జ్ఞాపకాలు మన జీవితంలో ముఖ్యమైన భాగం. అవి మన తప్పుల నుండి నేర్చుకోడానికి, మన ఆశీర్వాదాలను ఘనపరచడానికి మరియు మన భవిష్యత్తు కోసం మార్గాన్ని అందించడంలో మనకు సహాయపడతాయి. అయితే, అన్ని జ్ఞాపకాలు సమానంగా సృష్టించబడవు. మనందరికీ మంచి మరియు చెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మంచి జ్ఞాపకాలు సంతోషాన్ని, ఓదార్పుని మరియు నిరీక్షణను కలిగిస్తుండగా, చెడు జ్ఞాపకాలు మనల్ని వెంటాడతాయి, గాయపరుస్తాయి మరియు మన అభివృద్ధిని కుంటుపరుస్తాయి.
చెడు జ్ఞాపకాలు మరియు మన గత పాపపు జీవితం మన భవిష్యత్తును నియంత్రించకూడదని బైబిలు మనకు బోధిస్తుంది. మనమందరం పాపులము మరియు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నాము (రోమా 3:23). క్రైస్తవ మతంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన అపొస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు తార్సుకు చెందిన అపఖ్యాతి పాలైన సౌలు, అతడు క్రైస్తవులను హింసించాడు మరియు స్తెఫను మరణానికి అంగీకరించాడు (అపొస్తలుల కార్యములు 8:1). అయితే, అతని మార్పు తర్వాత, పౌలు మారిన వ్యక్తి. అతడు తన జీవితాన్ని సువార్త ప్రకటించడానికి అంకితం చేశాడు మరియు అతని రచనలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా మరియు నేటికీ సంబంధితంగా ఉన్నాయి.
అయితే అప్పటికి కొన్ని సంఘాలు పౌలు యొక్క మార్పిడి గురించి జాగ్రత్తగా ఉన్నాయి. అతడు సంఘంలోకి చొరబడి మరియు భవిష్యత్తులో బంధించడానికి పేర్లను సేకరిస్తాడనే ఆశతో అతడు నట్టిస్తున్నాడని వారు భయపడ్డారు. పౌలు వారి ఆందోళనను అర్థం చేసుకుని, ఫిలిప్పీయులకు ఇలా వ్రాశాడు, "వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను" (ఫిలిప్పీయులకు 3:13-14). మరో మాటలో చెప్పాలంటే, చెడు జ్ఞాపకాలు గతం యొక్క సమాధిలో భూస్థాపితం చేయబడాలని మరియు ఎప్పటికీ పునరుత్థానం చేయబడకూడదని పౌలుకు తెలుసు.
అయితే మంచి జ్ఞాపకాల సంగతేంటి? వాటిని కూడా మరిచిపోవాలా? ఖచ్చితంగా కాదు! మంచి జ్ఞాపకాలు అమూల్యమైన సంపదలు, వాటిని మనం ఎంతో ఆదరించి, మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఉపయోగించాలి. దేవుడు మన కోసం ఎలా వచ్చాడో, మన ప్రార్థనలకు జవాబిచ్చాడో, అద్భుతం చేశాడో లేదా ఊహించని రీతిలో మనల్ని ఎలా ఆశీర్వదించాడో గుర్తుచేసుకున్నప్పుడు, మనకు ఆయన మంచితనం మరియు నమ్మకత్వం గుర్తుకు వస్తాయి.
ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశములోకి ప్రవేశించినప్పుడు, ఆ నది నుండి పన్నెండు రాళ్లను తీసుకొని, వారికి మరియు భవిష్యత్తు తరాలకు తన అద్భుత ఏర్పాటును గుర్తుచేసేందుకు ఒక నిబంధన మందసముగా నిర్మించమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు (యెహొషువ 4:1-9). అదేవిధంగా, కొత్త నిబంధనలో, యేసు తన మరణం మరియు పునరుత్థానానికి జ్ఞాపకార్థంగా ప్రభువు రాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశాడు (లూకా 22:19-20). ఈ రెండు నిబంధన మందసములు దేవుని శక్తి, ప్రేమ మరియు నమ్మకత్వముకు స్పష్టమైన జ్ఞాపకాలుగా పనిచేశాయి.
కాబట్టి, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మరియు జీవితంలో ముందుకు సాగడానికి మంచి జ్ఞాపకాలను ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి:
1. జ్ఞాపకము తెచ్చుకొని మరియు వందనాలు చెప్పండి:
మీ గతం యొక్క మంచి జ్ఞాపకాలను ప్రతిబింబించడానికి సమయాన్ని వెచ్చించండి మరియు ఆయన ఆశీర్వాదాలు, ఏర్పాట్లు మరియు రక్షణ కోసం దేవునికి వందనాలు చెప్పండి. కృతజ్ఞత అనేది భయం, ఆందోళన మరియు నిరాశకు శక్తివంతమైన విరుగుడు. మోషే నలభై సంవత్సరాలుగా తాను కాపలాగా ఉన్న దేవుని ప్రజలకు ఇలా సెలవిచ్చాడు, “జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము" (ద్వితీయోపదేశకాండము 4:9).
2. మీ సాక్ష్యాన్ని పంచుకోండి:
మీ కథనం సరూపముగానున్న పోరాటాలను ఎదుర్కొనే ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరియు ప్రోత్సహించగలదు. దేవుడు మీ జీవితంలో ఎలా పని చేసాడో పంచుకోవడానికి బయపడకండి.
3. నిబంధన రూపముగా నిర్మించండి:
మీరు ఇశ్రాయేలీయుల వలె భౌతిక నిబంధనగా నిర్మించాల్సిన అవసరం లేదు, కానీ మీరు దేవుని మంచితనానికి సంబంధించిన దృశ్యమాన జ్ఞాపకముగా సృష్టించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ప్రార్థనలు మరియు వాటికి సమాధానాలను వ్రాయవచ్చు, చిరస్మరణీయ క్షణాల ఆల్బముగా తయారు చేయవచ్చు లేదా దేవుని ప్రేమను మీకు గుర్తుచేసే పాటల జాబితాను రూపొందించవచ్చు.
4. దేవుని నమ్మకత్వము మీద విశ్వాసం ఉంచండి:
మంచి జ్ఞాపకాలు దేవుని నమ్మకత్వము మీద మరియు మన అవసరాలను తీర్చడానికి, మన నిర్ణయాలలో మనకు మార్గనిర్దేశం చేయడానికి మరియు భవిష్యత్తు కోసం మనకు నిరీక్షణను అందించడానికి విశ్వసించవచ్చని మనకు గుర్తుచేస్తాయి. మనం కొత్త సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని బలపర్చుకోవడానికి ఆ జ్ఞాపకాలను మనం ఉపయోగించుకోవచ్చు. "యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను జ్ఞాపకము తెచ్చుకొందును" (కీర్తనలు 77:11).
చెడు జ్ఞాపకాలను గతం యొక్క సమాధిలో భూస్థాపితం చేయాలని మర్చిపోవద్దు, కానీ మంచి జ్ఞాపకాలను భద్రపరచాలి మరియు మన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించాలి. మనం పౌలు చెప్పిన మాటలను గుర్తుంచుకుని, దేవుని విశ్వాసం మీద కృతజ్ఞతతో మరియు నమ్మకంతో మన పిలుపు లక్ష్యం వైపు పయనిద్దాం.
ప్రార్థన
పరలోకపు తండ్రి, సమస్త మంచి జ్ఞాపకాలకై వందనాలు. ఈ జ్ఞాపకాలను ఎంతో ఆదరించడానికి మరియు నీ పై మా విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని బలోపేతం చేయడానికి వాటిని ఉపయోగించుకోవడానికి మాకు సహాయం చేయి. దయచేసి ప్రతి చెడ్డ జ్ఞాపకాన్ని తొలగించు. మేము మా పిలుపు లక్ష్యం వైపు పయనించడానికి మాకు మార్గనిర్దేశం చేయి. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి● మీ గురువు (బోధకుడు) ఎవరు - II
● నా దీపమును వెలిగించు ప్రభువా
● యజమానుని యొక్క చిత్తం
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
● శత్రువు రహస్యంగా ఉంటాడు
● ఇది ఒక్క పని చేయండి
కమెంట్లు