ప్రపంచం చెబుతోంది, "తీరని సమయాల్లో తీరని కార్యాలు అవసరం." దేవుని రాజ్యంలో అయితే, తీరని సమయాల్లో అసాధారణమైన కార్యాలు అవసరమవుతాయి. కానీ, మీరు "అసాధారణమైన కార్యాలు అంటే ఏమిటి?" అని మీరు అడగవచ్చు.
యెషయా 59:19 మనకు ఇలా సెలవిస్తుంది:
శత్రువు ప్రవాహంలా వచ్చినప్పుడు,
ప్రభువు యొక్క ఆత్మ వానికి వ్యతిరేకంగా ఒక ప్రమాణాన్ని నిలుపుతుంది. (యెషయా 59:19)
దేవుని ఆత్మ ఎల్లప్పుడూ శత్రువు చేయడానికి ప్రయత్నిస్తున్న దానికంటే ప్రామాణిక మార్గాన్ని నిలుపుతాడు. మన నిరాశకు బైబిలు యొక్క ఆజ్ఞ ఒక 'ప్రవచనాత్మక గీతము' లేఖనములోని ప్రవచనాత్మక గీతము ఎల్లప్పుడూ ఎదుగుదలకు సాధనంగా ఉంది.
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదా యంతట ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా (2 దినవృత్తాంతములు 20:3)
2 దినవృత్తాంతములు 20 ఒక రోజు, రాజు జోెహోషాపాతు తన రాజ్యానికి వ్యతిరేకంగా 'విస్తారమైన సైన్యం' వస్తున్నట్లు సమాచారం అందుకున్నట్లు చెబుతుంది. దీనికి ప్రతిస్పందనగా, అతడు దేవుని వెతకడం ప్రారంభించాడు. దేవుని వెతకడం మరియు ప్రార్థించడం మధ్య వ్యత్యాసం ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి.
వివరించడానికి నాకు అనుమతి ఇవ్వండి: మీరు ప్రభువును వెతుకుతున్నప్పుడు, మీరు ప్రార్థిస్తున్నారని అర్థం అయితే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు నిజంగా ప్రభువును వెతకవచ్చు లేదా వెతుకకపోవచ్చు. ఇది మీ అవసరాలు, మీ జీవితం మొదలైన వాటి గురించి కావచ్చు, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది మీరు అర్థంచేసుకున్నారని ఆశిస్తున్నాను.
మనం ప్రభువును వెతుకుతున్నప్పుడు, అది ఆయన గురించి - ఆయన సన్నిధి, ఆయన వాక్యము. మన మనస్సు పూర్తిగా ఆయనపై కేంద్రీకృతమై ఉంది. మన అవసరాలు తరువాత సంగతి. కొన్నిసార్లు, ప్రార్థనలో, ఇవన్నీ ఆయన గురించి కాకుండా మన స్వంత గురించి కావచ్చు.
ప్రభువును వెతుకుతున్న ప్రజలకు ప్రతిస్పందనగా, వారు ఒక ప్రవచనాత్మక వాక్యాన్ని అందుకున్నారు: 'యుద్ధం మీది కాదు, దేవునిది.' మీరు ఆయనని వెతుకుతున్నప్పుడు ప్రవచనాత్మక వాక్యాలు ఎల్లప్పుడూ వస్తాయి. ప్రవచనం అనేది దేవుడు తన మనస్సు నుండి మన పరిస్థితిని గురించి మాట్లాడటం తప్ప మరొకటి కాదు.
ఈ వాక్యముతో చాలా మంది తీవ్రస్థాయికి వెళ్లారు. 'యుద్ధం మీది కాదు, దేవునిది' అంటే మీరు ఎక్కడో దాక్కున్నారని కాదు. మీరు యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ శుభవార్త ఏమిటంటే మీరు పోరాడవలసిన అవసరం లేదు. దావీదు గోలియాత్ని ఎదుర్కోవలసి వచ్చింది, కానీ ప్రభువు యుద్ధం చేశాడు.
ఈ రోజు మీరు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభువును వెతకడం ప్రారంభించండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ప్రభువు తన మనసులోని మాట చెబుతాడు. ఇప్పుడు ఆయన మనస్సు గురించి మీకు తెలుసు కాబట్టి ముందుకు సాగండి. విజయం మీదే. మీరు ఒక విజేత కంటే ఎక్కువ.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నన్ను ప్రేమిస్తున్నందున నేను విజేత కంటే ఎక్కువగా ఉన్నందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను నిన్ను హృదయపూర్వకంగా వెతకాలని ఎంచుకున్నాను. దయచేసి నా పరిస్థితి గురించి నీ మనస్సుతో మాట్లాడు, తద్వారా నీవు చూసినట్లుగా నా పరిస్థితిని నేను చూస్తాను. యేసు నామంలో. ఆమెన్.
కుటుంబ రక్షణ
తండ్రీ, రక్షణ యొక్క కృపకై కోసం నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను; తండ్రీ, నీ కుమారుడైన యేసును మా పాపాల కోసం చనిపోవడానికి పంపినందుకు వందనాలు. తండ్రీ, యేసు నామమున, (ప్రియమైన వ్యక్తి పేరును పేర్కొనండి) నీ జ్ఞానంలో ప్రత్యక్షతను దయచేయి. నిన్ను ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకునేందుకు వారి కళ్ళు తెరువు.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నా పిలుపును నెరవేర్చడానికి ఆర్థిక అభివృద్ధి కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. నీవు గొప్ప పునరుద్ధరణకర్తవి.
KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, KSM యొక్క సమస్త పాస్టర్‌లు, గ్రూప్ సూపర్‌వైజర్లు మరియు J-12 లీడర్‌లు నీ వాక్యంలో మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. అలాగే, KSMతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి నీ వాక్యం మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. యేసు నామములో.
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశ సరిహద్దులలో శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. మా దేశంలోని ప్రతి రాష్ట్రంలో శాంతి మరియు గొప్ప అభివృద్ధి కోసం మేము ప్రార్థిస్తున్నాము. మా దేశంలో నీ సువార్తకు ఆటంకం కలిగించే ప్రతి శక్తిని నాశనం చేయి. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● 36 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● మీకు దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఎలా ప్రార్థించాలి
● మీ సౌలభ్యము నుండి బయటపడండి
● అపకీర్తి గల పాపానికి ఆశ్చర్యమైన కృప అవసరం
● కాలేబు యొక్క ఆత్మ
కమెంట్లు