అనుదిన మన్నా
0
0
110
శ్రేష్ఠత్వమును ఎలా కొనసాగించాలి?
Friday, 8th of August 2025
Categories :
శ్రేష్ఠత్వము (Excellence)
నేను నిన్న చెప్పినట్లుగా, శ్రేష్ఠత్వము అనేది అనుదిన అలవాటుగా ఉండాలి మరియు ఒక్కసారి జరిగే సంఘటన కాదు. శ్రేష్ఠత్వముకు నా సాధారణ నిర్వచనం: ఎవరైనా చూస్తున్నారో లేదో మన అనుదిన సాధారణ పనులను సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో చేయడం. వాస్తవం ఏమిటంటే, దేవుడు మన పనిని చూస్తాడు మరియు మనం గ్రహించలేని విధంగా మనకు ప్రతిఫలమిస్తాడు.
అయితే, శ్రేష్ఠమైన జీవితాన్ని గడపడానికి, శ్రేష్ఠత్వము యొక్క ఉద్దేశ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, లేకుంటే అది జీవితానికి బదులుగా మరణాన్ని మరియు శిక్షను తెచ్చే విషయం అవుతుంది.
మనం ఏదో సంపాదించడానికి లేదా ఆయన అంగీకారాన్ని సంపాదించడానికి దేవుడు మనల్ని శ్రేష్ఠత్వముతో పనులు చేయమని అడగడు. వాస్తవానికి, మనలో ప్రతి ఒక్కరి కోసం సిలువపై యేసయ్య చేసిన గొప్ప కార్యం వల్ల మనం ఇప్పటికే తండ్రి చేత అంగీకరించబడ్డాము. క్రీస్తు సంపూర్ణం చేసిన పనికి మనం ఎన్నటికీ ఎక్కువ ఏమీ జోడించలేము. (ఎఫెసీయులకు 1:6-7)
మనం శ్రేష్ఠంగా నడవాలని దేవుడు కోరుకునే నిజమైన ఉద్దేశ్యం ఏమిటంటే, మనం ఆయనకు ప్రతిబింబంగా తండ్రిలాగా, కుమారునిలాగా - ఉండడమే. శ్రేష్ఠత్వముతో నడవడం ద్వారా, మనం ఆయనలాగా మారతాము.
దేవుడు ప్రతిదానిని శ్రేష్ఠతతో చేస్తాడు.
దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు. (కీర్తనలు 76:4)
మీ గురించి మరియు నా గురించి (క్రీస్తులో ఉన్నవారు) దేవుడు ఎలా చెబుతున్నాడో ఒకసారి గమనించండి. దేశంలో ఉన్న దైవభక్తిగలవారు (పరిశుద్దులు) శ్రేష్ఠులు, మరియు మహిమాన్వితమైనవారు, వారు నాకు కేవలము ఇష్టులు (కీర్తనలు 16:3)
కాబట్టి, మనం శ్రేష్ఠత్వమును ఎలా కొనసాగించాలి?
అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు. (1 పేతురు 2:9)
మనల్ని చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవడానికి గల కారణాన్ని గమనించండి; ఎందుకంటే ఆయన ఘనతను ప్రకటించడం కోసం.
కాబట్టి శ్రేష్ఠత్వమును వెంబడించడానికి మొదటి మార్గం కేవలం దేవుని వెంబడించడం, మరియు ఆయన స్వభావమును ప్రతిబింబించడం మరియు మనం పరిచయం ఉన్న వారందరికి ఆ అద్భుతమైన లక్షణాలను ప్రకటించడం.
అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: "కాబట్టి దేవుని పోలి నడుచుకొనుడి [ఆయనను పోలి నడుచుకొనుడి మరియు ఆయన నిదర్శనములను వెంబడించుడి], అలాగే ప్రియలైన పిల్లలవలె [వారి తండ్రిని వెంబడించుడి]." (ఎఫెసీయులకు 5:1)
దేవుడు మనల్ని తన స్వరూపంలో మరియు తన పోలిక చొప్పున సృష్టించాడు. ఇప్పుడు, ఆయన విమోచించిన బిడ్డలుగా, మనము క్రీస్తులో ఆ స్వరూపంఃలో పునరుద్ధరించబడియున్నాము.
Bible Reading: Isaiah 57-60

ఒప్పుకోలు
తండ్రీ, క్రీస్తు యేసులో, నీ నామముకు ఘనత తెచ్చే ఆశ్చర్యకరమైన జీవితాన్ని గడపడానికి నాకు కావాల్సినవన్నీ నీవు నాకు సమకూర్చినందుకు వందనాలు. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● అనుకరించుట (పోలి నడుచుకొనుట)● సమాధానము - దేవుని రహస్య ఆయుధం
● ఆరాధన యొక్క పరిమళము
● యజమానుని యొక్క చిత్తం
● యూదా ద్రోహానికి నిజమైన కారణం
● మన ఆధ్యాత్మిక ఖడ్గము కాపాడుకోవడం
● యుద్ధం కొరకు శిక్షణ
కమెంట్లు