english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. పర్వతాలను కదిలించే గాలి
అనుదిన మన్నా

పర్వతాలను కదిలించే గాలి

Monday, 20th of October 2025
0 0 33
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచము పట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.” (మత్తయి 9:2)

విశ్వాసం అనే అదృశ్య శక్తి గాలి లాంటిది. ఇది అదృశ్యమైనప్పటికీ, అది కనిపించే ప్రభావాలను వ్యక్తపరుస్తుంది. గాలి యొక్క ఈ కదిలే శక్తి ఆకులను ఎత్తి, చెట్ల గుండా పరుగెత్తుతుంది మరియు గాలిపటాలను ఆకాశానికి తీసుకువెళుతుంది. గాలి వలె, విశ్వాసం దాని ప్రభావాల ద్వారా గ్రహించబడుతుంది. ఇది దేవుని వాగ్దానాలలో ఒక దృఢమైన హామీ, ఆయన వాక్యము మీద సంపూర్ణ నమ్మకంతో పాతుకుపోయింది. "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది" (హెబ్రీయులకు 11:1).

మత్తయి 9:2లోని మనుష్యుల విశ్వాసం నిష్క్రియమైనది కాదు. ఇది దృడంగా ఉంది. వారు పైకప్పుపైకి ఎక్కి, దాని పలకలను తీసివేసి, గుంపు యొక్క నిందించే కళ్లతో లేదా ఇంటి యజమాని నుండి ఎదురుదెబ్బ తగలకుండా తమ స్నేహితుని యేసు వద్దకు దించారు. పైకప్పును కూల్చివేయడం అనే తీవ్రమైన క్రియ యేసు యొక్క స్వస్థత శక్తిమీద లొంగని నమ్మకాన్ని గురించి సూచిస్తుంది, ఇది అడ్డంకులను కూల్చివేయగల బలమైన విశ్వాసం. కష్టాలను ఎదుర్కొనే వారి నిశ్చయాత్మక క్రియలు వారి అదృశ్య విశ్వాసం యొక్క కనిపించే వ్యక్తీకరణలు, యేసు వారి విశ్వాసం కార్యరూపం దాల్చేలా చూసేలా చేసింది.

ఈ మనుష్యుల కేవలం నమ్మకం సరిపోదని అర్థం చేసుకున్నారు; అది కార్యముతో జతచేయవలసి వచ్చింది. యేసు తమ స్నేహితుడిని బాగు చేస్తాడనే నిరీక్షణతో వారు గుంపు పొలిమేరల్లో ఉండి ఉండవచ్చు కానీ దాని గురించి ఏమీ చేయలేదు. కానీ విశ్వాసానికి పాదాలు అవసరమని వారికి తెలుసు. యాకోబు దీనిని బలపరుస్తున్నాడు, "ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును" (యాకోబు 2:17). యేసు మరియు ఆయన వాక్యము మీద వారి అచంచల విశ్వాసం, సాహసోపేతమైన క్రియతో జతచేయబడి, దైవ స్వస్థత యొక్క అభివ్యక్తికి దారితీసింది.

దీని గురించి ఆలోచిస్తూ, మనం ఒక ప్రశ్న అడగవలసి వస్తుంది - మన పరిస్థితుల్లో నిజమైన వాక్యాను సారమైన విశ్వాసం ఎలా ఉంటుంది?

దేవుని విశ్వసించడం మరియు ఈ నమ్మకంతో మన క్రియలను సమలేఖనం చేయడం నిబద్ధత. ఇది చురుకుగా ఆయనను వెతకడం, పట్టుదలతో పరలోకపు తలుపు తట్టడం, తుఫాను మధ్య యేసు వైపు నీటిపై నడవడం. పరిస్థితులు వేరే విధంగా నిర్దేశించినట్లు అనిపించినప్పటికీ, ఇది దేవుని వాగ్దానాల ప్రకారం పనిచేస్తుంది. అబ్రహం దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు (ఆదికాండము 22:1-18). ఇది పేతురు పడవలో నుండి బయటికి వస్తున్నాడు, కళ్ళు యేసు వైపు తేరి చూచాయి (మత్తయి 14:29).

ఈ రోజు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మరియు ఇలా ప్రశ్నించుకోండి: నా క్రియలు నా విశ్వాసం యొక్క ఒప్పుకోలుకు అనుగుణంగా ఉన్నాయా? నేను దేవుని వాగ్దానాలను విశ్వసించే ఏవైనా కనిపించే సంకేతాలు (బాహ్య సంకేతాలు) ఉన్నాయా?

మీ జీవితంలో ఒక రంగాన్ని గుర్తించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, అక్కడ మీరు మీ విశ్వాసంతో మీ క్రియలను మరింత సన్నిహితంగా సర్దుబాటు చేయడం ప్రారంభించవచ్చు. మీరు దీన్ని పూర్తి చేసినప్పుడు, మీ జీవితంలోని ఇతర రంగాలలో కూడా అదే పని చేయడం ప్రారంభించండి.

Bible Reading: Mark 1-3

ప్రార్థన
తండ్రీ, అడ్డంకులను కదిలించే అచంచలమైన విశ్వాసాన్ని మాలో నింపు. మా నమ్మకాన్ని ప్రతిబింబించేలా మా మార్గమును బలోపేతం చేయి మరియు నీ వాగ్దానాలు నెరవెర్చే విధంగా మధురానుభూతిగా మా జీవితాలు ప్రతిధ్వనించబడును గాక. ప్రతిరోజూ నీతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి మాకు మార్గనిర్దేశం చేయి. యేసు నామములో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● పరిశీలనలో జ్ఞానం
● నేను వెనకడుగు వేయను
● అంతిమ భాగాన్నిగెలవడం
● 15 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● జీవ గ్రంథం
● ప్రాచీన ఇశ్రాయేలు గృహాల నుండి పాఠాలు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్