ప్రవచనాత్మకమైన మధ్యస్తము
యోసేపు తన నిర్వాహకుడు బెన్యామీను గోనెలో తన వెండి గిన్నె వేయమని అడిగాడు. తనిఖీ ప్రక్రియలో, వెండి గిన్నె బెన్యామీను వద్ద కనుగొనబడింది, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సోదరుడు ఐగుప్తుకు తిరిగి వచ్చారు.
మళ్ళీ, సోదరులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు (బహుశా, వారు మాట్లాడటానికి చాలా ఆశ్చర్యపోయారు). అయినప్పటికీ, తన సోదరుడైన బెన్యామీను తరపున మధ్యస్తము (విజ్ఞాపన) చేసే బాధ్యతను యూదా తీసుకుంటాడు.
మనము ఈ దృశ్యము ఆదికాండము 44:32-33లో గమనించగలము
యూదా యోసేపును వేడుకున్నాడు, "తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. 33 కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము." (ఆదికాండము 44:32-33)
విజ్ఞాపన ప్రార్థన చేయు వారు విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి స్థానంలో ఉంటారు.
యోసేపు గమనించాడు; అతని సోదరులు వ్యక్తిగత లాభం కోసం తమ సొంత సోదరుడిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారిలో తీవ్రమైన మార్పు కనిపిస్తోంది. ఒకరు మరొకరి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెరసాలలో ఉన్న బెన్యామీను స్థానంలో ఉండటానికి యూదా సిద్ధమయ్యాడు. యోసేపు తన సహోదరులలో వచ్చిన ఈ మార్పును చూసి వారికి తనను తాను వెల్లడిపరచుకుంటాడు. (ఆదికాండము 45:1-3 చదవండి)
ఇది చాలా ప్రవచనాత్మకమైనదని నేను నమ్ముతున్నాను. నేడు, ప్రతి క్రైస్తవుడు తన దీవెనలు, తన కుటుంబం, తన సంఘం, తన పరిచర్య మొదలైన వాటి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నాడు. దీనికి కారణం నేను, నేనే మరియు నా గురించి. మనం త్యాగం చేసే విజ్ఞాపన ప్రార్థనలోకి ప్రవేశించినప్పుడు, ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభవు మనకు అర్థం చేసుకోలేని మార్గాల్లో తనకు తాను వెల్లడిపరచుకుంటాడు.
పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని నా హృదయ లోతుల్లో చాలా బలంగా నాటాడు. యూదా విజ్ఞాపన ప్రార్థన యోసేపు తన సోదరులకు వెల్లడి పరచుకున్నాడు. మీ విజ్ఞాపన ప్రార్థన కోల్పోయిన చాలా మందికి క్రీస్తును వెల్లడిపరుస్తుంది.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి
వ్యక్తిగత వృద్ధి
నేను ప్రభువైన యేసుక్రీస్తును నా ప్రభువు, దేవుడు మరియు రక్షకునిగా విశ్వసిస్తున్నాను కాబట్టి, నేను మరియు నా ఇంటివారు రక్షింపబడ్డామని నేను ఆజ్ఞాపిస్తున్నాను! (అపొస్తలుల కార్యములు 16:13, యోబు 22:28)
నా పిల్లలు (మీ పిల్లల పేర్లను పేర్కొనండి) సురక్షితంగా నిలిచియుందురు మరియు కొనసాగుదురు మరియు వారి సంతానము నీ యందు స్థిరపరచబడుదురు. (కీర్తనలు 102:28)
తండ్రీ, యేసు నామములో, నా కుటుంబ సభ్యులను (వారి పేర్లను పేర్కొనండి) నీ చేతుల నుండి ఎవరు అపహరింపలేరని నేను అంగీకరిస్తున్నాను. (యోహాను 10:29)
కుటుంబ రక్షణ
నేను నా హృదయంతో విశ్వసిస్తున్నాను మరియు నేను మరియు నా కుటుంబ సభ్యుల విషయానికొస్తే, మేము జీవము గల దేవుని సేవిస్తాము. నా రాబోయే తరం కూడా ప్రభువును సేవిస్తుంది. యేసు నామములో.
ఆర్థిక అభివృద్ధి
ఓ తండ్రీ, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన వృత్తి మరియు మానసిక నైపుణ్యాలను నాకు దయచేయి. యేసు నామములో. నన్ను దీవించు.
సంఘ ఎదుగుదల
తండ్రీ, ప్రత్యక్ష ప్రసార ఆరాధనలను చూసే ప్రతి వ్యక్తి దాని గురించి విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే ముఖ్యమైన అద్భుతాలను పొందును గాక. ఈ అద్భుతాల గురించి విన్న వారు కూడా నీ వైపు తిరిగేలా విశ్వాసాన్ని పొంది మరియు అద్భుతాలను పొందుదురు.
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశాన్ని (భారతదేశం) చీకటి దుష్ట శక్తులు ఏర్పరచిన ప్రతి విధ్వంసం నుండి విడుదల చేయి.
Most Read
● దేవుని హెచ్చరికలను విస్మరించవద్దు● పతనం నుండి విముక్తికి ప్రయాణం
● యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
● 01 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● పరిశుద్ధాత్మ యొక్క ఇతర ప్రత్యక్షత వరములకు ప్రాప్యత పొందుట
● పరలోకపు ద్వారములను తెరవండి & నరకపు ద్వారములను మూసేయండి