అనుదిన మన్నా
0
0
133
ఆత్మలను సంపాదించుట – ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది?
Thursday, 18th of September 2025
నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము
జ్ఞానముగల వారు ఇతరులను రక్షించుదురు. (సామెతలు 11:40)
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించి రోడ్డుపై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా, తెలియకుండా, మరొక యువకుడు అతనితో పాటు నడుచుకుంటూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత తన జీవితం ఎలా మారిందో అతడు తన సాక్ష్యాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. దీంతో ఆకర్షితుడైన ఈ యువకుడు తనను ఆహ్వానించిన ఆరాధనకు వెళ్లాడు.
సభ చాలా చిన్న గదిలో నిర్వహించబడింది మరియు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అది ఈ యువకుడిని ముట్టకుండా పరిశుద్ధాత్మను ఆపలేదు. కాబట్టి ఆ రాత్రి, ప్రభువు ఈ యువకుడిని ముట్టాడు, మరియు అతని ఆత్మహత్య ఆలోచనలన్నీ అదృశ్యమయ్యాయి. ఈ యువకుడు ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా - అది నేనే.
నేనెప్పుడూ ఇలా ఊహించుకుంటు ఉంటాను, "ఈ అబ్బాయి నాకు యేసయ్య గురించి చెప్పకపోతే ఏమి అయ్యుండేది? నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాని?"
మన స్వంత ఆసక్తులలో మునిగిపోవడం చాలా సులభం, మనం శాశ్వతత్వమైన మరియు మన చుట్టూ నశించిపోతున్న ఆత్మల దృష్టిని కోల్పోతాము.
ఆత్మలను సంపాదించడానికి ఒక మార్గం మీ సాక్ష్యాన్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోవడం. మీ జీవితంలో దేవుడు చేసినవాటిని ఇతరులతో పంచుకునే అవకాశాల కోసం ప్రతిరోజూ దేవుణ్ణి అడగండి. మీ సాక్ష్యం ఎంత చిన్నదైనా, ప్రజలను ఆయన రాజ్యంలోకి తీసుకువచ్చే దేవుని శక్తిని అది కలిగి ఉంటుంది.
ఆత్మలను సంపాదించడానికి మరొక మార్గం సువార్తను వ్యాప్తి చేయడానికి మీ సమయాన్ని, ప్రతిభను మరియు సంపదను ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం.
మీరు ఎవరినైనా ప్రభువు వైపుకు నడిపించినట్లయితే, ఎదగడానికి సరైన మార్గాన్ని కనుగొనడానికి వారిని వారి స్వంతంగా వదిలివేయవద్దు. బైబిలు చదవమని వారిని ప్రోత్సహించండి. వారిని ఆహ్వానించండి లేదా బైబిలు బోధించే వాటిని మరింత వినడానికి వారికి సమీపంలో ఉన్న మంచి సంఘానికి నడిపించండి. (మత్తయి 28:19-20 చదవండి)
Bible Reading: Ezekiel 45-46
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నన్ను ఆత్మ విజేతగా చేసినందుకు వందనాలు. నీ రాజ్యంలో ఆత్మలను సంపాదించడానికి నీ ఆత్మ ద్వారా నాకు అధికారమివ్వు. రక్షణ సువార్తను నాకు అప్పగించినందుకు వందనాలు. ఆమెన్
Join our WhatsApp Channel

Most Read
● ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించాము● 04 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● హన్నా జీవితం నుండి పాఠాలు
● అత్యంత సాధారణ భయాలు
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
● దేవుడు గొప్ప ద్వారములను తెరుస్తాడు
● లోకమునకు ఉప్పు
కమెంట్లు