అనుదిన మన్నా
ఆలస్యం చేసే తీవ్రతను చంపడం
Friday, 9th of December 2022
3
0
1347
Categories :
ఆలస్యం చేయడం (Procrastination)
ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట
వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. (సామెతలు 24:33-34)
గమనించండి, పై లేఖనంలోని వచనాలలో 3 'కొంచెము' పదాలు ఉన్నాయి
భూమి మీద, కొంచెం అనే పదం ఎక్కువగా వాడబడదు, ఇంకా 'కొంచెము' అనే పాదములో మునిగిపోవడం ద్వారా రోజు గడిచిపోతుంది మరియు నిజమైన పనికి సమయం ముగుస్తుంది. ఈ భూమి ముళ్లపొదలతో నిండి ఉంది, మరియు మానవుడు తన కోరిక యొక్క ఫలితాలను అనుభవిస్తాడు - అదే పేదరికం. ఎవరో ఇలా అన్నారు, "మానవులు తమ ఆత్మలను నాశనం చేసుకోవడానికి కొంచెం ఆలస్యం చేయడం ద్వారానే" అని.
రాబోయే తీర్పు నుండి తప్పించుకోవడానికి అతడు త్వరగా బయటకు వెళ్లాల్సిన అవసరం ఉందని సొదొమ మరియు గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చిన దేవదూతలు లోతుకు స్పష్టంగా చెప్పారు. వారు చెప్పే మాటలు వినడానికి బదులుగా, అతడు ఆలస్యం చేసాడు. అతడు విషయాలను ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. దేవుని కృప వల్ల దేవతలు అతనిని, అతని భార్య మరియు కుమార్తెలని చేతితో పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. (ఆదికాండము 19:15-16 చూడండి)
మనం ఆలస్యం చేయడం లేదా వాయిదా వేసినప్పుడు, మనం ఒక నిర్ణయాన్ని మాత్రమే ఆలస్యం చేస్తున్నామని తరచుగా అనుకుంటాం. వాస్తవానికి, ఆలస్యం చేయడం వెనుక ఉన్న అసలు కారణం అజాగ్రత్త మరియు సోమరితనం. మనము ఆలస్యం చేసినప్పుడు, నిర్ణయం తీసుకోవడానికి మనకు తగినంత సమాచారం అందుబాటులో లేనందున కాదు. తరచుగా, ఏమి చేయాలో మకు ఇప్పటికే బాగా తెలుసు. మనము ఒక కారణం లేదా మరొక కారణంతో దీన్ని చేయాలని భావించడం లేదు అంతే.
క్రమం తప్పకుండా ఆలస్యం చేయడం ద్వారా, అది ఒక అలవాటుగా మారి చివరకు మన స్వభావంలో ఒక భాగం అవుతుంది.
ఒక నిర్ణయం తీసుకునే విషయానికి వస్తే, ఏదో ఒకవిధంగా అదంతగా అదే వస్తుందనే ఆశతో వారు చాలా ఆలస్యం అయ్యే వరకు వేచి ఉంటారు. వాస్తవానికి, ఇది ఎప్పుడూ జరగదు.
అలాంటి వారు గ్రహించని విషయం ఏమిటంటే, నిర్ణయం తీసుకోకపోవడంలో, వారు నిర్ణయంగా తీసుకుంటున్నారని. వారు పని చేయడంలో వైఫల్యం అనేది సాధారణంగా దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటుంది.
ఆలస్యం చేసే ప్రమాదం గురించి బైబిలు మనకు హెచ్చరిస్తుంది: "నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా మీ హృదయములను కఠిన పరచుకొనకుడి మరియు ఆయన స్వరాన్ని వినడంలో ఆలస్యం చేయవద్దు" (హెబ్రీయులకు 3:15)
సాతానుకు ఇష్టమైన పదం "రేపు." రేపటి వరకు ఎవరైనా తన రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే, అతడు విజయం సాధించినట్లే. మరోవైపు, 'నేడు' అనే పదం దేవుని హృదయానికి చాలా ప్రియమైనది.
ఫేలిక్సు అనే రోమా అధికారి, అతని గురించి అపొస్తలుల కార్యములు 24:22–27లో మనం చూడవచ్చు. ఫేలిక్సు మరియు అతని భార్య ద్రుసిల్ల, ఆలస్యం కారణంగా రక్షణ అవకాశం కోల్పోయారు.
ఫేలిక్సు అపొస్తలుడైన పౌలుకు సమాధానమిస్తూ, "ఫేలిక్సు మిగుల భయపడి "ఇప్పటికి వెళ్లుము", నాకు సమయమైన రోజున నిన్ను పిలువనంపింతునని చెప్పెను." (అపొస్తలుల కార్యములు 24:25)
'రేపు' అనేది చాలా ప్రమాదకరమైన పదం ఎందుకంటే ఇది చాలా మంది కలలను చాలా వరకు దోచుకుంది. ఇది విద్యార్థుల జీవిత అవకాశాలను మరియు తండ్రులు మరియు తల్లులను వారి పిల్లలతో వారి సంబంధాలను కొల్లగొట్టింది.
మనం దేవుని వాక్యం నుండి నేర్చుకున్నదానిపై వాక్యప్రకారము ప్రవర్తించువారై యుండకుంటే, మనల్ని మనం మోసం మోసపుచ్చుకుంటామని యాకోబు కూడా అన్నాడు . (యాకోబు 1:22) వెంటనే వాక్యప్రకారము నడుచుకుంటామని తీర్మానించుకోండి. ఆలస్యం చేయవద్దు (వాయిదా వేయకండి)

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను నీకు లోబడి యుంటాను మరియు నేను యేసు క్రీస్తు నామంలో నా అధికారాన్ని చేపడుతాను. ఆలస్యం మరియు గందరగోళ ఆత్మ ఇప్పుడే నా జీవితం నుండి వెళ్లిపోవును గాక అని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
Join our WhatsApp Channel
Most Read
● మీ అభివృద్ధి ఆపబడదు● 21 రోజుల ఉపవాసం: 2# వ రోజు
● చేదు (కొపము) యొక్క వ్యాధి
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● విశ్వాసం ద్వారా కృప పొందడం
● నమ్మకమైన సాక్షి
● దేవుని 7 ఆత్మలు: జ్ఞానం గల ఆత్మ
కమెంట్లు