english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. జయించే విశ్వాసం
అనుదిన మన్నా

జయించే విశ్వాసం

Friday, 7th of July 2023
0 0 1435
Categories : జయించువాడు (Overcomer) నూతన స్వభావం (New Nature) మన గుర్తింపు (Our Identity in Christ)
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? (1 యోహాను 5:4-5)

ప్రకటన 2 మరియు 3 అధ్యాయాలలో, యేసు ప్రభువు ఏడు సంఘాల గురించి సంబోధిస్తాడు. ప్రతి సంఘంలో, జయించే వారందరికీ ఒక వాగ్దానం ఉంది. మీతో చాలా నిజాయితీగా చెపుతున్నాను, ఈ వాగ్దానాల వల్ల నేను కొంతవరకు భయపడ్డాను ఎందుకంటే అవి సహజముగా కొంత షరతులతో కూడుకున్నవని నేను అనుకున్నాను.

ఒకసారి గమనించండి:
చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. (ప్రకటన 2:7)

జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు. (ప్రకటన 2:11)

జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును (ప్రకటన 2:17)

నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. (ప్రకటన 2:26)

జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక..... (ప్రకటన 3:5)

జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను (ప్రకటన 3:12)

జయించువానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. (ప్రకటన 3:21)

అయితే, నేను 1 యోహాను 5:4-5 చదివినప్పుడు, అది నా ఆత్మకు స్వేచ్ఛనిచ్చింది. విజేతగా జాబితా చేయబడటానికి అర్హత అంటే యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన పనిపై మన విశ్వాసాన్ని ఉంచడం అని అర్థం చేసుకున్నాను. మనందరి కోసం యేసు శిలువపై చేసినదానినికై కలపడానికి లేదా తీసివేయడానికి మీరు మరియు నేను ఏమీ చేయలేము.

'జయించడం' అనేది ఒక శక్తివంతమైన పదం, మరియు దేవుని బిడ్డలుగా, మనం జయించడానికి పిలువబడ్డాము. యేసుక్రీస్తు యొక్క మరణం మరియు పునరుత్థానం మనకు ఈ లోకములో జయించినట్లుగా జీవించే శక్తిని ఇచ్చాయి.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 

వ్యక్తిగత అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి మరియు సంఘటణలపై యేసయ్య నా కోసం కొనుగోలు చేసిన విజయాన్ని ప్రకటిస్తున్నాను. ఆమెన్.

కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి పరిచర్య చేయడానికి నాకు అధికారం దయచేయి. యేసు నామములో. ఆమెన్.

ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎవరూ మూసివేయలేని నీ తలుపులు తెరిచినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. (ప్రకటన 3:8)

సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడేలా నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించును గాక. నీ నామము మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.

దేశం
తండ్రీ, యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా, దుష్టుల శిబిరంలో నీ ప్రతీకారాన్ని విడిచిపెత్తును గాక మరియు ఒక దేశంగా మేము కోల్పోయిన మహిమ పునరుద్ధరించబడును గాక.

Join our WhatsApp Channel


Most Read
● సహనాన్ని లేదా ఓర్పును హత్తుకోవడం
● ఆయనకు సమస్తము చెప్పుడి
● మతపరమైన ఆత్మను గుర్తించడం
● మానవుని హృదయం
● సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం
● మాకు కాదు
● శాంతి (సమాధానం) మన వారసత్వం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్