english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఘనత మరియు గుర్తింపు పొందుకొనుట
అనుదిన మన్నా

ఘనత మరియు గుర్తింపు పొందుకొనుట

Tuesday, 30th of September 2025
0 0 47
Categories : గుర్తింపు (Recognition) ఘనత (Honour)
అప్పుడు పరలోకము నుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. (లూకా 22:43-44)

ఆయన స్త్రీతో, "నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను ...... నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు (ఆదికాండము 3:16-17)

యేసు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఒక వ్యక్తికి తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు, అతని రక్తనాళాలు విరిగిపోయి, రంధ్రాల నుండి రక్తం కారుతుందని వైద్య శాస్త్రం నిర్ధారిస్తుంది. గెత్సేమనే తోటలో యేసయ్యకు సరిగ్గా అదే విధంగా జరిగింది.

మీరు ఏదెను తోటకి తిరిగి వెళ్ళినప్పుడు, ఆదాము మరియు హవ్వలు తమ అధికారాన్ని మరియు సంకల్ప శక్తిని ఎలా కోల్పోయారో మీరు గమనించగలరు. కాబట్టి మీరు గమనించండి, ఇదంతా ఒక తోటలో ప్రారంభమైంది మరియు తోటలో ముగిసింది. ఏదెను తోటలో ఆదాము కోల్పోయిన అధికారం మరియు సంకల్ప శక్తిని, గెత్సేమనే తోటలో యేసయ్య సాతాను నుండి తిరిగి తీసుకున్నాడు.

మీరు కష్టాలలో ఉంటే, మీరు మీ సంకల్ప శక్తిని కోల్పోయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, "ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు. నా జీవితంలోకి రా. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు అధికారం ఇవ్వు" అని మీరు ఈ విధంగా చెప్పడం ద్వారా తిరిగి పొందుకోవచ్చు. 

బాధల గిన్నె తీసివేయమని యేసు మూడుసార్లు తండ్రిని ప్రార్థించాడు. కానీ తరువాత, "అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించును గాక" అని ప్రార్థించెను. మీరు కోల్పోయిన సంకల్ప శక్తిని యేసుక్రీస్తులో పొందుకోవచ్చు.

యెషయా 50:6 ఇలా సెలవిస్తుంది, "కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప గించితిని ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు." ముఖము ఘనత మరియు కృప గురించి మాట్లాడుతుంది. యేసు ద్వారా మనం ఘనత మరియు గుర్తింపు పొందగలిగేలా యేసయ్య తన ముఖము నుండి తన రక్తాన్ని చిందించాడు. మీ ముఖము అంగీకరించబడేలా ఆయన ముఖము చెడిపోయింది. ఈరోజు ధైర్యంగా దేవుని యొద్దకు రండి, తద్వారా ఆయన మిమ్మల్ని పునరుద్ధరించగలడు. ఆయన మీ విరిగి నలిగిన వాటన్నిటిని సరిచేసి నిన్ను సంపూర్ణంగా చేస్తాడు.

Bible Reading: Amos 8-9; Obadiah; Jonah 1
ఒప్పుకోలు
పరలోకపు తండ్రీ, నన్ను దీవించినందుకు నీకు వందనాలు. నీ ప్రియా కుమారుడైన యేసయ్యను నా తరపున బలియాగము అవ్వడానికి ఈ లోకానికి పంపినందుకు వందనాలు. క్రీస్తు నా కోసం ఉంచిన దీవెనలను నేను పొందుకుంటున్నాను. నేను నీ నుండి వచ్చే ఘనతను మరియు గుర్తింపును పొందుకుంటాను మరియు సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను. యేసయ్య నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
● 13 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● నేటి కాలంలో ఇలా చేయండి
● ఎప్పుడు మౌనముగా ఉండాలి మరియు ఎప్పుడు మాట్లాడాలి
● ఆయన తరచుదనానికి అనుసంధానం (ట్యూనింగ్) అవ్వడం
● మీ హృదయాన్ని పరిశీలించండి
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్