english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. బలిపీఠం మరియు మంటపం
అనుదిన మన్నా

బలిపీఠం మరియు మంటపం

Thursday, 20th of April 2023
2 1 872
Categories : Fasting and Prayer Intimacy with God Restoration
దేవుడు సెలవిచ్చాడు, "యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడిచాలి" (యోవేలు 2:17).

యోవేలు 2:17లో, తన ముందు వినయం మరియు దుర్బలత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి సూచిస్తూ, మంటపం మరియు బలిపీఠం మధ్య కన్నీరు విడచమని దేవుడు యాజకులను ఆదేశించాడు. ఈ పదునైన చిత్రం పరిచర్య యొక్క ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడుతుంది: బహిరంగంగా (మంటపం) మరియు వ్యక్తిగతంగా (బలిపీఠం). మంటపం, అందరికీ కనిపించే విధంగా, బోధించడం, నేర్పించడం మరియు సువార్త సభల ప్రయత్నాల వంటి పరిచర్య యొక్క బహిరంగ అంశాలను గురించి సూచిస్తుంది. మరోవైపు, బలిపీఠం అనేది ప్రార్థన, ఆరాధన మరియు వ్యక్తిగత సమర్పణ ద్వారా వర్ణించబడిన దేవునితో వ్యక్తిగత సహవాస స్థలం.

మంటపం మరియు బలిపీఠం మధ్య యాజకులు కన్నీరు విడిచాలని దేవుడు ఇచ్చిన పిలుపు క్రైస్తవుని జీవితంలో బహిరంగ మరియు వ్యక్తిగత పరిచర్య యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక శక్తివంతమైన జ్ఞాపకము. ఆధ్యాత్మిక వృద్ధికి మరియు ఇతరుల పట్ల సమర్థవంతంగా పరిచర్య చేసే సామర్థ్యానికి ఈ సమతుల్యత అవసరం.

మత్తయి 6:1-6 వ్యక్తిగత భక్తి కార్యములో పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతుంది. ఇతరులకు కనబడే విధంగా మరియు మెప్పు కోసం బహిరంగంగా నీతిని పాటించకూడదని యేసు ప్రభువు హెచ్చరించాడు. బదులుగా, రహస్యంగా జరిగే వాటిని చూసే మన తండ్రి మనకు ప్రతిఫలమిస్తాడని హామీ ఇవ్వడంతో, రహస్యంగా ఇవ్వమని, ప్రార్థించమని మరియు ఉపవాసం ఉండమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. మన వ్యక్తిగత పరిచర్య నిజమైనదై ఉండాలని మరియు ఇతరుల ఆమోదం కంటే దేవునితో మనకున్న బంధంపై దృష్టి కేంద్రీకరించాలని ఈ భాగం బోధిస్తుంది.

బహిరంగ పరిచర్య కూడా చాలా అవసరం, ఎందుకంటే ఇది యేసుక్రీస్తు సువార్తను ప్రపంచంతో పంచుకోవడానికి అనుమతిస్తుంది. మత్తయి 28:19-20లో, యేసు తనను వెంబడించే వారికి "వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడని ఆజ్ఞాపించాడు, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు, నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించాడు." ఈ గొప్ప సువార్తను వ్యాప్తి చేయడంలో మరియు దేవుని రాజ్యాన్ని విస్తరించడంలో బహిరంగ పరిచర్య యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతుంది.

ఏది ఏమైనప్పటికీ, యేసు వ్యక్తిగత జీవితంలో ప్రదర్శించినట్లుగా, బహిరంగ మరియు వ్యక్తిగత పరిచర్య మధ్య కీలకమైన సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. మార్కు 1:35 లో, ప్రభువైన యేసు తన బహిరంగ పరిచర్యను నిర్వహించే ముందు ఏకాంతంగా ప్రార్థించడానికి ఉదయాన్నే మేల్కొలపడం మనం చూస్తాము. ఆ సమయాలలో వ్యక్తిగత భక్తిలో, స్వస్థత, చనిపోయినవారిని లేపడం, సమృద్ధి మరియు మరిన్నింటిలో దేవుని శక్తి యొక్క బహిరంగ ప్రదర్శనలు కుమ్మరించబడ్డాయి.

దేవుని కుమారుడైన యేసు కూడా తన బహిరంగ పరిచర్యను బలపరచడానికి మరియు సన్నద్ధం కావడానికి తండ్రితో వ్యక్తిగత సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చాడని ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. నేను ఒక క్రైస్తవు జీవితాన్ని నమ్ముతాను; దేవునికి బహిరంగ పరిచర్య కంటే ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా ఉండాలి.

దేవుని ప్రతిఫలం అందరికీ కనిపిస్తాయి. యోబు జీవితాన్ని ఒక్కసారి గమనించండి. అతడు వినాశకరమైన విచారణ గుండా వెళ్ళాడు మరియు ప్రతిదీ కోల్పోయాడు. అతని సంపద, అతని కుటుంబం మరియు అతని ఆరోగ్యం అన్నీ తీసివేయబడ్డాయి. అయినప్పటికీ అతడు ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు మరియు వ్యక్తిగత భక్తి పట్ల నమ్మకంగా ఉన్నాడు.

యోబు ఇలా అన్నాడు, "ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని" (యోబు 23:12). మరియు దేవుడు "యోబు నష్టాలను పునరుద్ధరించాడు" మరియు అతనికి "రెండింతలు" ఇచ్చాడు (యోబు 42:10). ఆయన "యోబు యొక్క చివరి రోజులను అతని ప్రారంభం కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు" (వ.42) మరియు అతనికి ఎక్కువ మంది కుమారులు మరియు కుమార్తెలను కూడా ఇచ్చాడని బైబిలు చెబుతుంది. దేవుని బహిరంగ ప్రతిఫలము యోబు జీవితాన్ని నింపాయి.

మీరు రహస్యంగా ఇవ్వడం, ప్రార్థన మరియు ఉపవాసం కారణంగా ప్రభువు మీకు బహిరంగంగా ప్రతిఫలమివును గాక. ప్రజలు మిమల్ని చూసి, "ప్రభువు ఏమి చేసాడో చూడండి" అని చెబుతారు.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతీక చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

1.నా అభివృద్ధికి ఆటంకం కలిగించే, నా కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతి సాతాను అడ్డంకులు యేసు నామములో అగ్ని ద్వారా నిర్మూలించబడును గాక.

2.కరుణా సదన్ పరిచర్య అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతి సాతాను అడ్డంకులు యేసు నామములో అగ్ని ద్వారా నిర్మూలించబడును గాక.

3.జీవితంలో నా విజయానికి మరియు సంపదకు ఆటంకం కలిగించే ప్రతి సాతాను అడ్డంకి, యేసు నామములో ముక్క ముక్కలుగా విరిగిపోవును గాక.

4.యేసు నామములో నా జీవితం మరియు కుటుంబ సభ్యుల మీద దేవుని అగ్ని వచ్చును గాక.

5.యేసు నామములో కరుణా సదన్ పరిచర్య మీద దేవుని అగ్ని వచ్చును గాక.

6.ప్రభువా, నా ప్రార్థనలకు సమాధానమిచ్చినందుకు వందనాలు. యేసు నామములో ఆమేన్.

Join our WhatsApp Channel


Most Read
● 05 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● విత్తనం యొక్క గొప్పతనం
● ఇక నిలిచి ఉండిపోవడం చాలు
● దైవ క్రమము -1
● క్రీస్తు రాయబారి
● కుమ్మరించుట
● పోలిక (పోల్చుట అనే) ఉచ్చు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్