english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: 10# వ రోజు
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: 10# వ రోజు

Tuesday, 21st of December 2021
2 0 1314
విమోచన దినము

మీరు అధిక మరియు వేగవంతమైన ఫలితాలను చూడాలనుకుంటే, దయచేసి ఈ క్రింది ప్రార్థనలను రాత్రి సమయంలో (00:00 తర్వాత లేదా ఉదయాన్నే) పలకాలని గుర్తుంచుకోండి.
స్తుతి మరియు ఆరాధనతో ప్రారంభించండి. ప్రభువుని ఆరాధిస్తూ కొంత సమయం (కనీసం 10 నిమిషాలు) గడపండి. (ఆరాధనకు సంబంధించిన పాటలు పాడండి లేదా మీకు ఆరాధించడంలో సహాయపడటానికి కొన్ని మృదువైన ఆరాధన సంగీతాన్ని విన్నండి)

మిమ్మల్ని, మీ ఇంటిని, మీ ఆస్తులను మరియు కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటికి కూడా నూనె అభిషేకించండి.

ఒప్పుకోలు: 91వ కీర్తన (బిగ్గరగా చెప్పండి)
తండ్రీ, నేను (నా కుటుంబం, నా పరిచర్య మొదలైనవి) మహోన్నతుని చాటున నివసిస్తున్నందుకు మరియు నేను సర్వశక్తుని నీడలో విశ్రమిస్తున్నందుకు నీకు వందనాలు.

ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి ధైర్యముగా చెప్పుచున్నాను.

వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నన్ను రక్షించును. 

ఆయన తన రెక్కలతో నన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నేను భయపడను.

నా ప్రక్కను వేయి మంది పడినను నా కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నా యొద్దకురాదు.

నేను కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. 
యెహోవా, నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాసస్థలముగా చేసికొనియున్నాను. 

నాకు అపాయమేమియు రాదు ఏ తెగులును నా గుడారమును సమీపించదు. 

నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నా పాదములకు రాయి తగులకుండ వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. 

నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదను.

నేను ఆయనను ప్రేమించుచున్నాను గనుక ఆయన నన్ను తప్పించెదడు నేను అవన్ నామము నెరిగినవాడు గనుక ఆయన నన్ను ఘనపరచెదడు. 

నేను ఆయనకు మొఱ్ఱపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చెదడు శ్రమలో ఆయన నాకు తోడైయుండి నన్ను విడిపించి నన్ను గొప్పగా చేసెదడు, దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరచెదడు ఆయన రక్షణ నాకు చూపించెదడు.

(గమనిక: మీ ఇంట్లో/ఆఫీసులో ఏదైనా చెడు వస్తువులు ఉంటే మరియు వాటిని ప్రభువు మీకు ప్రత్యేకంగా చూపించినట్లయితే, వాటిని బయటకు పారవేయండి. నేను మరల చెపుతున్నాను: ప్రభువు మీకు చూపించినట్లయితేనే)
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

ప్రతి కాడిని విచ్ఛిన్నం చేసే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం యేసు నామంలో నా జీవితంలో వచ్చును గాక.

నా అభివృద్ధిని మరియు నా కుటుంబ సభ్యుల అభివృద్ధిని నిరోధించే ప్రతి దుష్టుల గొలుసులు యేసు నామంలో విచ్ఛిన్నమవును గాక.

ప్రతి శాపం, ప్రతి మంత్రం, ప్రతి తంత్రం, నా పట్ల మరియు నా కుటుంబ సభ్యుల పట్ల వ్యతిరేకంగా జారీ చేయబడిన ప్రతి ప్రతికూల మాటలు యేసు రక్తం యొక్క శక్తితో విచ్ఛిన్నమవును గాక.

నాకు, నా కుటుంబ సభ్యులకు మరియు నా ఆస్తులకు వ్యతిరేకంగా చేయబడిన మంత్రవిద్య మరియు చేతబడి యొక్క ప్రతి వేరు మరియు ఫలము యేసు నామంలో అగ్నితో కలైపోవును గాక.

సజీవుల దేశములో ప్రభువు యొక్క క్షేమాన్ని ఆస్వాదించకుండా నన్ను నిరోధించే ప్రతి శక్తి, యేసు నామంలో పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా బూడిదైపోవును గాక.

నాకు మరియు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా భూమిలో నాటబడిన ఏదైనా, నీ శక్తిని కోల్పోయి మరియు యేసు నామంలో పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా చనిపోవును గాక.

నన్ను అపవిత్రం చేసే మరియు నా కలలను కలుషితం చేసే ప్రతి దుష్టుల శక్తి, నేను నిన్ను యేసు నామంలో బంధిస్తున్నాను.

నేను, అనిత, ఆరోను మరియు అబిగైలు జీవించి ఉన్న లేదా చనిపోయిన దేనితోనైనా కలిగి ఉన్న ప్రతి చెడు నిబంధన ఇప్పుడే యేసు నామంలో అగ్ని ద్వారా విచ్ఛిన్నమవును గాక (మీ స్వంత కుటుంబ సభ్యుల పేరును ఉపయోగించండి)

నేను, అనిత, ఆరోను మరియు అబిగైలు యేసయ్యతో కాకుండా మరేదైనా శక్తితో కలిగి ఉన్న ప్రతి నిబంధన ఇప్పుడే యేసు నామంలో అగ్ని ద్వారా విచ్ఛిన్నమవును గాక (మీ స్వంత కుటుంబ సభ్యుల పేరును ఉపయోగించండి)

ఓ దేవా యేసు నామంలో నా విధి యొక్క రహస్యాన్ని నాకు చూపించు.

యేసు నామంలో మరియు యేసు రక్తం ద్వారా, నా జీవితంలో ప్రతి సర్పము యొక్క అంకితభావాన్ని నేను విచ్ఛిన్నం చేస్తున్నాను.

నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతి దుష్ట శక్తి, యేసు నామంలో అగ్ని ద్వారా చనిపోవును గాక.

Join our WhatsApp Channel


Most Read
● ఆ వాక్యన్ని పొందుకునట
● యేసు యొక్క క్రియలు మరియు గొప్ప క్రియలు చేయడం అంటే ఏమిటి?
● దైవికమైన సమాధానము ఎలా పొందాలి
● సరైన అన్వేషణను వెంబడించడం
● రాజుల యెదుట నిలబడేలా చేసిన దావీదు గుణాలు
● నిలకడ యొక్క శక్తి
● 21 రోజుల ఉపవాసం: 4# వ రోజు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్