english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: 16# వ రోజు
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: 16# వ రోజు

Monday, 27th of December 2021
2 0 1340
చెడు పునాదులను నాశనం చేయడం

ఏ దేవుని బిడ్డకైనా పునాదుల గురించిన జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ జ్ఞానం లేకుండా, అనేక యుద్ధాలు ఓడిపోతాయి మరియు అతను లేదా ఆమె జీవించే దేశములో ప్రభువు యొక్క క్షేమాన్ని చూడడానికి జీవించడు. (కీర్తనలు 27:13)

పునాదులు మనకు కనిపించని శత్రువుల ముఖ్యమైన దాక్కున్న ప్రదేశాలు. ఇటువంటి ఆధ్యాత్మిక రంగాలు దుష్ట/పాపిష్టి రాజులచే నియంత్రించబడతాయి. బలిపీఠాలు వాటి నుండి సక్రియం చేయబడతాయి మరియు వారి అభ్యర్థనపై ద్వారాలు తెరవబడతాయి.

శత్రువు నాశనం కాకపోతే మళ్లీ పైకి వచ్చేలా పునాదుల్లో దాక్కోవడానికి శత్రువు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాడు. అటువంటి వారిని నాశనం చేయడానికి ప్రార్థన మరియు ఉపవాసం ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి.

అయితే మొదట, పునాదులు అంటే ఏమిటి?
పునాదులను నాశనం చేయడం అంటే శత్రువుల కోటలో శక్తివంతమైన బాంబును విడుదల చేయడం లాంటిది.


బైబిలు పునాదుల గురించి విస్తృతంగా మాట్లాడుతుంది
పునాదులు మొదటివి; చాలా ముఖ్యమైనవి.

(దయచేసి ప్రస్తావించబడిన లేఖనాలను చదవండి. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మిక యుద్ధంలో సన్నద్ధం చేసే ప్రత్యక్షత జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రోజు చాలా ముఖ్యమైనది మరియు మీరు ప్రార్థనలో అదనపు సమయాన్ని వెచ్చించాలి)

తన కోపం నుండి దేవుని అగ్ని ప్రతి పునాదిని కాల్చును. (ద్వితీయోపదేశకాండము 32:22, విలాపవాక్యములు 4:11)

గట్టిగా వేయబడే పునాదులు బలంగా నిర్మించబడ్డాయి. (ఎజ్రా 6:3)

ప్రతి పునాదికి ఒక మూలస్తంభం ఉంటుంది. (యోబు 38:6)

నీతిమంతుల యొక్క మంచి పునాదులు పాడైపోతాయి. (కీర్తనలు 11:3)

అలా జరిగితే, నీతిమంతులు ఏమి చేయాలి? (పునాది లేకుండా ఏదీ ఉండదు. మంచి పునాది పాడైపోయినప్పుడు, చెడు లేదా బలహీనమైన పునాది నిర్మించబడుతుంది).

భూమికి పునాదులు ప్రభువు ద్వారా వేయబడును. (యెషయా 51:13,16)

అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను కట్టడానికి మనము పిలువబడ్డాము. విరుగబడిన దానిని బాగుచేయుదుము మరియు త్రోవలు సిద్ధపరచుదుము. (యెషయా 58:12)

దుష్టుల పునాదులు పడిపోవును, దేవుని ప్రతీకారంతో ప్రాకారములు విరుగగొట్టబడును (యిర్మీయా 50:15)

వాటిని విచ్ఛిన్నం కూడా చేయవచ్చు (ఎజ్రా 3:10-11)
పునాదులు వినగలవు. (మీకా 6:2)


పర్వతాలు (ఎక్కువగా లేదా గొప్ప అవరోధంగా ఉన్న దేనినైనా సూచిస్తాయి) ఒక పునాదిని కలిగి ఉంటాయి. (ద్వితీయోపదేశకాండము 32:22)

భూకంపాలు పునాదులను నాశనం చేస్తాయి లేదా కదిలించవచ్చు. (అపొస్తలుల కార్యములు 16:26)

పునాదులు కదిలినప్పుడు, తలుపులు తెరవబడతాయి మరియు ఖైదీలు/బందీలు విడుదల చేయబడతారు. (అపొస్తలుల కార్యములు 16:26)

కొత్త యెరూషలేము నగరానికి పన్నెండు పునాదులు ఉంటాయి (ప్రకటన 21:14)

సంఘము అపొస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై నిర్మించబడింది, అయితే యేసు ప్రధాన మూలస్తంభం. (ఎఫెసీయులకు 2:20)

మీ జీవితం, కుటుంబం, ఉద్యోగం, ఇల్లు, సంఘం మొదలైన వాటికి పునాదులు ఎలా ఉన్నాయి?
మీరు శత్రువుతో ఎలా యుద్ధం చేస్తారు?


ఆధ్యాత్మిక యుద్ధంలో, వారు తమ కోటల భద్రతలోకి ప్రవేశించే వరకు, మీరు మీ శత్రువులను వెంబడించాలి, దారిలో వారిని నాశనం చేయాలి. వారు అభివృద్ధి చెందుతున్న ద్వారములను నాశనం చేయండి. ద్వారములను నాశనం చేయడానికి మీరు శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించాలి. మీరు వారిని అనుసరించాలి మరియు వారిని మరింత నాశనం చేయాలి.

కొందరు దాగి ఉండవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత, వారి బలిపీఠాలను నాశనం చేయండి. వారి చెడ్డ పునాదులలో భాగమైన వారి రాజ్యాన్ని కాల్చివేయండి, నిర్మూలించండి మరియు పడగొట్టండి. వారి జీవనోపాధి హృదయమైన ప్రజలుగా వారిని కలిపి ఉంచే వాటిని కూడా మీరు నాశనం చేయాలి.

మరో మార్గం మొత్తం నగరం/కోటపై బాంబులు వేయడానికి ఆధ్యాత్మిక ఆయుధాలను ఉపయోగించడం. ఇది మీ శత్రువులను మౌనం చేస్తుంది.

ప్రార్థన

మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

యెహోవా, నీవు పునాదులను సృష్టించావు.


నా దేవా, యేసు నామంలో లేచి నా పునాదులను నియంత్రించు.


నేను దేవుని సర్వాంగ కవచమును ధరించుకొన్నాను: యేసు నామములో రక్షణయను శిరస్త్రాణమును, నీతియను మైమరువు, సత్యమను దట్టి, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను, విశ్వాసమను డాలు మరియు దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును.


యేసు నామంలో నా జీవితం పట్ల వ్యతిరేకంగా మాట్లాడే పునాదులకు వ్యతిరేకంగా నేను దేవుని అగ్నిని విడుదల చేస్తున్నాను.


యెహోవా, నా జీవితానికి వ్యతిరేకంగా నిలబడే పునాదులను గద్దించు మరియు వాటిని యేసు నామంలో తీసివేసేయి.


యేసు నామంలో నా కుటుంబం, నా వ్యాపారం, నా సంపద, నా ఆరోగ్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి పునాదిపై నేను బలమైన భూకంపాన్ని విడుదల చేస్తున్నాను.


యెహోవా, లేచి, యేసు నామంలో నన్ను వ్యతిరేకించే పునాదులను ఎదిరించు.


యేసు నామంలో చెడ్డ పునాదుల నుండి వచ్చే నా జీవితం పట్ల వ్యతిరేకంగా ప్రతి చెడు స్వరాన్ని నేను మౌనపరుస్తున్నాను.


సజీవుడైన దేవుని అగ్నితో నా జీవితంలోని ప్రతి చెడ్డ పునాదులను నేను నాశనం చేస్తున్నాను.


యేసు నామంలో దాని పునాదుల నుండి నా ముందు నిలబడి ఉన్న ప్రతి పర్వతాన్ని నేను నిర్మూలిస్తున్నాను.


Join our WhatsApp Channel


Most Read
● దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం
● మీ అభివృద్ధి కోసం సిద్ధంగా ఉండండి
● దేవుని వాక్యం మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందా?
● కృప యొక్క వరము (బహుమతి)
● మీ మానసిక స్థితిని మెరుగుపరుచుట
● 02 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కోపాన్ని (క్రోధాన్ని) అర్థం చేసుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్