యేసు క్రీస్తు రక్తం యొక్క ప్రయోజనాలు - II
ఎవరో ఇలా అన్నారు, "మీరు శ్రద్ధ వహిస్తున్నదే అభివృద్ధి చెందుతుంది." అలాగే, మనము యేసు రక్తం యొక్క ప్రయోజనాలను చూడటం కొనసాగిస్తున్నప్పుడు, దేవుని సన్నిధి మీ జీవితాన్ని కప్పివేస్తుంది.
4. సమృద్ధి
ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు, మరణ దూత వారి యింటిమీద రక్తాన్ని పూసిన వారందరిపై వెళ్ళాడు. వారు మరణం మరియు ఫరో బానిసత్వం నుండి విడుదల పొందడమే కాకుండా, వస్తువులు మరియు సంపదలతో ఐగుప్తును విడిచిపెట్టారు. మీరు ఏది ఎదుర్కొన్నప్పటికీ, మీ పరిస్థితిలో ఆయన రక్తం అందించే శక్తిని పొందుకోవచ్చు. మీరు ఆయన సమృద్ధిని కూడా పొందుకోవచ్చు.
"ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి." (నిర్గమకాండము 12:35-36)
5. ప్రాణము
రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీ కిచ్చితిని. రక్తము దానిలో నున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. (లేవీయకాండము 17:11)
మన ప్రాణము యేసు రక్తంలో ఉంది. మిమ్మల్ని ఓడించడానికి మరణాన్ని అనుమతించడం ఆపండి. ఆయన కల్వరిలో మన కోసం వెచ్చించిన ప్రాణాన్ని పొందుకోండి.
6. యేసు రక్తం మంచి పలుకులను గురించి తెలియజేస్తుంది
యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. (హెబ్రీయులకు 12:24)
కయీను తన సొంత సోదరుడు హేబెలును చంపినప్పుడు, హేబెలు రక్తం ప్రతీకారం కోసం దేవునికి మొరపెట్టింది. దీనికి విరుద్ధంగా, యేసు రక్తం మన తరపున మంచి పలుకులను గురించి మాట్లాడుతుంది. యేసు రక్తం అనుగ్రహము, ఆశీర్వాదం, క్షమాపణ, స్వస్థత, విడుదల, కృప, విమోచన మొదలైన వాటి గురించి మాట్లాడుతుంది.
హేబెలు రక్తం ఒక వ్యక్తి గురించి మాట్లాడింది - కయీను. యేసు రక్తం మనందరి గురించి మాట్లాడుతుంది. (ప్రకటన 7:9-10)
7. ప్రవేశము
పాపం వల్ల మనం దేవుని నుండి విడిపోయాము. ప్రవేశము అనేది మరొకరి అనుకూలత ద్వారా ప్రవేశించే హక్కు. యేసు చిందించిన రక్తం కారణంగా, మానవుని దేవుని సన్నిధి నుండి దూరంగా ఉంచే ముసుగు సగానికి చింపి, అందరికీ ప్రవేశాన్ని కల్పిస్తుంది.
సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధస్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము. (హెబ్రీయులకు 10:19-22)
ఒప్పుకోలు
[దయచేసి కింది ప్రార్థన అంశములను ఉపయోగించకుండా ముందుకు వెళ్లవద్దు. మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశమును పునరావృతం చేయండి. ఆ తర్వాత మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి.]
1. నేను యేసు క్రీస్తు రక్తము ద్వారా సమాధానము కలిగి ఉన్నందున హింస మరియు భయము యొక్క ఆత్మలన్నిటిని నేను గద్దించి, వెళ్లగొట్టుచున్నాను (కొలొస్సయులకు 1:20)
2. నాకు వ్యతిరేకంగా, నా కుటుంబానికి వ్యతిరేకంగా మరియు కరుణా సదన్ పరిచర్యకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి దుష్ట స్వరము యేసు క్రీస్తు యొక్క విలువైన రక్తం ద్వారా శాశ్వతంగా మూయబడును గాక.
3. యేసు రక్తము ఇప్పుడు నా జీవితం మరియు విధి గురించి మంచి పలుకులు మాట్లాడును గాక.
4. యేసు రక్తము నా జీవితము పట్ల విజయమును మరియు సమృద్ధిని పలుకును గాక.
5. నా కుటుంబ సభ్యులకు మరియు నాకు వ్యతిరేకంగా వ్రాసిన ప్రతి చెడు (దుష్ట) చేతివ్రాత యేసు రక్తం ద్వారా తొలగించబడును గాక.
6. నా సంపద, పత్రాలు, ఆస్తులు మరియు ఆస్తులన్నింటిపై నేను యేసు రక్తాన్ని ప్రోక్షింపజేస్తున్నాను.
7. నేను యేసు నామంలో నా ఆస్తులు మరియు ఆస్తి చుట్టూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తరేఖను గిస్తున్నాను.
8. నేను శత్రువు పట్ల తెరిచిన ప్రతి తలుపు యేసు రక్తముతో శాశ్వతంగా మూసివేయబడును గాక.
9. నేను ఆధ్యాత్మిక మరియు శారీరిక ప్రమాదాలు, విపత్తులు మరియు విషాదాలకు వ్యతిరేకంగా యేసు రక్తం ద్వారా దైవిక భీమాను పొందుకుంటున్నాను.
10. కొంత సమయము ప్రభువును ఆరాధించండి. మీరు యేసయ్య రక్తం గురించి ఆరాధన పాట కూడా పాడవచ్చు.
Join our WhatsApp Channel
Most Read
● మీ ఉద్దేశ్యం ఏమిటి?● దేవదూతల సహాయాన్ని ఎలా సక్రియం చేయాలి
● మీ పూర్తి సామర్థ్యాన్నికి చేరుకొనుట
● ఒక ఇవ్వగల (అవును గల) హామీ
● మీ విడుదల మరియు స్వస్థత యొక్క ఉద్దేశ్యం
● చింతగా ఎదురు చూడటం
● ఇతరులను సానుకూలంగా ఎలా ప్రభావితం చేయాలి
కమెంట్లు