మీ పూర్తి సామర్థ్యాన్నికి చేరుకొనుట
మీరు మీ అత్యున్నత సామర్థ్యాన్నికి చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, మీరు అత్యుత్తమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఇప్పుడు మీరు అలా మాట్లాడినప్పుడు, మన స్వంత క్రైస్తవ సోదరుల ద్వారా మీరు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. దీనికి కారణం ఏమిటంటే, మన తొలి దశల నుండి, మనకు, తెలికగా మరియు వినయంగా క్రీస్తును వెంబడించాలని నేర్పించారు.
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది (యాకోబు 4:6). ఈ లేఖనము యొక్క అర్థము ఏమిటంటే, మీ చుట్టూ ఉన్న వారి అందరికంటే మీరు మెరుగైనవారని మీరు అనుకోవడాన్ని దేవుడు కోరుకోవడం లేదు - అంటే అది అహంకారం. అయితే, మీరు ఉత్తమంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
ఎవరో ఇలా సరిగ్గా అన్నారు. దేవుడు నీవు ఎలాగూ ఉన్నావో అలాగే నిన్ను ప్రేమిస్తాడు, కానీ నిన్ను అలాగే ఉంచడానికి ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. మీరు బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విధంగా, తండ్రి మహిమపరచబడుతాడు. (యోహాను 15:8)
దేవుడు మిమ్మల్ని ఏది అడిగినా మీరు చేయగలరని నమ్మడం అది గర్వం (అహంకారం) కాదు; అది విశ్వాసం.
మీరు సమ్మతించి ఆయన మాట వినినయెడల, మీరు రాజుల లాగా మంచి పదార్థములను అనుభవింతురు. (యెషయా 1:19) ఏ క్షణంలోనైనా మన జీవితాల కోసం దేవుని చిత్తాన్ని పాటించడమే ఒకేఒక షరతు. దేవుడు ఆదాము మరియు హవ్వలను ఏదోను తోటలో ఉంచాడు మరియు ఎడారిలో కాదు. ఆయన చిత్తానికి కట్టుబడి నడుచుకున్నంత కాలం, వారు రాజుల్లాగే జీవించారు.
మిమ్మల్ని ఇతరులతో పోల్చడం మానేయండి. ఇది మీ జీవితంలో ఆందోళన మరియు భయాన్ని తెస్తుంది. ఏదేమైనా, మీలోని అత్యుత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి దేవుని మీరు అనుమతించినప్పుడు, మిమ్మల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దినప్పుడు, మీకు వర్ణించలేని నెరవేర్పు మరియు సంతృప్తి కలుగుతుంది.
మీరు విశ్వాసం నుండి విశ్వాసానికి (రోమీయులకు 1:17), బలం నుండి బలానికి, మహిమ నుండి అధిక మహిమకు (2 కొరింథీయులు 3:16-18) చేరుదురు. ఈ లేఖనాలు దేవుని ప్రజలుగా మనకు ఉన్న ఔన్నత్యము, రూపాంతరము, మహిమ మరియు సాధికారత కోసం అంతులేని అవకాశాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామములో, నీ మార్గంలో స్థిరంగా ఉండడానికి మరియు ఎల్లప్పుడూ నీ ఉద్దేశ్యంలో దృఢంగా కొనసాగ గలిగే సామర్థ్యాన్ని నాకు దయచేయి. ఆమెన్.
కుటుంబ రక్షణ
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)
ఆర్థిక అభివృద్ధి
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.
Most Read
● ఇది నిజంగా ముఖ్యమా?● 26 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆయన్ని వెతకండి మరియు మీ యుద్ధాన్ని ఎదుర్కోండి
● పరీక్షలో విశ్వాసం
● దేవుని 7 ఆత్మలు: జ్ఞానం గల ఆత్మ
● మీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోండి
● కుమ్మరించుట