"అయితే ఆయన ఇలా జవాబిచ్చాడు, "పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును." (మత్తయి 15:13)
ఇది కొందరికి వింతగా
అనిపించవచ్చు, కానీ మీ
ఇంట్లో కొన్ని పదార్థాలు లేదా వస్తువులు ఉండడం వల్ల శపించబడిన వాతావరణాన్ని
సృష్టించవచ్చు. ఉదాహరణకు, కొన్నిసార్లు, వ్యక్తులు సాతాను ఆచారాలలో ఉపయోగించిన వస్తువును ఇంటికి
తీసుకురావచ్చు. అశ్లీలత వంటి ఇతర విషయాలు కూడా కొన్ని రకాల ఆత్మలకు ద్వారాలు
తెరవవచ్చు. కొన్నిసార్లు ఒక వస్తువు దాని మీద ఉంచబడిన శాపాన్ని కలిగి ఉండవచ్చు.
ఐగుప్తు నుండి కత్తి
ఇశ్రాయేలులోని పరిశుద్ధ దేశ్ మా పర్యటనలలో ఒకటి, మేము ఐగుప్తును కూడా సందర్శించాము. పర్యటనలో ఉన్నప్పుడు,
మా సభ్యుల్లో ఒకరు మాకు తెలియకుండానే కత్తిని కొనుగోలు
చేశారు. ఇది చాలా పాతది మరియు చాలా చక్కని రూపాన్ని కలిగి ఉన్నందున అతడు దానిని
కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు,
అతడు తన ఛాతీ మీద కూర్చొని ఉన్న వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి
అవడం చూసాడు. భయభ్రాంతులకు గురైన అతని భార్య, రాత్రి నాకు ఫోన్ చేసి జరిగిన ఘోరం గురించి చెప్పింది.
మరుసటి రోజు పరిచర్య
సమయంలో, ఈ
వ్యక్తి ఆత్మ యొక్క శక్తి ద్వారా విడుదల చేయబడ్డాడు. ఈ బొమ్మ తనపై అరుస్తూ,
"నన్ను ఎందుకు చంపావు?"
అని అడిగాడని అతడు తరువాత నాతో చెప్పాడు. అతడు కత్తిని
విసిరి వేసాడు, మరియు ఆ
దృశ్యాలు ఆగిపోయాయి.
దీన్ని చదివే చాలా మందికి
ఈ విషయాలు విచిత్రంగా మరియు వింతగా అనిపిస్తాయని నేను గ్రహిస్తున్నాను. ఏది
ఏమైనప్పటికీ, ఆధ్యాత్మిక
యుద్ధం అనేది మనస్సులో లేదా ఊహలో జరగదు; అది చాలా వాస్తవమైనది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు:
"ఏలయనగా మనము పోరాడునది శరీరులతో [శారీరికప్రత్యర్థులతో మాత్రమే పోరాడుతున్నాము]
కాదు, గాని
ప్రధానులతోను, అధికారులతోను,
ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న (అలౌకిక) దురాత్మల సమూహములతోను
పోరాడుచున్నాము." (ఎఫెసీయులకు6:12)
చీకటి శక్తుల
చొచ్చుకొనిపోయే శక్తికి మీరు ఆధ్యాత్మికంగా సున్నితంగా ఉండలేరు. మనము యుద్ధంలో ఉన్నాము
మరియు శత్రువు కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (ప్రపంచ వాణిజ్య కేంద్రం) దాడి
జరిగినప్పుడు, టెర్రరిస్టు
భవనం నేలపై నుంచి సుత్తితో పేల్చివేయలేదు; సెక్యూరిటీ వారిని అరెస్ట్ చేయకుంటే చాలా సంవత్సరాలు
పట్టిఉండవచు. కాబట్టి వారు భూమిపై ఉన్న ఎత్తైన భవనాలలో ఒకదానిని ఒక్కసారిగా కిందకి
దించే వ్యూహం కోసం వెళ్లారు. అలాగే, శత్రువు కుటుంబ వెనకాల
ఉంటాడు ఎందుకంటే కుటుంబాన్ని ఒకసారి దెబ్బతీస్తే, సమాజం కూడా దెబ్బతింటుందని వాడికి తెలుసు.
కాబట్టి,
మనము కుటుంబాన్ని రక్షించడానికి పని చేయాలి. మన కుటుంబాల
మీద శత్రువుల జోక్యానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. మన ఇంట్లో దుష్టుల
మొక్కులు ఉంచలేము. మనం వాటిని తీసి వేయాలి. మనకు తెలియకుండానే ఎక్కువ కాలం వాటికి
నీళ్ళు పోశాము; వాటిని
పీకే సమయం వచ్చింది. వాటిని మన కుటుంబాల నుండి వేరు చేసి, శాంతి పాలన కోసం వాటిని తీసివేయాల్సిన సమయం ఇది.
అశ్లీలత
ఇది మన ఆధ్యాత్మిక స్థితి మీద ఆదేశాన్ని పొందడానికి శత్రువు ఉపయోగించే మరొక
శపించబడిన విషయం. మీరు సినిమాని కొనుగోలు చేయాల్సిన రోజులు పోయాయి,
కానీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మీరు
కేవలం ఆన్లైన్లో వెతకాలి మరియు మీరు అశ్లీల సైట్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
వివాహాలను వేరు చేయడానికి మరియు యువకుల విధిని నాశనం చేయడానికి సాతాను
ఉపయోగిస్తున్న అవినీతిలో ఇది ఒకటి. వద్దు అని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ
వ్యసనానికి వ్యతిరేకంగా ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ టీవీని ఆపివేయి,
ఆ సైట్‌ను వదిలివేసి, మీరు వాని కీలుబొమ్మ కాదని అపవాదికి తెలియజేయండి. మీరు
గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు, కాబట్టి మీరు స్వతంత్రంగా ఉన్నారు.
మీ ఇంటిలో తన ఉనికితో
పోరాడటానికి నిలబడి ఉన్న చీకటి శక్తులన్నింటికీ వ్యతిరేకంగా దేవుడు మీ ఇంటి చుట్టూ
అగ్ని గోడను నిర్మించమని ప్రార్థించండి. మీరు విజేత, బాధితుడు కాదు.
Most Read
● ఆశీర్వాదం యొక్క శక్తి● మూడు పరిధులు (రాజ్యాలు)
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్లైన్లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● దేవుని వాక్యమును మీ హృదయంలో లోతుగా నాటండి
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● ఘనత మరియు గుర్తింపు పొందుకొనుట