అనుదిన మన్నా
మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 2
Thursday, 16th of February 2023
0
0
476
Categories :
వాతావరణం (Atmosphere)
విడుదల (Deliverance)
“పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా. (అపొస్తలుల కార్యములు 3:1)
మీరు మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చాలనుకుంటే నిమగ్నమవ్వడానికి మరొక ముఖ్య విషయము ప్రార్థన. అభివృద్ధి చెందుతున్న ఇంటికి ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తిలేని క్రైస్తవుడని తరచుగా చెబుతుంటారు. దేవుడు ప్రార్థనను దేవుడు మరియు మనిషికి మధ్య వర్తమాన మాధ్యమంగా నియమించాడు. దేవుని కుమారుడైన యేసయ్య మనకు ప్రార్థించడం నేర్పించడమే కాదు, వ్యక్తిగత ప్రార్థన చేయడానికై నిదర్శనంగా ఉన్నాడు. మత్తయి 6:6లో బైబిలు ఇలా చెబుతోంది, "నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును."
మార్కు 1:35లో యేసయ్య గురించి బైబిలు ఇలా చెబుతోంది, “ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. అలాగే, లూకా 5:16లో, "ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను." ఆయన పరిచర్య ప్రార్థనలతో గుర్తించబడింది; ఆయన ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఫలితాలను నమోదు చేయడంలో ఆశ్చర్యం లేదు.
మన ఇంటి వాతావరణాన్ని మార్చాలంటే యేసులాగా, మనము కూడా ఉత్సాహపూరితమైన ప్రార్థనా బలిపీఠాన్ని కలిగి ఉండాలి. లూకా 18:1లో యేసు ఇలా చెప్పాడు, “వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను,” మన ఇల్లు మండే చలిమంటలా ఉండాలి, అది రాత్రిపూట దాని చుట్టూ ఉన్న ప్రజలను వెచ్చగా ఉంచుతుంది. పర్యటకుల మీద దాడి చేయకుండా మృగాలను దూరంగా ఉంచుతుంది. కాబట్టి, సాతాను మరియు వాని కార్యాలన్నిటిని మన ఇంటి నుండి దూరంగా ఉంచడానికి మనము ఉత్సాహపూరితమైన ప్రార్థన బలిపీఠాన్ని కలిగి ఉండాలి.
కాబట్టి, ప్రార్థన కోసం మనకు ఒక స్థలం మరియు సమయం ఉండాలి. ప్రార్థనను అవకాశంగా వదిలివేయవద్దు. మనం కుటుంబ సమేతంగా ప్రార్థించే సమయం ఉండాలి. ప్రార్థన సమయంలో శిష్యులు దేవాలయానికి వెళ్లారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు కేవలం ప్రేరణతో ప్రార్థించరని వారు యేసయ్య నుండి నేర్చుకున్నారు, కానీ మనము ప్రార్థనలలో క్రమశిక్షణతో ఉండాలి మరియు మనం ప్రార్థన చేయడానికి సమయాన్ని నిర్ణయించినప్పుడు అది సాధ్యమవుతుంది.
మీ ఇంటిలో మీ దేవునితో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించండి. మీ పిల్లలకు మీరు సహాయం చేసేవారు కాదని, దేవుడని తెలియజేయండి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని నుండి దూరంగా ఉంచుతారు. వారు తమ హృదయాన్ని దేవుని వైపు మళ్లించరు, కానీ తమవైపుకు తిప్పుకుంటారు. కాబట్టి వారికి అవసరమైనప్పుడు, అవును, వారు మీ వద్దకు వస్తారు, కానీ దేవుడే దయచేయు వాడని వారికి తెలియజేయండి. మీరు ఒక ఆధారము మాత్రమే అని వారికి తెలియజేయండి. కాబట్టి మీరు వారికి సహాయం చేయలేని పరిస్థితుల్లో వారు తమను తాము కనుగొన్నప్పుడు, ప్రభువు వైపు ఎలా తిరగాలో వారికి తెలుస్తుంది.
ప్రార్థనలో మన ఉత్సాహం దుష్ట ఆత్మలు మరియు అపవాది కార్యములను మన ఇళ్ల నుండి దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మన పిల్లలు తమను లక్ష్యంగా చేసుకున్న శత్రువుల దాడిని అధిగమించడానికి ప్రార్థన బలిపీఠం మీద అధికారం పొందారు. ఇంట్లో ప్రార్థన ద్వారా, మీరు మీ ఇంటిని చీకటి శక్తుల కోసం కార్యం లేని ఇంటిగా చేస్తారు. మీరు అపవాది మరియు వాని ప్రతినిధులకు వ్యతిరేకంగా శాశ్వతంగా తలుపులు మూసివేశారు.
మీరు మీ ఇంట్లో సమాధానము మరియు ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ఇది చాలా ముఖ్యం. హెబ్రీయులు 9:14లో బైబిలు ఇలా చెబుతోంది, "నిత్యమైన ఆత్మ ద్వారా దేవునికి మచ్చ లేకుండా తనను తాను అర్పించుకున్న క్రీస్తు రక్తము, సజీవుడైన దేవునికి సేవ చేయుటకు మీ మనస్సాక్షిని మృత క్రియల నుండి ఎంత ఎక్కువ శుద్ధి చేస్తుంది?" ప్రార్థన యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, మనం ప్రతి ఘోరమైన అలవాటును ప్రార్థనల ద్వారా సిలువ మీద వేయగలము.
మన పిల్లలలోని ప్రతి వ్యసనాన్ని పోగొట్టడానికి మనము యేసు రక్తాన్ని ప్రార్థనలో నిమగ్నం చేస్తాము. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రార్థన యొక్క అగ్నిలో నిమగ్నమైనప్పుడు వ్యసనం నుండి సహాయం చేయడానికి పునరావాసం లేదా సలహాదారు కోసం వేచి ఉంటారు. కాబట్టి, ఈ చివరి రోజులలో మీరు ఆధిపత్యం చెలాయించవలసి వస్తే, దానిని కొనసాగించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి మరియు కుటుంబ సమేతంగా ప్రార్థించండి.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, ప్రార్థన యొక్క పిలుపుకై నా కళ్ళను తెరిచినందుకు వందనాలు. నా హృదయాన్ని సత్యంతో నింపమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ప్రార్థనలో బలహీనంగా ఉండకూడదని, ఆత్మలో ఉత్సాహంగా ఉండటానికి నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పటి నుండి, నేను సోమరపోతును కాను, మా బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉంటుంది. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● 17 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● వర్షం పడుతోంది
● శీర్షిక: ఆయన చూస్తున్నాడు
● విశ్వాసంతో నడవడం
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?
● మూల్యం చెల్లించుట
● 07 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు