అనుదిన మన్నా
ఇతరుల కోసం ప్రార్థించడం
Friday, 11th of November 2022
4
0
1253
Categories :
ప్రార్థన (Prayer)
మధ్యస్త్యం (Intercession)
దాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కార ముగా పట్టుకొని, 2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 4 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలి యుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెన. 5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. (అపొస్తలుల కార్యములు 12:1-5)
పై లేఖనములో, అపొస్తలుడైన యాకోబు చంపబడినట్లు మనకు తెలియజేయబడింది. అయినప్పటికీ, అపొస్తలుడైన పేతురు దేవుని మహా ప్రమేయం ద్వారా రక్షించబడ్డాడు. ప్రభువు యొక్క దూత ఆ జైలు గదిలోకి వచ్చి మరియు పేతురును జైలు నుండి బయటకు తీసుకువెళ్ళింది.
తేడా ఏమిటి?
యాకోబు ఎందుకు చంపబడ్డాడు కానీ పేతురు ఎందుకు రక్షించబడ్డాడు?
ముఖ్యమైన కారణాలలో ఒకటి ఇదని నేను నమ్ముతున్నాను, "పేతురు జైలులో ఉన్నప్పుడు, సంఘమంతా అతని కోసం హృదయపూర్వకంగా ప్రార్థించింది."
ప్రార్థన యొక్క శక్తిని మన జీవితాల కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారి కోసం గుర్తించబడడం చాలా ముఖ్యం. మన దేశంలో మరియు మన సంఘంలో మన నాయకుల కోసం ప్రార్థించమని లేఖనాలలో మనకు ఆజ్ఞాపించబడింది. మనము ఒకరికొకరు ప్రార్థించకోవాలని ఆజ్ఞాపించబడ్డాము.
క్రీస్తు శరీరం వలె మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాము, మరియు ఆ సవాళ్లలో చాలా వరకు తీక్షమైన మధ్యసత్య ప్రార్థన లేకపోవడం వల్ల కావచ్చు.
సంవత్సరాలుగా, నేను గమనిస్తున్నాను, ఒక ప్రవచనాత్మక, స్వస్థత లేదా విడుదల సభ ఉంటే, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అయితే, అది మధ్యసత్య ప్రార్థన సభ అయినప్పుడు, పాలుగోనేవారు చాలా అరుదుగా ఉంటారు. మన మందరం లోతైన గుంటలలో ఉన్నప్పుడు ఎవరైనా మరియు ప్రతిఒక్కరూ మన కోసం ప్రార్థించాలని మనమందరం కోరుకుంటాము, కానీ పాపం ప్రార్థన కోసం ఇతరులు లైన్లో ఉన్నప్పుడు మనము సమాధానం ఇవ్వము.
కాబట్టి, మన పాస్టర్లు, సంఘ నాయకులు, క్రీస్తులోని సోదరులు మరియు సోదరీమణులు లేదా మరెవరికైనా కోసం ప్రభువు మన హృదయాలలో ఏమి ఉంచాడో దాని గురించి ప్రార్థిదాం, మనం ప్రార్థిస్తున మన వ్యక్తిగత జీవితం లాగా, హృదయపూర్వకంగా ప్రార్థిదాం.
మాట్లాడడం చౌకగా ఉంటుంది, కానీ మన కోసం కాకుండా ఇతరుల కోసం మన ప్రార్థన జీవితాన్ని ముందుకు తీసుకు వెళాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఆత్మ పిలుపుకు మీరు సమాధానం ఇస్తారా?

ప్రార్థన
దయచేసి ప్రార్థించడానికి కొంత సమయం కేటాయించండి: మీ కుటుంబ సభ్యుల కోసం, మీ సంఘ కుటుంబం కోసం (పాస్టర్లు, నాయకులు మొదలగు వారి కోసం)
మూడు రోజుల ఉపవాసం & ప్రార్థనలో నాతో పాటు కలసి పాల్గొనండి
10, 11 & 12 నవంబర్ 2022
లోకానికి, 2022 సంవత్సరం చీకటిగా ముగుస్తుంది, కానీ దేవుని ప్రజలకు ఇది ఒక వేడుక మరియు అభివృద్ధి యొక్క సమయం అవుతుంది. దావీదు ప్రభువును, గొప్ప కార్యములు చేసే స్వామి అని అన్నాడు (2 సమూయేలు 5:20)
ప్రతిరోజూ ఉపవాసం యొక్క కాలపరిమానం: ఉపవాసం అర్ధరాత్రి 00:00 గంటల (12) నుండి ప్రారంభం అయి 14:00 గంటల వరకు (మధ్యాహ్నం 2) వరకు ఉంటుంది.
ఈ సమయంలో, టీ, కాఫీ లేదా ఆహారం అనుమతించబడదు. అయితే, మీరు ఎక్కువ నీరు త్రాగవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మీరు సాధారణమైన ఆహారం తీసుకోవచ్చు.
1వ రోజు: ప్రార్థన గైడ్
1. ఆరాధనలో కొంత సమయం గడపండి.
2. కనీసం 15 నిమిషాలు భాషలతో ప్రార్థించండి (టైమర్ ఉంచండి)
3. అవమానమునకు బదులుగా, నేను రెట్టింపు ఘనతను పొందుతాను, మరియు నిందకు బదులుగా, నేను నా భాగము గురించి సంతోషిస్తాను. (యెషయా 61:7)
4. నా రక్తసంబంధం ద్వారా సంక్రమించిన పూర్వీకుల శాపాలు యేసు నామంలో యేసు రక్తం ద్వారా శాశ్వతంగా విచ్చినం అవునుగాక.
5. నా సంపద, ఉద్యోగం, వ్యాపార పరిచయాలు, పదోన్నతి లేదా అభివృద్ధి నన్ను గుర్తించకుండా నిరోధించడానికి శత్రువు ప్రతి చీకటి నీడను నా మీద పడేశాడు, నేను దానిని యేసు నామంలో అగ్ని ద్వారా విచ్చినం చేస్తున్నాను.
హాజరైన ప్రజల జీవితాల్లో సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములు మరియు అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. పాస్టర్ మైఖేల్ గారి, ఆయన కుటుంబం మరియు KSM బృందం కొరకు ప్రార్థించండి. సమస్త ఏర్పాట్ల కొరకు ప్రార్థించండి.
గమనిక: నోహ్ యాప్లో అనుదిన మన్నా చదవడం మర్చిపోవద్దండి. ఈ ఉపవాస సమయంలో ఇది మిమ్మల్ని అభివృద్ధి పరుస్తుంది!

Join our WhatsApp Channel
Most Read
● మారని సత్యం● లోబడే స్థలము
● ఉపవాసం ద్వారా దేవదూతలను కదిలించడం
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
● 38 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆరాధన: సమాధానమునకు మూలం
● ఆధ్యాత్మిక గర్వము మీద విజయం పొందే 4 మార్గాలు
కమెంట్లు