసి ‘నా బిడ్డ నాకు, నా చుట్టుపక్కల వారికి దీవెనగా ఉంటాడు. మీ పిల్లలు గొప్పవారు అవుతారని మరియు మీ కుటుంబ సభ్యులెవరూ ఇంతకు ముందెన్నడూ రాని ఉన్నత స్థాయిని సాధిస్తారని నేను ప్రవచిస్తున్నాను.
Bible Reading: Psalms 97-104
ఒప్పుకోలు
యెహోవా ఆశీర్వాదం నా పై మరియు నా కుటుంబము మీద ఉంది; అందుచేత నా చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడి యున్నది మరియు యెహోవాకు మహిమను మరియు ఘనతను తెస్తుంది. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1● ఉత్తమము మంచి వాటికి శత్రువు
● సరైన వాటి మీద దృష్టి పెట్టుట
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి
● పన్నెండు మందిలో ఒకరు
● ఇది నిజంగా ముఖ్యమా?
కమెంట్లు