english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు
అనుదిన మన్నా

మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు

Sunday, 21st of September 2025
0 0 66
Categories : భావోద్వేగాలు (Emotions)
అక్కడ ముప్పది యెనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు [నిస్సహాయంగా] పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి (నీవు స్వస్థత పొందాలనే ఆసక్తితో ఉన్నావా?) స్వస్థపడ గోరుచున్నావా అని వాని అడుగేను 
(యోహాను 5:5-6)


ఆ మనిషి చాలా కాలం నుండి బాగా లేడు మరియు యేసు ఈ పేదవాడిని అడిగాడు, "నీవు స్వస్థపడ గోరుచున్నావా?" ఇది చాలా చమత్కారమైన ప్రశ్న. మీరు ఈ సందేశాన్ని చదివేటప్పుడు కూడా ప్రభువు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు అని నేను నమ్ముతున్నాను: "నీవు నిజంగా స్వస్థపడ గోరుచున్నావా?"

వివరించడానికి నాకు అనుమతివ్వండి! నిజంగా స్వస్థత కోరుకోని కొందరు వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసా? పాస్టర్ మైఖేల్ గారు, మీరు నిజం చెపుత్తున్నారా? అవును! మీరు విన్నది నిజమే. స్వస్థత కోరుకోని చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు, నేను ఎవరినీ ఖండించడం లేదు,‌ కాని సరిదిద్దడానికి మరియు సహాయం చేయడానికి చెబుతున్నాను. మీరు నమ్మే వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోవడం తప్పేమీ కాదు. అయినప్పటికీ, ఎవరితోనైనా మరియు ప్రతి ఒక్కరితో వారి సమస్యలను చెప్పుకొవడానికి ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు. కొందరు తమ సమస్యలను సోషల్ మీడియాలో పంచుకునే స్థాయికి కూడా వెళతారు. మిమ్మల్ని మానసికంగా మార్చేందుకు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు ఉన్నందున ఇది ఆరోగ్యకరమైనది కాదు.

ఇది వైద్యపరంగా నిరూపించబడింది. (ఇది నేను చెప్పడం లేదు) కొంత మందికి సానుభూతి పొందడం అనేది దృష్టిని కోరుకునే మార్గం. కొంత మందికి అధిక శ్రద్ధ అవసరం, మరియు వారు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా దాన్ని పొందుతారు. కొందరు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేయడానికి ఏదైనా కలిగి ఉండటం ద్వారా సానుభూతిని కోరుకుంటారు.

దయచేసి మనస్తాపం చెందకండి. ఒక మంచి శాస్త్రవైద్యుడు అతడు కుట్టడానికి ముందు కొస్తాడు. మీరు నిజంగా స్వస్థతను పొందుకొవలను కుంటున్నారా లేదా మీ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారా?

రూతు అధ్యాయం 1 నయోమి అనే స్త్రీ గురించి చెబుతుంది. కరువు సమయంలో, వారు మోయాబు దేశముకు మకాం మార్చారు. వారు ఇంటికి దూరంగా మోయాబులో ఉండగా, ఆమె భర్త మరియు ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆమె పూర్తిగా నాశనమై ఉండాలి. ఆమె సమస్తం మొత్తం కూలిపోయి ఉండాలి. తరువాత, మోయాబు దేశంలో ఉన్నప్పుడు, దేవుడు తన ప్రజలను ఎలా దర్శించాడో ఆమె వింది మరియు ఆమె తన కోడలు రూతుతో కలిసి బేత్లెహేముకు తిరిగి వచ్చింది.

కాబట్టి వారిద్దరూ బేత్లెహేముకు వచ్చేవరకు వెళ్లారు. మరియు వారు బేత్లెహేముకు వచ్చినప్పుడు, పట్టణమంతా వారి గురించి కదిలిపోయింది, మరియు ఇది నయోమినా? అని అనుకున్నారు.

వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా

ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి( మధురము) అనక మారా(చేదు) అనుడి. 

​నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. (రూతు‌1:19-21)

నయోమి తిరిగి సరైన దిశలో వెళ్ళింది. అయితే, ఆమె లోపల పూర్తిగా విరిగిపోయింది. భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయిన ఆమె తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను నయోమి అని పిలవవద్దని (అంటే మధురము) కానీ ఆమెను మారా (చేదు అని అర్ధం) అని పిలవమని ఆమె ప్రజలకు చెప్పింది.

నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను? మీ సమస్యను మీ గుర్తింపుగా మార్చుకోవద్దు. మీ సమస్యను పేరు పెట్టడానికి అనుమతించవద్దు. మీ సమస్యలు మీ గుర్తింపును మార్చుకోవడానికి మిమ్మల్ని బలవంతం చేయనివ్వవద్దు. నయోమి తన సమస్యల్ని మరియు బాధను ఆమెకు పేరు పెట్టడానికి అనుమతిస్తోంది.

మీరు మద్యపానంతో పోరాడుతూ ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు తాగుబోతు అని పిలవకండి. మీరు మీ బంధాలలో తప్పులు చేసి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు వైఫల్యం అని పిలవకండి. బాహుశ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు లేదా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ మీరు దేనికీ పనికి రారు అని అనుకొవకద్దు. దేవుడు చెప్పినట్టు నీవు ఏమై యున్నావో అది నీవు అయి యున్నావు.

Bible Reading: Daniel 4-5
ఒప్పుకోలు
దేవుడు చెప్పినట్లు నేను ఏమై యున్నానో అది నేను అయి యున్నాను. కాగా నేను క్రీస్తునందు నూతన సృష్టిని; పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయెను. నేను ఏమై యున్నానో అని వాక్యము చెప్పుచున్నది అది నేను అయి యున్నాను. యేసు నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● నేటి అద్భుతకార్యములను రేపు పరిశుద్ధ పరచుకొనుడి
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
● మీ ఆత్మ యొక్క పునఃస్థాపకము
● మీరు చెల్లించాల్సిన వెల
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #13
● ప్రాణముకై దేవుని ఔషధం
● గుర్తింపు లేని వీరులు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్