english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: 7# వ రోజు
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: 7# వ రోజు

Saturday, 18th of December 2021
1 0 1631
Categories : Fasting and Prayer
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని (నీ శరీరం) విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. (3 యోహను 2)

ఆర్థిక సలహాదారులు ప్రపంచ అంతస్తుల ప్రకారం ఎలా ధనవంతులు కావాలనే దానిపై మనకు సలహాలు అందించగలరు, అయితే ఈ అంతస్తులు పరిమితంగా ఉంటాయి మరియు తరచూ ఇసుకను మార్చినట్లుగా మారుతూ ఉంటాయి. అయితే, నిజమైన సమృద్ధి సాధించడానికి బైబిల్లో మనకు కనిపించే మార్గదర్శకాలు శాశ్వతమైనవి. కాబట్టి రాబోయే 2022 మరియు ఆ తర్వాత సంవత్సరంలో బైబిలు పఠనానికి మీ ప్రాధాన్యత ఇవ్వండి.

మీరు బైబిలు చదవడానికి మీ ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మీకు సహాయం చేయడానికి నోహ్ యాప్‌లో బైబిలు పఠన ప్రణాళికలను ఉపయోగించవచ్చు.

ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
సామెతలు 8:18
2 కొరింథీయులకు 8:9
మత్తయి 6:31-33
అపొస్తలుల కార్యములు 20:35
సామెతలు 10:22
ఒప్పుకోలు
1# అంశము
మిమ్మల్ని, మీ ఇంటిని, మీ ఆస్తులను మరియు మీ కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటికి కూడా నూనె రాయండి.

ఒప్పుకోలు (మీరు చెప్పే ప్రతి పదానికి అర్ధనిచే - దీన్ని బిగ్గరగా పలకండి)

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)

యెహోవాను స్తుతించుడి
యెహోవాయందు భయభక్తులుగలవాడు 
ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు 
యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
కలిమియు సంపదయు వాని యింట నుండును 
వాని (ప్రభువు) నీతి నిత్యము నిలుచును. (కీర్తనలు 112:1-3)

ప్రార్థన అస్త్రములు
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రమును పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రముకు వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

1. తండ్రీ, యేసు నామంలో, నా జీవితంలో ప్రతి ఆర్థిక అవిశ్వాస గురించి నేను పశ్చాత్తాపపడుతున్నాను. దయచేసి నన్ను క్షమించు.

(ఈ సమయంలో, మీరు చేయవలసిన కొన్ని విషయాలను ప్రభువు మీకు చూపించవచ్చు. దయచేసి వాటిని వ్రాయండి. ఉదాహరణకు: మీరు దేవుని పరిచర్యకు ఎన్నడూ ఇవ్వకపోతే లేదా దేవుని పరిచర్యకు ఇవ్వడానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే, దీని గురించి పశ్చాత్తాపపడండి. ఇది పేదరికం యొక్క ఆత్మను ప్రవేశించడానికి మరియు విధ్వంసం సృష్టించడానికి ఒక ద్వారాన్ని తెరుస్తుంది)

2. నా ఆర్థిక స్థితిని కలిగి ఉండటానికి దేవుడు కేటాయించిన నా పాత్రలలో శత్రువు తవ్విన ప్రతి ఆధ్యాత్మిక రంధ్రం, నేను యేసు నామంలో యేసు రక్తంతో ఆ రంధ్రాలను మూసివేస్తున్నాను. (హగ్గయి 1)

3. సమస్తమైన కీడులకు మూలమైన ధనాపేక్ష, నా కుటుంబ సభ్యులను మరియు నన్ను ఇప్పుడే యేసు నామంలో వదిలి వెళ్ళును గాక. (1 తిమోతి 6:10)

4. తండ్రీ, యేసు నామంలో, నన్ను మరియు నా కుటుంబ సభ్యులను సరైన వ్యక్తులతో చుట్టుముట్టు. నా కుటుంబ సభ్యులను మరియు నన్ను యేసు నామంలో సరైన వ్యక్తులతో జత కలుపు.

5. యేసు నామంలో, నేను నా ఆస్తులు మరియు ఆర్థిక విషయాలపై విడుదల మరియు అనుగ్రహం యొక్క ఆత్మను పలుకుతున్నాను.

6. నా సంపదను దొంగిలించడానికి పంపిన ప్రతి వ్యక్తి లేదా వ్యక్తిత్వం, యేసు నామంలో పూర్తి సంహారము కోసం, నేను మిమ్మల్ని పంపిన వారికి రిక్తహస్తాలతో తిరిగి పంపుతాను.

7. దేవుడు నిర్ణయించిన నా సంపదను దోపిడీల నుండి నన్ను మరల్చడానికి రూపొందించబడిన ఏదైనా, నేను నిన్ను యేసు నామంలో తిరస్కరిస్తున్నాను.

8. తండ్రీ, నా సమృద్ధి మరియు విజయంతో జతపరచబడిన ప్రతి వ్యక్తి యేసు నామంలో పరిశుద్ధాత్మ ప్రభావంలో ఉండును గాక.

9. సంపదను సృష్టించే జ్ఞానం, తెలివి మరియు సామర్థ్యము ఇప్పుడు యేసు నామంలో నాపై వచ్చును గాక. (ద్వితీయోపదేశకాండము 8:18)

10. యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము యేసు నామములో ఇప్పుడే నా మీదికి వచ్చును గాక. (1 దినవృత్తాంతములు 4:9)

(గమనిక: కలలు, దర్శనాలు, సృజనాత్మక ఆలోచనల ద్వారా మీరు అప్పుల నుండి బయటపడేందుకు సహాయం చేసే విషయాలను ప్రభువు మీకు చూపించవచ్చు. దయచేసి వాటిపై కార్యం చేయండి)

Join our WhatsApp Channel


Most Read
● ప్రభువైన యేసు పునరుత్థానానికి సాక్ష్యమివ్వడం
● దేవుడు భిన్నంగా చూస్తాడు
● యేసు యొక్క క్రియలు మరియు గొప్ప క్రియలు చేయడం అంటే ఏమిటి?
● మీ జీవితాన్ని మార్చుకోవడానికి బలిపీఠానికి ప్రాధాన్యత ఇవ్వండి
● ఏ కొదువ లేదు
● జూడస్ జీవితం నుండి పాఠాలు -1
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - III
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్