english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. క్రీస్తులో రాజులు మరియు యాజకులు
అనుదిన మన్నా

క్రీస్తులో రాజులు మరియు యాజకులు

Friday, 20th of March 2026
0 0 21
Categories : మన గుర్తింపు (Our Identity in Christ)
మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించును. (ప్రకటన 1:5) 

పదాల క్రమాన్ని గమనించండి: మొదట ప్రేమించి మరియు తరువాత విడిపించెను.

దేవుడు మనల్ని కొంత కర్తవ్య భావం నుండి విడిపించి, ఆపై మనం పరిశుభ్రంగా ఉన్నందున మనల్ని ప్రేమించాడని కాదు. మనం మురికిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ ఆ తర్వాత మనల్ని విడిపించాడు.

రోమీయులకు ​​5:8, అదే విషయాన్ని ధృవీకరిస్తుంది: "అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను."

మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. (ప్రకటన 1:6)

ప్రభువైన యేసు కేవలం 'మమ్మల్ని విడిపించడం' మాత్రమే కాదు, ఆయన మనల్ని రాజులుగా, యాజకులుగా చేశాడు.

ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు, రాజు మరియు యాజకుడు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు - మెల్కీసెదెకు (ఆదికాండము 14:18). అయితే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, రాజు మరియు యాజకుల కార్యాములను కలపడం నిషేధించబడింది. మీరు రాజు కావచ్చు లేదా యాజకుడు కావచ్చు - ఇద్దరూ కాదు.

ఉజ్జియా రాజైన యూదా రెండు కార్యాములను కలపడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఒక ఉదాహరణ - కుష్టు వ్యాధి. 2 దినవృత్తాంతములు 26:16-21 చదవండి; ఇది మొత్తం కథను మనకు తెలియజేస్తుంది.

రాజు మరియు యాజకుల కార్యాములను రెండింటినీ కలపడానికి ప్రయత్నించిన మరొక వ్యక్తి సౌలు - అతడు ప్రభువుచే తిరస్కరించబడ్డాడు మరియు అతని రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ కథను చదవడానికి 1 సమూయేలు 13:8-14 చదవండి.

పాత నిబంధనలో రాజు మరియు యాజకుల కార్యాములను కలపడం నిషేధించబడిందని ఈ రెండు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కొత్త నిబంధన క్రింద, ఆయన రాజు మరియు ప్రధాన యాజకుడు అనే అర్థంలో మనం ప్రభువైన యేసుక్రీస్తులా ఉండవచ్చు.

ఇప్పుడు ఇక్కడ ఒక సిధ్ధాంతం ఉంది. యేసు ప్రభువు రాజు మరియు యాజకుడు కాబట్టి, ఆయన మనలను దేవునికి రాజులుగా మరియు యాజకులుగా చేయగలడు. మీరు లేని విధంగా మీరు మరొకరిని ఎప్పటికీ చేయలేరు.

ఇప్పుడు 1 పేతురు 2:9 వచనానికి వెళ్లండి: అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు." 

రాజులైన యాజక సమూహమును అనే పదాల కలయికను గమనించండి. కాబట్టి, ప్రభువును నిజంగా విశ్వసించిన ప్రతి వ్యక్తి యాజకుడు మరియు రాజుగా నియమించబడ్డాడని స్పష్టమవుతుంది.

క్రీస్తు వలె, మనం కూడా రెండు విధాలుగా పరిచర్య చేయాలి; యాజకులుగా, మనం తండ్రి యందు స్తుతులు మరియు విజ్ఞాపన ప్రార్థన యొక్క బలులను అర్పించడానికి పిలువబడ్డాము. రాజులుగా, సువార్త కొరకు రోగులను స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం ద్వారా మనం మన అధికారాన్ని ఉపయోగించాలి.

Bible Reading: Joshua 20-22
ఒప్పుకోలు
నేను క్రీస్తు యందు ఉన్నాను, అయితే నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నాను.


Join our WhatsApp Channel


Most Read
● దేవుని పరిపూర్ణ చిత్తానికై ప్రార్థించండి
● దేవుడు నిన్ను ఉపయోగించుకోవ లనుకుంటున్నాడు
● వ్యర్థమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తుంది
● Day 13: 40 Days Fasting & Prayer
● మీరు యుద్ధంలో ఉన్నప్పుడు: పరిజ్ఞానము
● ప్రాచీన ఇశ్రాయేలు గృహాల నుండి పాఠాలు
● నిరాశను నిర్వచించడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్