అనుదిన మన్నా
మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
Monday, 14th of August 2023
0
0
404
Categories :
పాపం (Sin)
విడుదల (Deliverance)
అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. (సంఖ్యాకాండము 25:1-3)
బిలాము ఇశ్రాయేలును శపించుటకు ప్రయత్నించాడు కానీ జరగరలేదు; కానీ ఇప్పుడు, వారు యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపం కారణంగా శపించబడ్డారు.
హిందీ భాషలో "కోడవలితో మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు" అని చెప్పే ఒక ప్రసిద్ధ నీతి వాక్యం ఉంది. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా శత్రువు ఏమి సాధించలేకపోయాడు, ఇశ్రాయేలు వారి అవిధేయత ద్వారా తమ మీదికి తెచ్చుకున్నారు. నేటికీ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అదే సూత్రం వర్తిస్తుంది. మనపై సాతాను చేసే అత్యంత శక్తివంతమైన దాడి మన స్వంత పాపం మరియు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినంత నష్టాన్ని ఎన్నటికీ చేయదు.
బిలాము ఇశ్రాయేలును శపించుటకు తన వంతు కృషి చేసాడు - కాని విఫలమయ్యాడు. అయినప్పటికీ, డబ్బుపై అతనికి ఉన్న ప్రేమ, మోయాబు రాజు అయిన బాలాకు తనను నియమించిన వ్యక్తిని సంతోషపెట్టకుండా విషయాన్ని ముగించలేదు.
ఇశ్రాయేలీయుల పట్ల బిలాము ఏమి చేసాడో ప్రభువు స్వయంగా బయటపెట్టాడు, "అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, [వారిని ప్రలోభపెట్టడానికి] విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము [లైంగిక దుర్మార్గాలకు తమను తాము అప్పగించుకోవడం] చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను (సిద్ధాంతానికి) అనుసరించువారు నీలో ఉన్నారు." (ప్రకటన 2:14)
ముఖ్యంగా, ఇశ్రాయేలీయులను శపించడంలో విఫలమైన తర్వాత, బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: "నేను ఈ ప్రజలను శపించలేను. కానీ నీవు వారి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వారిని ప్రలోభపెట్టడం ద్వారా తమను తాము శపించుకునేలా చేయవచ్చు. మీ అందమైన అమ్మాయిలను వారి మధ్యకు పంపించి, ఇశ్రాయేలు పురుషులను అనైతికత మరియు వ్యభిచారమునకు ప్రలోభపెట్టమని చెప్పు." మరియు అది పనిచేసింది.
బిలాము, బాలాకు తన చెడ్డ సలహా ద్వారా అతడు కోరుకున్నది పొందాడు - కానీ అతడు దేవుని శత్రువుల మధ్య మరణించాడు (సంఖ్యాకాండము 31:7-8). అతడు తన డబ్బును కొద్దికాలం మాత్రమే అనుభవించాడు.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి
వ్యక్తిగత వృద్ధి
తండ్రీ, యేసు నామంలో, నా అవిధేయత స్థితులను పాపంగా అంగీకరిస్తున్నాను. (అవిధేయత యొక్క స్థితులు ఏమిటో ప్రభువుకు తెల్పండి) నన్ను క్షమించు ప్రభువా, నీ రాకడ పర్యంతం వరకు నన్ను కాపాడు. ఆమెన్. [1 థెస్సలోనియన్లు 5:23-24]
కుటుంబ రక్షణ
నేను నా హృదయంతో విశ్వసిస్తున్నాను మరియు నేను మరియు నా కుటుంబ సభ్యుల విషయానికొస్తే, మేము జీవము గల దేవుని సేవిస్తాము. నా రాబోయే తరం కూడా ప్రభువును సేవిస్తుంది. యేసు నామములో.
ఆర్థిక అభివృద్ధి
ఓ తండ్రీ, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన వృత్తి మరియు మానసిక నైపుణ్యాలను నాకు దయచేయి. యేసు నామములో. నన్ను దీవించు.
సంఘ ఎదుగుదల
తండ్రీ, ప్రత్యక్ష ప్రసార ఆరాధనలను చూసే ప్రతి వ్యక్తి దాని గురించి విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే ముఖ్యమైన అద్భుతాలను పొందును గాక. ఈ అద్భుతాల గురించి విన్న వారు కూడా నీ వైపు తిరిగేలా విశ్వాసాన్ని పొంది మరియు అద్భుతాలను పొందుదురు.
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశాన్ని (భారతదేశం) చీకటి దుష్ట శక్తులు ఏర్పరచిన ప్రతి విధ్వంసం నుండి విడుదల చేయి.
Join our WhatsApp Channel
Most Read
● దేవుడు ఎంతో ప్రేమించి ఆయన అనుగ్రహించెను● వ్యసనాలను ఆపివేయడం
● మీ అనుభవాలను వృథా చేయవద్దు
● గతం యొక్క సమాధిలో భూస్థాపితం కావద్దు
● నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
● అడ్డు గోడ
● 30 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు