english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
అనుదిన మన్నా

7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1

Thursday, 20th of October 2022
2 0 1565
Categories : అంత్య దినాలు (Endtimes) ప్రవచనాత్మకమైన వాక్యం (Prophetic Word )
ఒక రోజు యేసు ఒలీవల కొండ మీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి అంత్య దినాల సూచకక్రియల గురించి అడిగారు. అంత్య దినాలకి సంబంధించిన ఏడు ముఖ్యమైన ప్రవచనాత్మక సూచకక్రియలు యేసు ప్రభువు మనకు ఇచ్చాడు.

యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి, "నేనే క్రీస్తునని" చెప్పి పలువురిని మోస పరచెదరు. (మత్తయి 24:4-5)

అంత్య దినాలలో చాలా మంది మోసపోతారని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి మోసపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వారు వినవలసినది వినడానికి బదులుగా వారు వినాలనుకున్నది వినడానికి తొందరపడుతారు. సంవత్సరాలుగా, అలాంటి వ్యక్తులు తమ కోసం దేవుని వాక్యాన్ని చదవడానికి లేదా అధ్యయనం చేయడానికి ఎప్పుడూ ఇష్ట పడరని నేను తెలుసుకున్నాను. అలాగే, వారు నిజంగా ఏ గురువుకు (సలహాదారుడికి) లోబడియుండరు. వారు తమకు సరైనది అనిపించేది చేస్తారు.

వారు దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇతరులపై మాత్రమే ఆధారపడతారు. దీని వల్ల చాలా మంది మోసగాళ్లు పుట్టుకొసారు, వారు తమ లాభం కోసం దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారు. నేను సువార్త పరిచర్యలలో అత్యున్నత బిరుదులను మరియు వారి వ్యక్తిగత జీవితంలో ప్రదర్శించబడే ఫలాలను చూడడానికి బదులుగా సొగసైన జీవనశైలిని నడిపించే (జీవించే) ప్రజలను నేను చూశాను.

యేసు చాలా స్పష్టంగా హెచ్చరించాడు, "ఎవడును మిమ్మును మోసపరచకుండ జాగ్రత్తగా చూచుకొనుడి." కాబట్టి, ఏ వ్యక్తి అయినా తమను తప్పుదోవ పట్టించడం లేదా మోసగించడం సాధ్యం కాదని అనుకోవడం అవివేకం మరియు ప్రమాదకరం. సాతాను దేవుని పరిపూర్ణ సృష్టి మరియు పరిపూర్ణ పరిసరాలలో నివసించిన హవ్వను మోసగించగలిగాడు. కాబట్టి, ఈ అంత్య దినాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

క్రియాత్మక వైపు, ఈ శక్తివంతమైన ప్రశ్నలను అడగండి:
ఆ వ్యక్తి యేసు నామమును మహిమ పరుస్తూన్నాడా లేదా తనకు తాను మహిమ పరచుకుంటున్నాడా?
ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడా మరియు నేర్పిస్తున్నాడా?
చివరగా, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం (రంగస్థల జీవితం కాదు) దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా?
ప్రార్థన
తండ్రీ, నీ ఆత్మ శక్తితో పనిచేయడానికి నాకు అవసరమైన ధైర్యాన్ని ఇవ్వు. అలాగే, శత్రువు యొక్క అబద్ధాలను గుర్తించడానికి మరియు నీ వాక్యంలోని సత్యాలను జ్ఞాపకంచుకోవడానికి నాకు నీ కృపను దయచేయి.

Join our WhatsApp Channel


Most Read
● ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క నిశ్శబ్ద నిరోధకము
● ఆరాధనను జీవన విధానంగా మార్చుకోవడం
● మీ బీడు పొలమును దున్నుడి
● ప్రభువును విచారించుట (మొర్రపెట్టుట)
● తిరస్కరణ మీద వియజం పొందడం
● ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి #2
● దేవుడు ఎంతో ప్రేమించి ఆయన అనుగ్రహించెను
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్