english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఇక నిలిచి ఉండిపోవడం చాలు
అనుదిన మన్నా

ఇక నిలిచి ఉండిపోవడం చాలు

Friday, 4th of February 2022
2 0 824
Categories : సంబంధాలు (Relationships)
చిన్నప్పుడు, మా అమ్మ ఎప్పుడూ సరైన రకమైన వారితో స్నేహితులను చేసుకోమని చెబుతూ ఉండేది. నా పాఠశాలలో ఉన్నవారు లేదా నాతో పాటు ఆడుకునే స్నేహితుల సమూహం. కానీ నాకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆమె నాకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తుందో అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు.

"మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును." (1 కొరింథీయులకు 15:33)

సరైన వ్యక్తులతో సమయాన్ని గడపడం అనేది మీరు జీవితంలో తీసుకోగల ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. దేవుని స్వరాన్ని గుర్తించడం మరియు మీ జీవితానికి ఆయన చిత్తాన్ని గుర్తించడం ప్రారంభించడానికి ఇది అత్యంత క్రియాత్మక రంగాలలో ఒకటి.

సామెతలు 13:20 ఇలా సెలవిస్తుంది, "జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును."

స్నేహితుల నుండి వ్యాపార సహోద్యోగుల నుండి జీవిత భాగస్వామి వరకు మీరు మీ జీవితంలోకి అనుమతించే వ్యక్తుల గురించి తెలివైన ఎంపికలు చేయడానికి దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. సరైన వ్యక్తులను పొందుకోవడం అనేది మీ జీవితంలో దేవుని చిత్తాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన భాగం.

దేవుడు మన జీవితాలలో ముఖ్యమైన కార్యము చేసిన ప్రతిసారీ, మన విధి మరియు ఉద్దేశ్యంతో అనుసంధానించబడిన కొత్త వ్యక్తులను ఆయన మనకు పరిచయం చేస్తాడు. దేవుని స్వరాన్ని గుర్తించడం మరియు ఆయన నడిపింపును అనుసరించడం నేర్చుకుంటే చెడు సంబంధాల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది మరియు సరైన వ్యక్తులతో మిమ్మల్ని పరిచయం చేస్తుంది.

మీరు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడే వ్యక్తులు మీ ఎదుగుదలకు లేదా మీ పతనానికి బాధ్యత వహిస్తారు. కాబట్టి మీ చుట్టూ సరైన వ్యక్తులు ఉండటం చాలా ముఖ్యం.

మీ చుట్టూ సరైన వ్యక్తులను పొందడానికి రెండు మార్గాలు:

మీరు వెతకాలనుకుంటున్న మొదటి ప్రధాన లక్షణం విలువలు సరిపోల్చడం. మీ విలువలతో ప్రతిధ్వనించే వ్యక్తులను వెతకండి. మీరు ప్రార్థనకు విలువనిస్తే, మీరు సంప్రదింస్తున్న వ్యక్తులు ప్రార్థనకు విలువ ఇచ్చే వ్యక్తులు అయి ఉండాలి. మరియు జాబితా కొనసాగతుంది. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను.

రెండవది హృదయపూర్వకంగా ప్రార్థించడం, "ప్రభువా నన్ను సరైన వ్యక్తులతో చుట్టుముట్టు. సరైన వ్యక్తులతో నన్ను కలుపు. ఎడారిలో పక్షులను పంపిన అదే ప్రభువు మీ చుట్టూ సరైన వ్యక్తులను ఖచ్చితంగా పంపుతాడు.

ఈ ప్రవచనాత్మక వాక్యాన్ని అనుసరించండి మరియు మీ జీవితం తదుపరి స్థాయికి వెళ్లడాన్ని చూడండి.

ప్రార్థన

తండ్రీ, నా జీవితంలో వివేచన అనే వరమును నాకు దయచేయి. తప్పుడు వ్యక్తుల నుండి సరైన వ్యక్తులను తెలుసుకోవడానికి మరియు నీ రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్న వారితో సహవాసం చేయడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● కాలేబు యొక్క ఆత్మ
● సమయానుకూల విధేయత
● కృతజ్ఞతలో ఒక పాఠం
● నరకం నిజమైన స్థలమా
● మీ స్పందన ఏమిటి?
● విత్తనం యొక్క గొప్పతనం
● మీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్