అనుదిన మన్నా
శపించబడిన వస్తువును తీసివేయుడి
Thursday, 9th of February 2023
1
1
960
Categories :
విడుదల (Deliverance)
శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. (యెహొషువ 6:18)
ఒక వ్యక్తి ఒకసారి నా దగ్గరకు వచ్చి ఒక విచిత్రమైన సంఘటనను పంచుకున్నాడు. అతడు కొత్త ఇంటికి మారాడు, కానీ విచిత్రమైన అలౌకిక ప్రదర్శన సంభవించాయి. కొన్నిసార్లు అతడు మరియు అతని భార్య ఒక ప్రత్యేకమైన గది నుండి వింతగా, కొంత దుర్మార్గపు ఉనికిని అనుభవించారు. అనేక సందర్భాల్లో, వారిద్దరూ ఇదే గదిలో ఒక ఆవిరి వంటి నీడ ఆకారంలో నేల మీదుగా వేగంగా కదులుతున్నట్లు చూశారు. వారి కుమార్తె మరియు కుమారుడు కూడా అదే ఆందోళనను వినిపించారు, మరియు వారు ప్రార్థన కోసం నా వద్దకు ఈ విషయాన్ని తీసుకువచ్చారు.
అతడు వెంటనే వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేసిన కొన్ని వందల సంవత్సరాల నాటి చెక్క పురాతన వస్తువు గురించి చెప్పాడు. దాని అందం మరియు వయస్సు కారణంగా అతడు దానిని కొనుగోలు చేశాడు. కొన్ని తెగలు ఆఫ్రికాలోని ఈ పురాతన వస్తువును దెయ్యాల ఆచారాలలో ఎలా ఉపయోగించారో నేను అతనికి వివరించాను, ఇది దుష్టశక్తులను ఆకర్షిస్తుంది.
అపవాది ఎల్లప్పుడూ ఇళ్లలో ఒక అవకాశం కోసం ప్రయత్నిస్తుంది, తద్వారా వాడు చొచ్చుకుపోయి ప్రవేశం పొందగలడు. మీరు అమాయకంగా ఒక కళాకృతిని కొనుగోలు చేయడాన్ని ఊహించుకోండి; అది తర్వాత మెడలో హుక్గా మారుతుంది. ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నట్లు ఊహించుకోండి, మరియు అది మీ ఇంటిలో శాంతిని దొంగిలించడం ప్రారంభిస్తుంది. ఇవన్నీ అపవాది యొక్క పన్నాగాలు. మీ ఇల్లు అపవాది దాడులకు గురైందని మరియు మీరు కారణం కొరకు మీ వేలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? లేదా మీరు మీ ఇంటిలో శాంతిని కోల్పోయారా, మరియు మీరు మీ భార్యపై తప్పులను యెంచుతున్నారా?
మత్తయి 13:24-30లో యేసు ఇలాంటి ఉపమానాన్ని చెప్పాడు. బైబిలు ఇలా చెబుతోంది, "ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగు లెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి యెదుగ నియ్యుడి; కోతకాల మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను."
మనుష్యులు నిజానికి మంచి విత్తనాలు నాటారు, కానీ ఏదో తప్పు జరిగింది. విత్తనాన్ని పాడుచేయడానికి శత్రువు వచ్చాడు. "ఇది శత్రువు చేసిన పని" అని యేసయ్య సెలవిచ్చాడు. శత్రువు మీ ఇంట్లో శపించబడిన వస్తువును నాటాడు. దేవుని ఆత్మకు భిన్నమైన వింత ఆత్మలతో శత్రువు మీ ఇంట్లోకి చొరబడ్డాడు. అవును, మీరు అమాయకంగా ఇంటిని కొనుగోలు చేసారు మరియు మీరు చాలా స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారనడంలో సందేహం లేదు, అయితే పోరాటాల వెనుక శత్రువు ఉన్నాడు.
ఇక్కడ యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది, మనము శత్రువు యొక్క కార్యములను తీసివేయాలి మరియు దానిని కాల్చివేయాలి. మీ వివాహంలో దేవుడు మీకు శపించబడిన వస్తువుగా ఏమి చూపించాడు? మీ కుటుంబంలో శాపగ్రస్తమైనదిగా దేవుడు మీకు ఏమి సూచించాడు? దాన్ని దూరపరచి, కట్టి కాల్చే సమయం వచ్చింది. అపవాది మీ శాంతిని మరియు ఆనందాన్ని దొంగిలించడాన్ని మీరు చూడలేరు. ఇది ఆత్మలో పోరాటాన్ని దూరపరిచే సమయం ఆసన్నమైంది కాబట్టి శపించబడిన వస్తువు మీ ఇంటిని దురపరచబడును గాక. మీకు ఏది అక్కరలేదు, మీరు అది చూడరు.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీవు నా ఇంటికి తీసుకువస్తున్న విముక్తికై నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబంలో నీ దయ మరియు కృపకై వందనాలు.. మా ఆనందాన్ని దొంగిలించడానికి మరియు మమ్మల్ని హింసించడానికి అపవాది ఉపయోగిస్తున్న శపించబడిన వస్తువును చూడటానికి నీవు మా కళ్ళను తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం నిజంగా స్వతంత్రంగా ఉందని నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● అవిశ్వాసం● కృప వెంబడి కృప
● నిందలు మోపడం
● ఉత్తమము మంచి వాటికి శత్రువు
● యెహోవాకు మొఱ్ఱపెట్టము
● మీ అభివృద్ధి కోసం సిద్ధంగా ఉండండి
● మీ అనుభవాలను వృథా చేయవద్దు
కమెంట్లు