english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: #21 వ రోజు
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: #21 వ రోజు

Saturday, 1st of January 2022
2 0 1506
Categories : Fasting and Prayer
షాలోమ్
నా కుటుంబం మరియు కరుణా సదన్ పరిచర్య బృందం తరపున, "మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఫలవంతమైన మరియు శాంతియుత నూతన సంవత్సరం 2022" శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయండి
 సమూయేలు 7:12లో, సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, "యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని" చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెడం గురించి చదువుతాం. ప్రభువు నమ్మకత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికి కొంత సమయం ఎందుకు తీసుకోకూడదు. ఆయన నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుడి మరియు ఆయన మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళతాడు.

1. పరలోకపు తండ్రీ, నా జీవితంలో నీవు లేకుంటే, మేము ఇక్కడి వరకు దీన్ని చేయలేమని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
2. తండ్రీ దేవా, యేసు నామంలో 2021 సంవత్సరంలో నాపై మరియు నా కుటుంబ సభ్యులపై నీ నమ్మకత్వానికి, నీ కృపకై, నీ సిద్ధపాటుకై, నీ మార్గదర్శకత్వముకై మరియు నీ రక్షణకై నేను నీకు వందనాలు తెలియజేస్తున్నాను.

3. ప్రియమైన అబ్బా తండ్రీ, 2022 సంవత్సరంలో నా కుటుంబ సభ్యులకు మరియు నాకు సంబంధించిన ప్రతిదాన్ని మీరు యేసు నామంలో పరిపూర్ణం చేస్తారని నాకు నమ్మకం ఉంది.

మిమ్మల్ని, మీ ఇంటిని, మీ ఆస్తులను మరియు మీ కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే, వాటిని కూడా నూనెతో అభిషేకించండి.

ధ్యానించుటకు కొన్ని లేఖనాలు

యెషయా 43:18-19
యిర్మీయా 29:11
2 కొరింథీయులకు 5:17

ప్రార్థన
[ప్రతి ప్రార్థన అస్త్రము మీ హృదయం నుండి వచ్చేంత వరకు పునరావృతం చేయండి. ఆ తర్వాత మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రాన్ని చేయండి. దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి]

తండ్రీ, యేసు నామంలో, నేను 2021 లో చూసిన ప్రతి బాధ మరియు ఎదురుదెబ్బను, ఆజ్ఞాపిస్తున్నాను, నేను వాటిని మళ్లీ ఎప్పటికీ, యేసు నామంలో చూడను.

తండ్రీ, యేసు నామంలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యాన్ని పొందాలని మరియు మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ (3 యోహాను 2), ఈ సంవత్సరం 2022 మాతో అంతా మంచిగా సాగాలని నేను ప్రార్థిస్తున్నాను. 

కరుణా సదన్ పరిచర్యకు వ్యతిరేకంగా దుర్మార్గుల ప్రతి నిరీక్షణ యేసు నామంలో చెల్లాచెదురు అవును గాక.

నేను మరియు నా కుటుంబ సభ్యులు 2022 అంతా బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే మా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేసెదము.

పరిశుద్దాత్మ దేవా, 2022 సంవత్సరంలో నీ మహిమను చూడటానికి నా కళ్లను ఉత్తేజపరచు.

పరిశుద్దాత్మ దేవా, 2022 సంవత్సరంలో నీ మహిమను వినడానికి నా చెవులను ఉత్తేజపరచు. నాకు ఉపదేశము చేసి నేను నడవవలసిన మార్గ మును నాకు బోధింపుము. యేసు నామంలో నాకు దైవిక మార్గమును చూపుము.

పరిశుద్దాత్మ దేవా, 2022 సంవత్సరంలో అభివృద్ధి చెందడానికి నా చేతులను చైతన్యవంతం చేయి.

పరిశుద్దాత్మ దేవా, యేసు నామంలో 2022 సంవత్సరంలో ఉజ్జీవనము కోసం నా ఆత్మ, ప్రాణం మరియు శరీరాన్ని చైతన్యవంతం చేయి.

ఈ సంవత్సరం 2022, ప్రభువా, నేను నిన్ను ఘనపరుస్తాను; అందుచేత నన్ను అతీతంగా దీవించు. సమస్త విషయాలలో నేను నీకు మొదటి స్థానం ఇస్తాను.

ఓ దేవా 2022లో, నా నా కుటుంబ సభ్యుల మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు ఆయన మిమ్మును గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మా పాదములకు రాయి తగులకుండ వారు మమ్మును తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు.

తండ్రీ, యేసు నామంలో, ఈ తరం యొక్క చరిత్రను యేసు నామంలో తిరిగి వ్రాయడానికి నన్ను ఉపయోగించు.

పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం మరియు కరుణా సదన్ పరిచర్య కోసం ప్రార్థించడానికి ప్రభువు మిమ్మల్ని నడిపించునంతంగా దయచేసి కొంత సమయం కేటాయించండి.
ఓ నూతన ఆరంభం గల దేవా: ఈ నూతన సంవత్సరం 2022లో: నా గత వైఫల్యాలను మరియు అవమానాన్ని యేసు రక్తంతో తుడిచివేయి! యేసు నామంలో.

ఓ మహిమ గల వాక్యం (దేవా): నాకు ప్రత్యక్షమై, ఈ సంవత్సరం నా రహస్య అవమానాన్ని తుడిచివేయి! యేసు నామంలో.

ఓ నూతన ఆరంభం గల దేవా: ఈ సంవత్సరం నా జీవితంలో నీ వాక్యం యొక్క సమృద్ధి నా జీవితంలో ప్రత్యక్షమై ప్రతి పేదరికాన్ని మ్రింగివేయి! యేసు నామంలో.

2022 సంవత్సరంలో నా జీవితంలో, కుటుంబంలో మరియు కరుణా సదన్ పరిచర్యలో యేసు నామంలో ఆనందం, సమాధానం, సూచక క్రియలు మరియు దేవుని కృప నిరాటంకంగా ప్రవహిస్తుందని నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను. ఆమెన్.

ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఆయనను ఆరాధించడం కొనసాగించండి.

మీ సాక్ష్యాన్ని పంచుకోండి: దయచేసి మీ సాక్ష్యాన్ని మాకు పంపడానికి NOAH యాప్ మెనులో 'సాక్ష్యాలు' అనే బటను క్లిక్ చేయండి.

మీ సాక్ష్యాలు ప్రభవును మహిమపరుస్తుంది మరియు ఆయన ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది.


Join our WhatsApp Channel


Most Read
● మీ పూర్తి సామర్థ్యాన్నికి చేరుకొనుట
● కాముకత్వం మీద విజయం పొందడం
● మహిమ మరియు శక్తి గల భాష - భాషలు
● క్రీస్తు సమాధిని జయించాడు
● దేవుడు మీ శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడా?
● విత్తనం యొక్క గొప్పతనం
● మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్