తమ ఆలోచనలకు ఫలితమైన కీడు (యిర్మీయా 6:19)
దేవుడు మన ఆలోచనల గురించి చాలా చింత కలిగి ఉన్నాడు.
ప్రధాన కారణాలలో ఒకటి ఎందుకంటే - మంచి లేదా చెడు కోసం మనం చేసే ప్రతిదాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది.
#1: ఆలోచనలు మన జీవితాలను నియంత్రిస్తాయి
"నీవు ఎలా ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా ఉండు; నీ ఆలోచనల ద్వారా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది" (సామెతలు 4:23 GNT)
మీరు చిన్నపిల్లవానిగా లేదా యవ్వనుడిగా ఉన్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని మంచి కోసం కాక పదేపదే ఓడిపోయినవాడా అని పిలిచుంటారు. మీరు ఆ ఆలోచనను అంగీకరించినట్లయితే, అది తప్పు అయినప్పటికీ, అది మీ జీవితాన్ని రూపొందిస్తుంది.
#2: మన మనసులు నిజమైన యుద్దభూమి
"క్రైస్తవ జీవితం ఆటస్థలం కాదు యుద్ధభూమి" అని ఎవరో నిజంగానే చెప్పారు.
ఈ యుద్ధభూమి కొన్ని దేశాలలో లేదు, మన మనస్సుల్లోనే ఉంది. చాలా మంది మానసికంగా అలసిపోయారు మరియు నిరాశకు గురవుతున్నారు, ప్రధానంగా వారు తీవ్రమైన మానసిక యుద్ధంలో ఉన్నందున ఓపిపోయే అంచున ఉన్నారు. మీ మనస్సు ఒక గొప్ప సంపద, మరియు సాతాను మీ యొక్క గొప్ప సంపదను కోరుకుంటున్నాడు!
గమనించండి, ఒక వ్యక్తిని అపవిత్ర పరిచే మనుష్యుల హృదయం నుండి వచ్చే మొదటి విషయాలుగా యేసు ప్రభువు చెడు ఆలోచనలను సూచిబద్దంగా చేసాడు.
లోపలి నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలి నుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను. (మార్కు 7:21-23)
#3: మీ మనస్సు శాంతికి తాళం చెవి లాంటిది
ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు! (యెషయా 26:3)
మన ఆలోచనలు మన పరిస్థితులకు బదులుగా ఆయన మీద స్థిరంగా ఉన్నప్పుడు పూర్ణ శాంతి అనేది ఒక వాస్తవికతని గమనించండి. ప్రార్థన మరియు ఆరాధన ద్వారా మీరు ఆయనపై మీ మనస్సును స్థిరపరచవచ్చు.
అలాగే, యుద్ధ మనస్సు గెలవడానికి, దేవుని సంతోషపెట్టే విషయాలతో మీ మనస్సును నింపుకోండి. అందుకే వాక్యాన్ని చదవడం మరియు ధ్యానించడం చాలా ముఖ్యం. ఎవరో నన్ను రోజూ ఎన్ని అధ్యాయాలు చదవాలని అడిగారు? మన చుట్టూ మంచి ఆహారం ఉన్నప్పుడు, మనలో చాలా మంది మనకు సంతృప్తి చెందే వరకు తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మీరు దేవుని వాక్యంతో కూడా నడుచుకోవాలి. మీరు ఆత్మలో సంతృప్తి అనుభూతిని పొందే వరకు చదవండి.
మీ సంపూర్ణ జీవితం - మీ మనస్సుతో సహా - యేసు క్రీస్తుకు సమర్పించడం ద్వారా ఈ రోజే నుండే ప్రారంభించండి. మీరు విజయ పంతములో నడుస్తారు.

ఒప్పుకోలు
నేను యేసయ్య రక్తంతో నా ఆలోచనలను కప్పుతున్నాను. చెడు ఆలోచనలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రతి శక్తి, నేను నిన్ను యేసు నామంలో బంధిస్తున్నాను. నన్ను అపవిత్రం చేయడానికి ప్రయత్నిసున్నా ప్రతి శక్తి, యేసు నామంలో అగ్ని ద్వారా కాలిపోవును గాక. నేను రోజూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. నా మనసును నింపడానికి నేను వాక్యాన్ని అనుమతిస్తాను. యేసు నామంలో. ఆమెన్.
Most Read
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?● ప్రతి ఒక్కరికీ కృప
● స్నేహితుని అభ్యర్థన: ప్రార్థన ద్వారా ఎన్నుకొనుట
● అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం
● హామీ గల సంతృప్తి
● శ్రేష్ఠత్వమును ఎలా కొనసాగించాలి?
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
కమెంట్లు