అనుదిన మన్నా
0
0
65
దేవుని వాక్యాన్ని చదవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు
Saturday, 13th of September 2025
Categories :
దేవుని వాక్యం (Word of God)
సంవత్సరాలుగా, ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. కొందరైతే దేవుని వాక్యాన్ని చదవకుండా రోజులు, వారాల తరబడి సాగిపోతుంటారు. ఎలాగోలా ఆదివారం ఉదయం వాక్యం వింటే చాలని నిశ్చయించుకుంటారు.
సంవత్సరాలుగా సంఘంలో ఉన్న క్రైస్తవులు కూడా చాలా అరుదుగా దేవుని వాక్యాన్ని క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తారు. అయినా, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీలో తన వాక్యము కొరకు ఆకలి మరియు దాహము పుట్టించుటకు పరిశుద్ధాత్మ దీనిని ఉపయోగించును గాక.
దయచేసి ఈ క్రింది వాటిని చాలా జాగ్రత్తగా చదవండి. ఇవి రాజుకు దేవుడు ఇచ్చిన సూచనలు.
"మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను;
అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై
తాను తన సహోదరుల మీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు చుండవలెను." (ద్వితీయోపదేశకాండమ 17:18-20)
ఒక రాజు ఈ భూమిపై జీవించినంత కాలం దేవుని వాక్యాన్ని రోజూ చదవాలి. ఇది రాజును అనేక విధాలుగా సన్నద్ధం చేసింది.
1. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట నేర్చుకొనును
2. అది అతనిని గర్వం నుండి కాపాడుతుంది
3. అది అతనిని దేవుని మార్గముల నుండి తప్పిపోకుండా చేస్తుంది
4. అది తనకు మరియు అతని కుమారులకు దీర్ఘాయువును అందించడానికి అతనికి హామీ ఇస్తుంది
5. అతని నాయకత్వం స్థాపించబడుతుంది
బైబిలు సెలవిస్తుంది ఆయన సంపూర్ణ త్యాగం ద్వారా; ప్రభువైన యేసు మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను (ప్రకటన 1:6). అందుచేత, మీరు మరియు నేను రాజులు మరియు యాజకులు.
యాజకులుగా, మనం తండ్రి యొద్ద స్తుతులు మరియు విజ్ఞాపన ప్రార్థన యొక్క బలులను అర్పించడానికి పిలువబడ్డాము. రాజులుగా, సువార్త కొరకు రోగులను స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం ద్వారా మనం మన అధికారాన్ని ఉపయోగించాలి. ఈ దేవుని పిలుపును సమర్థవంతంగా నెరవేర్చడానికి, ద్వితీయోపదేశకాండము 17:18-20లో ప్రభువు రాజులకు చెప్పినట్లే మనం దేవుని వాక్యంతో మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.
దేవుడు తన అమూల్యమైన వాక్యాన్ని ప్రేమించి ఆదరించే వారిని సన్మానించడానికి మరియు ఆశీర్వదించడానికి కట్టుబడి ఉన్నాడు. ఆదికాండము నుండి ప్రకటన వరకు, దేవుడు తన మనస్సును మరియు హృదయమును మనకు బయలుపరుచాడు. సమస్తము రాలిపోవును, "అయితే మన దేవుని వాక్యం నిత్యము నిలుచును" (యెషయా 40:8). మనం ఆయన వాక్యాన్ని విశ్వసించి, పాటించినప్పుడు, మన జీవితాలు ఆయన మహిమతో ప్రకాశిస్తాయి.
Bible Reading: Ezekiel 33-35
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నీవు ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని అమలు చేయగలవని అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజూ నీ వాక్యాన్ని చదవడానికి మరియు ధ్యానించడానికి నాకు నీ కృపను దయచేయి. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● 36 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
● అశ్లీలత
● ప్రార్థన యొక్క పరిమళము
● సరి చేయండి
● 01 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు