అపకీర్తి గల పాపానికి ఆశ్చర్యమైన కృప అవసరం
Amazing Grace, how sweet the sound
That saved a wretch like me
I once was lost, but now am found
I was blind but now I see
ధర్మశాస్త్రము మోషే ద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. (యోహాను 1:17)
యేసుక్రీస్తు సువార్తలో మనకు ఇచ్చిన దేవుని కృప చాలా ఆశ్చర్యమైనది. మనము నిజంగా దానికి అర్హులం కాదు.
దేవుని కుమారుడైన యేసు మానవ రూపంలో దిగివచ్చి పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాడు. ఆయన్ని చంపడానికి మానవులమైన మన దగ్గర ఎటువంటి కారణం లేదు, కానీ మనము చేసాము. "ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించెను" (ప్రకటన 1:5) అని లేఖనము చెబుతోంది. మనం మరోసారి ఆయన కుమారులు మరియు కుమార్తెలుగా ఉండేలా ఆయన తన షరతులు లేని కృపను మనకు ఇచ్చాడు.
బహుశా దావీదు జీవితంలో కంటే దేవుని కృప యొక్క దృశ్యం మరెక్కడా స్పష్టంగా కనిపించదు. యేసు వంశావళి దావీదులో గుర్తించవచ్చు. యేసు స్వయంగా దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. ఇప్పుడు అది కార్యపరంగా గొప్ప ఆశ్చర్యమైన కృప.
మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలని నిర్ణయించుకుని విఫలమై ఉండవచ్చు. వెనకడుగు వేయవద్దు. మీరు దేవుని కృప వైపు చూడాలని నేను కోరుకుంటున్నాను. మీ బలంతో మీరు ఎప్పటికీ చేయలేని కొన్ని పనులు ఉన్నాయి. మీరు చూడాలని నేను కోరుకుంటున్న సత్యం ఏమిటంటే, దేవుడు దావీదును లైంగిక పాపం నుండి విమోచించినట్లయితే, ఆయన మిమ్మల్ని కూడా విమోచించగలడు.
లైంగిక బంధాల వలల నుండి విముక్తి పొందడం చిట్కాలు మరియు పద్ధతుల ద్వారా కాదు కానీ, దేవుని మహా కృప ద్వారానే పొందగలము. మనలను విడిపించే శక్తి దేవునికి మాత్రమే ఉంది.
లైంగిక శోధనలపై విజయం పొందడానికి మీకు అవసరమైన సమస్త కృపను ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు:
మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. (2 కొరింథీయులు 9:8)
కాబట్టి మీరు చేయవలసిన విషయం ఇక్కడ ఉంది. మీ హృదయాన్ని తెరిచి, మీరు ఎలా గందరగోళానికి గురయ్యారో మరియు విజయం పొందడానికి ఆయన సహాయం కావాలని ఆయనకి తెలియజేయండి. నిజాయితీగా ఉండండి. ఇది చాలా సహజంగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ అది శక్తివంతమైనది.
గమనిక: దీన్ని చదవడం ద్వారా సహాయం పొందగల ఎవరైనా మీకు తెలిస్తే, పైన ఉన్న "షేర్" బటన్‌ను ఉపయోగించండి. PDF రూపొందించబడుతుంది, మీరు దీన్ని చాలా మందితో పంచుకోవచ్చు.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
పాపం ఇకపై నాపై నీకు అధికారము లేదు, ఎందుకంటే నేను కృప క్రింద ఉన్నాను మరియు ధర్మశాస్త్రం క్రింద కాదు. యేసు నామంలో. ఆమెన్.
కుటుంబ రక్షణ
తండ్రీ, నీ కృప ప్రతిరోజు నూతనగా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మరియు నా కుటుంబము బ్రదుకు దినములన్నియు నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును మరియు చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేసెదము యేసు నామము లో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నా ప్రభువైన యేసుక్రీస్తు కృపను నేను ఎరుగుదును. ఆయన ధనవంతుడై యుండియు ఆయన దారిద్ర్యము వలన నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆయన రాజ్యం కొరకు ధనవంతులు కావలెనని, నా నిమిత్తము దరిద్రుడాయెను. (2 కొరింథీయులు. 8:9)
KSM సంఘము
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృందం సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక. కరుణ సదన్ పరిచర్య ప్రతి రంగములోను సమర్థతంగా ఎదుగును గాక.
దేశం
తండ్రీ, నీ నీతి మరియు శాంతి మా దేశం అంతటా ప్రవహించును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క ప్రతి శక్తులు నాశనం అవును గాక. మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సమాధానము మరియు సమృద్ధి ఉండును గాక. యేసు నామములో.
Most Read
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● సాత్వికము బలహీనతతో సమానం కాదు
● క్రీస్తులో రాజులు మరియు యాజకులు
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
● మీ విడుదలను ఎలా కాపాడుకోవాలి