english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ జీవితాన్ని మార్చుకోవడానికి బలిపీఠానికి ప్రాధాన్యత ఇవ్వండి
అనుదిన మన్నా

మీ జీవితాన్ని మార్చుకోవడానికి బలిపీఠానికి ప్రాధాన్యత ఇవ్వండి

Sunday, 23rd of April 2023
1 0 911
Categories : Altar Fire of God

యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. (ఎజ్రా 3:2)

ఒక యూదుని జీవితం సమస్తం దేవుని మందిరం చుట్టూ తిరుగుతుంది. సైన్యాలు దాడి చేయడంతో మందిరాన్ని అప్పటికే ధ్వంసం చేసిన దృశ్యం ఇప్పుడు కనిపించింది. ఎజ్రా దైవికంగా ప్రేరేపించబడ్డాడు మరియు పడిపోయిన దేవుని మందిరాన్ని పునరుద్ధరించడానికి నియమించబడ్డాడు.

ఆసక్తికరంగా, వారు మందిరాన్ని నిర్మించడానికి ముందు, వారు దేవుని బలిపీఠాన్ని నిర్మించారు. వారు బలిపీఠంతో ప్రారంభించారు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక ప్రాధాన్యత.

"నీకు మందిరం కాకుండా బలిపీఠం ఉండొచ్చు, కానీ బలిపీఠం లేకుండా మందిరం ఉండకూడదు" అనే ఈ సిధ్ధాంతాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కానుకను పవిత్రం చేసేది మందిరం కాదు, కానీ కానుక పవిత్రం చేసేది బలిపీఠం. శక్తి ఆలయం నుండి కాదు, బలిపీఠం నుండి వస్తుంది. మందిరంలో జరిగేదంతా బలిపీఠం ద్వేరా వస్తుంది.

ఈ సిధ్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని;

మీరు గొప్ప పరిచర్యను నిర్మించడానికి ముందు, ముందుగా మీ ప్రార్థనా బలిపీఠాన్ని నిర్మించండి

మీరు ఇంటిని నిర్మించే ముందు, ముందుగా ఒక బలిపీఠాన్ని నిర్మించండి

మీరు వివాహాన్ని నిర్మించే ముందు, ముందుగా ఒక బలిపీఠాన్ని నిర్మించండి

మీరు వ్యాపారాన్ని నిర్మించే ముందు, ముందుగా బలిపీఠాన్ని నిర్మించండి

మీరు ఈ ప్రాధాన్యతను జాగ్రత్తగా చూసుకుంటే, మిగితా విషయాలు వాటంతట అవే జరుగుతాయి.

 

బలిపీఠం ప్రాధాన్యత గురించి యేసు ప్రభువు స్వయంగా ఇలా సెలవిచ్చాడు

కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33)

 

సారాంశంలో, మీరు అన్నిటికంటే బలిపీఠాన్ని నిర్మించడానికి ప్రాధాన్యతనిస్తే, మిగతావన్నీ జరుగుతాయని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఇది మీరు మరియు నేను నిర్లక్ష్యం చేయకూడని శక్తివంతమైన సిధ్ధాంతం.

బలిపీఠం అంటే ఏమిటి?

బలిపీఠం మార్పు గల స్థానము. ఇది ఆధ్యాత్మికం మరియు సహజత్వం మధ్య కలిసే స్థానం, దైవత్వం మరియు మానవత్వం మధ్య సమావేశం. బలిపీఠం అంటే దేవుడు మానవుని కలిసే స్థానము.

బలిపీఠం అనేది విధిని మార్చే ప్రదేశం.

 

పాత నిబంధనలో, బలిపీఠం భౌతిక స్థలం. దేవుని కలవాలంటే మరెక్కడా కలవలేని విధంగా, ఈ బలిపీఠము యొద్దకు మీరు వెళ్లాల్సిందే. మీరు అర్పించవలసి వస్తే, మీరు అర్పించడానికి ఈ స్థలానికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే, కొత్త నిబంధనలో, బలిపీఠం ఒక ఆధ్యాత్మిక స్థానము. ఇక్కడే మానవుని ఆత్మ దేవుని ఆత్మను కలుసుకుంటుంది.

బైబిలు దినాలలో, యూదులు యెరూషలేములో బలిపీఠం కలిగి ఉన్నారు మరియు సమరయులు సమరయలో వారి బలిపీఠాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరూ తమ బలిపీఠం సరైనదని వాదించారు. ఇది యూదులు మరియు సమరయుల మధ్య గొప్ప శత్రుత్వానికి దారితీసింది. దీనివల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కూడా.

యేసు ప్రభువు యాకోబు బావి వద్ద సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు, ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు.

అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు మీ హృదయములో (ఆత్మీయ మనిషి) తప్పఈ పర్వతము మీదనైనను (సమరియాలో) యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు - యోహాను 4:21

 

మనం పరిశుద్ధాత్మ ఆలయం కాబట్టి ఇకపై శారీరక బలిపీఠాలను నిర్మించము.

ప్రార్థన, ఆరాధన మరియు వాక్యంలో ప్రతిరోజూ ప్రభువును వెతకడం మీ ప్రాధాన్యతగా చేసుకోండి. మీ బలిపీఠానికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది.

ప్రార్థన
1. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 

2. అలాగే, మీరు ఉపవాసం లేని దినాలలో ఈ ప్రార్థన అంశములను ఉపయోగించండి. 

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
నా దేవా మరియు నా ప్రభువా, నా జీవితంలో ఎల్లప్పుడూ నిన్ను మొదటి స్థానంలో ఉంచడానికి నాకు నీ కృపను దయచేయి.
పరిశుద్దాత్మ, యేసు నామములో నీ పరిశుద్ధ అగ్ని ద్వారా నా ఆత్మీయ మనిషిని వెలిగించు.

కుటుంబ రక్షణ
పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యేసు నామములో నా మీద మరియు నా కుటుంబ సభ్యుల మీద తాజాగా మళ్లీ వచ్చును గాక.
యెహోవా, నీ అగ్ని నా జీవితంలో, నా కుటుంబంలో యేసు నామములో పరిశుద్ధత కానివన్నీ కాల్చబడును గాక.

ఆర్థిక అభివృద్ధి
సహాయం కోసం నా వైపు చూసేవాడు నిరాశ చెందడు. నా అవసరాలను సంతృప్తి పరచడానికి మరియు అవసరమైన ఇతరులకు ఇవ్వడానికి నా దగ్గర తగినంత కంటే ఎక్కువ ఉండును. నేను ఇచ్చువాడను కాని పుచ్చుకునే వాడను కాను. యేసు నామములో.

KSM సంఘం
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు, సిబ్బంది మరియు బృంద సభ్యులు అలౌకిక జ్ఞానము, వివేకము, ఆలోచన బలము, తెలివి మరియు యెహోవా పట్ల భయంతో నడవాలని నేను ప్రార్థిస్తున్నాను (యెషయా 11:2-3)

దేశం
తండ్రీ, నీ నీతి మా దేశాన్ని నింపను గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క సమస్త శక్తుల నాశనం అవును గాక. మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో శాంతి మరియు సమృద్ధితో ఉండును గాక. యేసు నామములో.


Join our WhatsApp Channel


Most Read
● కొత్త నిబంధనలో నడిచే దేవాలయము
● వాక్యం యొక్క ప్రభావం
● మాట్లాడే వాక్యం యొక్క శక్తి
● దేవుని హెచ్చరికలను విస్మరించవద్దు
● ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం అనుభవించే దీవెనలు
● ఆధ్యాత్మిక తలుపులను మూసివేయడం
● పందెములో పరుగెత్తడానికి ప్రణాళికలు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్