అనుదిన మన్నా
0
0
89
నేటి అద్భుతకార్యములను రేపు పరిశుద్ధ పరచుకొనుడి
Thursday, 25th of September 2025
Categories :
పరిశుద్ధత (Sanctification)
ఇశ్రాయేలీయులు వారి అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకదాని అంచున ఉన్నారు. ఈ సమయంలోనే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పాడు. "రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి." (యెహొషువ 3:5)
ఇది యెహొషువకు కొత్త సిధ్ధాంతం కాదు. ఈ సిధ్ధాంతాన్ని తన మార్గదర్శకుడిగా ఉన్న దేవుని దాసుడు మోషే అమలు చేయడాన్ని అతడు చూశాడు.
దేవుడు తన ప్రజల మధ్య ఏదైనా గొప్ప కార్యం చేయడానికి సిద్ధమవుతున్న ప్రతిసారీ, తమను తాము పరిశుద్ధ పరచుకొనుడని ప్రభువు వారికి చెప్పేవాడు. ఈ క్రింది వచనాలలో, ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించాలని కోరుకున్నాడు, కాబట్టి ఆయన తమను తాము పరిశుద్ధ పరచుకొనుడని సెలవిచ్చాడు.
యెహోవా మోషేతో, "నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను; మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును." (నిర్గమకాండము 19:10-11)
మనము ప్రభువుతో నూతనంగా కలుసుకోవాలంటే, అపవిత్రమైన మరియు భక్తిహీనమైన ప్రతిదాని నుండి మనల్ని మనం పరిశుద్ధ పరచుకోవాలని ఇది మనకు సెలవిస్తుంది.
తమ మధ్య దేవుని అద్భుతకార్యములను చూడాలంటే, తమ మధ్య దేవుడు కార్యం చేస్తున్నాడని అర్థం చేసుకోవడానికి, పొందుకోవడానికి వారు ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలని యెహొషువకు కూడా తెలుసు.
తలిదండ్రులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాల్సిన సమయం ఇది - దేవుడు మీ ఇంటిని మరియు పిల్లలను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఆయన వారిని తాకబోతున్నాడు. మీ తరాలు దీవించబడతాయి.
పాస్టర్లు మరియు నాయకులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాల్సిన సమయం ఇది - మీ క్రింద ఉన్న ప్రజలు గొర్రెల వలె వృద్ధి చెందుతారు. మీ కింద ఉన్న ప్రజలు దేవుని కోసం అగ్నిలా ఉంటారు.
యవ్వనులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాల్సిన సమయం ఇది. లోలోపల మౌనంగా దేవునికి మొరపెట్టుకుంటున్న తరాన్ని తాకడానికి దేవుడు మిమ్మును ఉపయోగించుకుంటాడు. మీరు యోసేపు వలె ఉంటారు. మీ వల్ల అనేకులు శారీరికంగా మరియు శాశ్వతమైన మరణం నుండి రక్షించబడతారు.
రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి (శుద్దికరించుకొనుడి) ప్రజలకు ఆజ్ఞాపించు (యెహొషువ 7:13)
ఇంకా, మరొక సందర్భంలో, దేవుడు ప్రజలకు ఇలా చెప్పాడు, "మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి (శుద్దికరించుకొనుడి) ఆజ్ఞాపిస్తున్నాను" అంటే పరిశుద్ధత అనేది కేవలం సూచన లేదా సలహా కాదు; అది ప్రభువు నుండి వచ్చిన ఆజ్ఞ.
కొత్త నిబంధన అదే సత్యాన్ని చెబుతుంది.
మీరు పరిశుద్ధులగుటయే, దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 4:3)
ఇంకా, లేఖనం ఇలా చెబుతోంది, "రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి (శుద్దికరించుకొనుడి)" (యెహొషువ 7:13)
కాబట్టి, పరిశుద్ధత అనేది రేపటికి కూడా సిద్ధపాటు.
రేపు మన దగ్గరికి వచ్చే దాని కోసం ఈరోజు మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడాలని ప్రభువు కోరుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. యుద్ధం యెహోవాదే, అయితే క్రీస్తులో మనకు ఇప్పటికే వాగ్దానం చేయబడిన విజయం కోసం మనల్ని మనం సరైన స్థానంలో ఉంచుకోవాలి.
Bible Reading: Daniel 12; Hosea 1-4

ఒప్పుకోలు
తండ్రీ, ఈ రోజు నుండి తెలివితో పరిశుద్ధతతో నడవడానికి నాకు అధికారం ఇవ్వు మరియు యేసు నామంలో అంతులేని సూచక క్రియలు మరియు అద్భుతకార్యముల కాలంలోకి నడిపించబడును గాక. ఆమెన్!
Join our WhatsApp Channel

Most Read
● కృపలో అభివృద్ధి చెందడం● అద్భుతాలలో పని చేయుట: కీ#2
● భాషలలో మాట్లాడుట మరియు అభివృద్ధి చెందుట
● వంతెనలు నిర్మించడం, అడ్డంకులు కాదు
● ఆరాధనను ఒక జీవన విధానంగా మార్చుకోవడం
● మీ స్పందన ఏమిటి?
● బహుగా అభివృద్ధిపొందుచున్న విశ్వాసం
కమెంట్లు