అనుదిన మన్నా
పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
Saturday, 3rd of August 2024
3
2
729
Categories :
పరిపక్వత (Maturity)
బాధ్యత (Responsibility)
మీరు జీవితంలో గొప్పగా ఉండాలనుకుంటే, మీకు అప్పగించబడిన బాధ్యతలను ఎల్లప్పుడూ మీ ఉత్తమంగా చేయడానికి నేర్చుకోండి మరియు వాటిని అద్భుతంగా నెరవేర్చడానికి క్రమశిక్షణతో ఉండండి. (2 తిమోతి 4:7 CEV)
మీరు ప్రస్తుతం ఇంట్లో, పనిలో లేదా సంఘంలో చేస్తున్న పనులు, ఇతరులు చేస్తున్న విధంగా ఉత్తేజకరమైన పనులతో పోలిస్తే నీరసంగా మరియు అలవాటుగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, లేఖనము చెప్పినట్లు, "చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము" (ప్రసంగి 9:10). పేరు కోసం సేవ చేయడానికి ఆశించవద్దు. ఏమి ఆశించకుండా సేవ చేయండి - అదే బాధ్యత.
మహారాజు సైన్యంలో పోరాడుతున్న తన సహోదరుల పనిలా ఉత్సాహంగా అనిపించకపోయినా, తన తండ్రి గొర్రెలకు కాపలాగా దావీదు గొప్ప బాధ్యతను కనబరిచాడు. 8 మంది కుమారులు ఉన్న కుటుంబంలో వారిలో చిన్నవాడు ఇష్టపూర్వకంగా కుటుంబ గొర్రెలను సంరక్షించడం నాకు ఆశ్చర్యంగా ఉంది.
దావీదు యుద్ధభూమికి వెళ్ళినప్పుడు, అతడు గొర్రెలను తన సహోదరులలో ఒకరి కూడా అప్పగించకుండా ఒక గొర్రెల కాపరి వద్ద వదిలిపెట్టి వెళ్ళాడు:
1 సమూయేలు 17:20 ఇలా చెబుతోంది, "దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను"
మీకు నీరసంగా మరియు అలవాటుగా అనిపించే పనులను నమ్మకంగా మరియు శ్రద్ధగా ప్రతి రోజు చేసినప్పుడు, అది మీలో 'బాధ్యత' అనే అరుదైన లక్షణాన్ని పుట్టిస్తుంది. ఇది మీ DNAలో శాశ్వతంగా మారుతుంది.
లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది, "మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును." (లూకా 16:10 NLT)
రెండవదిగా, మీకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడల్లా, ఎల్లప్పుడూ ఆధారపడదగిన మరియు ఆధారపడే వ్యక్తిగా ఉండటానికి మీ వంతు కృషి చేయండి. ఎల్లప్పుడూ పనులను ప్రారంభించి, కానీ వాటిని పూర్తి చేయని వ్యక్తిగా ఉండకండి. బదులుగా, ప్రారంభించి పూర్తి చేసే వ్యక్తిగా ఉండండి.
ఈ గుణ లక్షణాలు మిమ్మల్ని గొప్ప వ్యక్తుల ముందు నిలబెట్టి, మీకు శాశ్వతమైన విజయాన్ని అందిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా ఈ గుణ లక్షణాలు మీకు విజయాన్ని అందించడమే కాకుండా, మీరు చేసే మరియు మీరు చెప్పేదానిపై కూడా ప్రజలు విశ్వసించడం ప్రారంభిస్తారు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ఎక్కువ ప్రభావంతో వ్యాప్తి చేయడంలో మీకు సహాయం చేస్తుంది.
కాబట్టి, మీ దరికి వచ్చే ఏ బాధ్యతలను అవి ఎంత నీచంగా మరియు ప్రాపంచికమైనవిగా అనిపించన తృణీకరించవద్దు. మీ ముందున్న గొప్ప భవిష్యత్తు కోసం దేవుడు మీకు శిక్షణ ఇస్తున్నాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
చివరగా, మీరు మీ బాధ్యతల బరువుతో బాధపడాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు దేవునికి ఎలా లోబడి యుండాలో నేర్చుకోవాలి. మీరు ప్రతిరోజూ ప్రార్థన, ఆరాధన మరియు దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం ద్వారా బయట ఉన్న గందరగోళం కంటే లోపల దేవుని శాంతి బలంగా ఉండే వరకు మీరు దీన్ని చేయవచ్చు.
అందుకే ప్రభువైన యేసయ్య ఇలా సెలవిచ్చాడు: "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి." (యోహాను 14:27)
అదనపు అధ్యయనం కోసం, పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్ గారి గొఱ్ఱెల ఆధ్యాత్మిక బాధ్యతలు అనే ప్రసంగ వీడియోను చూడండి.
ప్రార్థన
తండ్రీ, నేను నీ దృష్టికి విలువైన, బాధ్యతాయుతమైన సేవకుడిని అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. నీ మహిమ కొరకు నాకు అప్పగించబడిన బాధ్యతలను నిర్వర్తించుటకు నేర్పుము. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● తప్పుడు ఆలోచనలు● వెతికే మరియు కనుగొనే యొక్క కథ
● దేవుడు గొప్ప ద్వారములను తెరుస్తాడు
● దేవుని యొక్క 7 ఆత్మలు: బలము గల ఆత్మ
● 22వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● యుద్ధం కోసం శిక్షణ - 1
కమెంట్లు