"ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి." (లూకా 17:11-12)
ఆ పది మందిలో ఒకరిగా ఊహించుకోండి. కుష్టు రోగముతో వచ్చే నొప్పి, ఒంటరితనం, తిరస్కరణ మరియు భయాన్ని ఊహించుకోండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, వారు ఇతరుకు దూరంగా ఉండాలని, తమ బట్టలు చింపుకొని, "అపవిత్రులు, అపవిత్రులు" అని కేకలు వేయడం గురించి తెలుసుకోవడం ఊహించుకోండి. వారి హృదయాలలో నిస్సహాయత మరియు నిస్పృహలు ఎలా ఉంటాయో ఊహించుకోండి.
ఇంకా, ఈ కుష్టురోగులకు మనలో చాలామంది మరచిపోయే విషయం తెలుసు: కరుణకై ఎలా కేకలు వేయాలో వారికి తెలుసు. "యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి" వారు తమ స్వరములను ఎత్తిరి (లూకా 17:13).
మీ స్వరం ఎత్తడం ప్రార్థనకు ప్రతీక. మీ పరిస్థితిలో దేవుడు కలిపించుకోవాలని మీరు కోరుకున్నట్లైతే, మీరు ప్రార్థనలో మీ స్వరాన్ని ఎత్తడం అత్యవసరం.
వారు యేసును తమ ఏకైక నిరీక్షణగా గుర్తించి, కనికరం కోసం ఆయనను వేడుకున్నారు. మరియు యేసు ఏమి సెలవిచ్చాడు? ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి" (లూకా 17:14). అయితే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. (లూకా 17:15-16)
చాలా మంది స్వస్థత మరియు విమోచన పొందుతారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే వచ్చి సాక్ష్యమివ్వడం ద్వారా ప్రభువును మహిమపరుస్తారు.
ఈ విషయము మనకు కృతజ్ఞత గురించి అనేక పాఠాలు నేర్పుతుంది. మొదటిది, కృతజ్ఞత అనేది ఒక ఎంపిక. మన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టడాన్ని మనం ఎంచుకోవచ్చు లేదా మన వద్ద ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండడాన్ని ఎంచుకోవచ్చు. యేసు వద్దకు తిరిగి వచ్చిన కుష్ఠురోగి తన కృతజ్ఞతను తెలియజేయడానికి ఒక మేల్కొలుపు ఎంపిక చేసుకున్నాడు మరియు దాని కారణంగా అతడు ఆశీర్వదించబడ్డాడు.
రెండవదిగా, కృతజ్ఞత అనేది ఒక రకమైన ఆరాధన. ఆయన ఆశీర్వాదాల కోసం మనం దేవునికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను మరియు ఆయన దయను మనం అంగీకరిస్తాము. మనము ఆయనను మహిమపరుస్తాము మరియు ఆయనకు తగిన ఘనతను దయచేస్తాము.
చివరగా, కృతజ్ఞత సాంక్రామికము. మనం మన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచినప్పుడు, ఇతరులను కూడా అలాగే చేయమని ప్రేరేపిస్తాము. మనము ఆనందం మరియు నిరీక్షణను వ్యాప్తి పరుస్తాము మరియు మన చుట్టూ ఉన్నవారికి మనం దీవెనకరంగా అవుతాము.
మనం మన అనుదిన జీవితాలను గడుపుతున్నప్పుడు, కుష్టురోగులను మరియు వారి కనికరం కోసం చేసిన ఆర్తనాదాలను గుర్తుచేసుకుందాం. యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వ్యక్తిని కూడా గుర్తుంచుకుందాం మరియు ఆయన మాదిరిని అనుసరిద్దాం. మనము కృతజ్ఞతతో ఉండుటకు, దేవుని ఆరాధించడానికి మరియు మనం ఎక్కడికి వెళ్లినా ప్రభువు మరియు ఆయన నిరీక్షణ యొక్క ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ఎంచుకుందాం.
ప్రార్థన
తండ్రీ, నేను ఈ రోజు కృతజ్ఞతా హృదయంతో నీ యొద్దకు వస్తున్నాను. నా పట్ల మరియు నా కుటుంబం పట్ల నీ కనికరముకై వందనాలు; అవి ప్రతిరోజూ నూతనమైనవి. నేను ఎక్కడికి వెళ్లినా నన్ను నీ ఆశీర్వాదకరంగా మార్చు. యేసు నామములో. ఆమెన్!
Join our WhatsApp Channel
Most Read
● దానియేలు ఉపవాసం● పవిత్రునిగా చేసే నూనె
● ప్రేమతో ప్రేరేపించబడ్డాము
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు
● దేవుని ప్రతిబింబం
● భయపడే ఆత్మ
● మీరు ఎంత బిగ్గరగా మాట్లాడగలరు?
కమెంట్లు