అనుదిన మన్నా
ఇతరుల పట్ల కృపను విస్తరింపజేయండి
Wednesday, 19th of January 2022
4
0
918
Categories :
కృప (Grace)
అనేక సందర్భాలలో ప్రభువు తన మహా కృపను మనపై చూపించాడనే విషయాన్ని మనం కాదనలేము. కాబట్టి, మనం, కూడా ఇతరుల పట్ల కృపను చూపాలని చెప్పబడుతుంది. ఇతరుల పట్ల కృపను చూపడం అంటే వారు అర్హులు కానప్పుడు కూడా దయను చూపడం. మనం ఉచితంగా పొందిన కృపను విస్తరింపజేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
1. మాటలు (సంభాషణ)
మీరు ఏమి చెబుతున్నారో మరియు ఎలా చెబుతున్నారో అనే విషయంలో కృపతో మరియు మృదువుగా చెప్పండి.
పౌలు అన్నాడు, "మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి" (కొలొస్సయులకు 4:6). అపోస్తుడైన పౌలుకు మంచి మరియు ప్రోత్సహించడం కోసం నాలుక యొక్క శక్తి గురించి తెలుసు మరియు యేసయ్య కోసం ఇతరులను ప్రాబల్యం చేయడానికి మరియు ప్రభావితం చేయడానికి మాటలను ఉపయోగించేవాడు.
మన అనుదిన జీవితం ఇతరులను ఉద్ధరించే మరియు కృపతో కూడిన మాటలతో నిండినప్పుడు మన ప్రార్థనలు మరింత శక్తిని మరియు ఆయన సన్నిధిని కలిగి ఉంటాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. (ఎఫెసీయులకు 4:29 చదవండి)
2. మర్చిపోండి లేదా వదిలేయండి
ప్రజలు చెడు రోజును అనుభవిస్తున్న సందర్భాలు ఉంటాయి మరియు మీ తప్పు లేకున్న కూడా వారు తమ నిరాశను మీపై రుద్దుతారు. అలాంటి సమయాల్లో, సహజమైన ప్రతిస్పందన వారికి మీ మరొ స్వభావాన్ని చూపండి. వ్యర్థముగా ప్రతిస్పందించే బదులు, ప్రశాంతంగా ఉండండి మరియు వారిని వదిలివేయండి. మీరు ఆ వ్యక్తికి ఉచితంగా పొందిన కృపను విస్తరింపజేస్తున్నారు. ఇది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కానీ ఇలా చేయడం వలన మీరు మరో కొత్త స్థాయికి వెళ్లవచ్చు.
"కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును." (సామెతలు 20:3)
3. అక్కడ ఉండండి
ముఖ్యంగా మనం ప్రస్తుతం జీవిస్తున్న రోజులలో, వారు ప్రియమైన వారు మరియు వారిని మరచిపోలేదని చూపించడానికి ఒక ఫోన్ కాల్, ఒక సందేశం మాత్రమే చాలా అవసరం. అతని పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక వ్యక్తికి కాల్ చేయండి. ఏమి అవసరం ఉందో లేదో తెలుసుకోండి మరియు మీకు వీలైతే, మీరు చేయగలిగినది కొంచెం చేయండి. సంతోషంగా ఉన్న వ్యక్తితో సంతోషంగా ఉండండి; బాధగా ఉన్న వ్యక్తితో బాధపడండి అని బైబిలు స్పష్టంగా చెబుతుంది.
"సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చు వారితో ఏడువుడి." (రోమీయులకు 12:15)
ఇది దేవుని దృష్టిలో సంతోషకరమైనది మాత్రమే కాదు, ఇది లోకాన్ని నివసింపజేయడానికి మెరుగైన ప్రదేశంగా మారుస్తుంది. గుర్తుంచుకోండి, తరచుగా చిన్న విషయాలే చాలా ముఖ్యమైనవి.

ప్రార్థన
తండ్రీ, నీ మహా కృపకై వందనాలు. నేను దానికి అర్హుడను కాను, అయినా నీవు దానిని నా మీద కుమ్మరించావు. ప్రభువా, ఈ కృపను ఇతరుల పట్ల విస్తరింపజేయడానికి నాకు శక్తిని దయచేయి. యేసు నామంలో. ఆమెన్.
Most Read
● ఇటు అటు సంచరించడం ఆపు● మీరు చెల్లించాల్సిన వెల
● వాక్యం యొక్క ప్రభావం
● మీరు నిజమైన ఆరాధకులా
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 2
● సహనాన్ని లేదా ఓర్పును హత్తుకోవడం
● దోషానికి సంపూర్ణ పరిష్కారం
కమెంట్లు