అనుదిన మన్నా
0
0
134
పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం – 1
Wednesday, 23rd of July 2025
లేఖనంలో చాలా సార్లు, పరిశుద్ధాత్మ ఒక పావురంతో పోల్చబడింది. (గమనించండి, నేను పోల్చాను అని చెప్పాను). దీనికి కారణం పావురం చాలా సున్నితమైన పక్షి. మనం పరిశుద్ధాత్మతో సన్నిహితంగా నడవాలంటే, మనం ఆయన సున్నితమైన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.
అప్పుడు ఆమె (దెలీలా) అరిచింది, "సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడు చున్నారనగా అతడు నిద్రమేలుకొని యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు." (న్యాయాధిపతులు 16:20)
లేఖనంలోని అత్యంత హృదయ విచారక భాగాలలో ఇది ఒకటి, ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి కోసం అత్యంత శక్తివంతముగా ఉపయోగించబడ్డాడు, దేవుని సన్నిధిని తేలికగా తీసుకున్నాడు మరియు దేవునికి ఏది ఇష్టమో మరియు ఏది కాదు అనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. సమ్సోనూ యొక్క అతి పెద్ద తప్పు ఏమిటంటే, పరిశుద్ధాత్మ యొక్క సున్నితమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అతడు ఎప్పుడూ పట్టించుకోలేదు. యేసు నామంలో, ఇది మన వంతు భాగము కాదని నేను ప్రవచిస్తున్నాను.
పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పగలమని మీకు తెలుసా?
అననీయ మరియు సప్పీరా పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పారని బైబిలు స్పష్టంగా తేలియాజేస్తుంది.
అప్పుడు పేతురు, "అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?" (అపొస్తలుల కార్యములు 5:3)
మీరు ఒక వ్యక్తికి మాత్రమే అబద్ధం చెప్పగలరు మరియు శక్తి (బలానికి) కాదు.
అననీయా మరియు సప్పీరా కథ క్రైస్తవులు కూడా ధైర్యంగా, ఘోరమైన పాపంలోకి ఆకర్షించబడతారనే విషాదకరమైన సత్యాన్ని ప్రదర్శించబడింది. ఈ విధంగా మోసపరచాలనే కోరికతో సాతాను వారి హృదయాలను ప్రేరేపించాడు (అపొస్తలుల కార్యములు 5:3) మరియు "ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు" (9వ వచనం).
పరిశుద్ధాత్మను కూడా ఎదురించచవచ్చు.
స్తెఫను ప్రధాన యాజకుడు (యూదుల ప్రచారకుడు) కి చెప్పారు, వారు ఆయనని తిరస్కరించడం ద్వారా పరిశుద్ధాత్మ పట్ల అవిధేయత చూపుతున్నారని:
"ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, (మూలభాషలో-వంచని మెడగలవారలారా, హృదయములయందును చెవులయందు సున్నతి పొందినవారలారా) మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు." (అపొస్తలుల కార్యములు 7:51)
పరిశుద్ధాత్మను దూషించవచ్చు.
పరిశుద్ధాత్మను దూషించవచ్చని యేసు బోధించాడు:
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.
మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. (మత్తయి 12:31-32)
పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీ పక్షాన ఉంటుంది, కానీ ఆయన సున్నితమైన మరియు సాధుస్వభావం కారణంగా ఆయన మిమ్మల్ని ఎప్పుడూ బలవంతం చేయడు. మీరు చేసే పనులన్నింటిలోకీ ఆయనని ఆహ్వానించాలి. తన పనిని ఒంటరిగా చేయడానికి ఆయనకి తగిన స్వెచ్చను ఇవ్వాల.
చాలా సంవత్సరాల క్రితం, ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ హైవే మీద డ్రైవింగ్ చేస్తున్నాడు. రోడ్డుపై నుంచోని ఉన్న కారును అతను గమనించాడు మరియు దాని డ్రైవర్ దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హెన్రీ ఫోర్డ్ తన కారును ఆపి డ్రైవర్‌కు ఏ విధంగా నీవు సహాయ పడగలను అని అడిగాడు. డ్రైవర్, కోపంతో, "ముసలివాడా, నేను చేయలేనిది నువ్వు ఏమీ చేయగలవు. నీ పని నీవు చూసుకో; స్వతహాగా నేను దీనిని బాగుచేస్తాను."
చాలా సున్నితంగా, హెన్రీ ఫోర్డ్ తన కారులో తిరిగి వెళ్లిపోయాడు. కారు బాగు చేయాల్సిన వ్యక్తి తాను కారు తయారీదారుని తిరస్కరించానని గ్రహించలేదు! ఖచ్చితంగా, తయారీదారుడే దానిని బాగు చేయగలడు.
చాలా అవకాశాలు పోతాయి ఎందుకంటే, క్రైస్తవులుగా, కొన్ని పనులు చేయడానికి పరిశుద్ధాత్మ మనతో ఏమి (లేదా ఎలా) మాట్లాడుతున్నాడో మనం గుర్తించలేము. సరళంగా చెప్పాలంటే, మనము ఆయన స్వరం మరియు సన్నిధి పట్ల తగినంత సున్నితంగా లేము.
Bible Reading: Ecclesiastes 11-12 ; Song of Solomon 1-4

ఒప్పుకోలు
దేవా తండ్రీ, యేసు నామంలో ఈరోజు నాపై తాజా అగ్ని కుమ్మరించబడును గాక. నా దేవా మరియు నా ప్రభువా, యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా నాకు బాప్తిస్మము దయచేయి.
Join our WhatsApp Channel

Most Read
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 4● దేవుని వాక్యాన్ని మార్చవద్దు
● మీ ఇబ్బందులు మరియు మీ వైఖరులు
● తన్నుతాను మోసపరచుకోవడం అంటే ఏమిటి? - I
● మీ సన్నిహిత్యాని కోల్పోకండి
● 01 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కొండలు మరియు లోయల దేవుడు
కమెంట్లు