మీరు మీ హృదయ నేత్రములతో చూసే దానిలో గొప్ప శక్తి ఉంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘం కోసం ప్రార్థించడానికి ఇది ఒక కారణం: "మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున" (ఎఫెసీయులకు 1:18)
కొన్ని సంవత్సరాల క్రితం, తన భార్యను ఆశ్చర్యపరిచే ప్రణాళికతో విదేశాలలో ఉద్యోగం నుండి ఇంటికి ఎలా తిరిగి వచ్చాడో చెప్పిన వ్యక్తి కోసం నేను ప్రార్థించాను. బదులుగా, అతడు తలుపు తెరచినప్పుడు, అతడు ఆమెను మరొక వ్యక్తితో చూశాడు. అతడు పూర్తిగా హృదయ విదారకంగా ఉన్నాడు, కానీ తన పిల్లల కారణంగా వివాహం బంధంలో కొనసాగాడు. అతడు తరచూ నాకు ఇలా వ్రాసేవాడు, "అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, కానీ అతడు యేసుపై విశ్వాసం ఉన్నందున, అతను ముందుకు కొనసాగాడు."
ఒక్కోసారి అతడిని ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు. అయితే, ఒకరోజు పరిశుద్ధాత్మ నాకు ఒక శక్తివంతమైన విషయం చెప్పాడు. "ఆ వ్యక్తిని తన సహజమైన కళ్లతో కాకుండా ఆధ్యాత్మిక నేత్రాలతో చూడమని చెప్పు. అతని భార్య మరియు పిల్లలు సంఘంలో ప్రార్థనలు చేస్తూ మరియు దేవుణ్ణి వెతుకుతున్నట్లు చూడమని చెప్పు.” అయితే ఇప్పుడు ఈ స్త్రీ ఎప్పుడూ ప్రార్థన చేయదు మరియు పిల్లలను కూడా సంఘానికి రావడానికి అనుమతించదు.
ప్రభువు నుండి వచ్చిన ఈ మాట నేను అతనికి చెప్పినప్పుడు, అతడు చాలా ఏడ్చాడు, కానీ మాట (వాక్యం) చెప్పినట్లుగా చేస్తానని వాగ్దానం చేశాడు. అతని భార్య మరియు పిల్లలు సంఘంలో తనతో పాటు ప్రార్థనలు చేస్తున్నట్టు అతను చూశాడు (ఊహించాడు). అతడు ఏమి చూసాడో దాని గురించే మాట్లాడేవాడు. దాదాపు నాలుగు నెలల పాటు ఇలా కొనసాగించాడు.
ఒకరోజు, అనివార్యమైనది జరిగింది. అతడు సంఘంలో సేవ చేస్తున్నందున, అతడు ఎప్పటిలాగే త్వరగా వచ్చాడు. ఒక గంట తర్వాత, అతని భార్య తన పిల్లలతో వచ్చి, అతని పక్కన కూర్చుని, ఆమె కన్నీళ్లతో ఆరాధించింది. ఆ రోజు, విడుదల కోసం ముందుకు రండి అని నేను ప్రజలను పిలిచినప్పుడు, ఆమె వచ్చి మన ప్రభువు ద్వారా మహిమకరముగా రక్షించబడింది.
ఆమెలో ఆ రోజు మొదలైనది విశ్వాసం నుండి అధిక విశ్వాసం మరియు మహిమ నుండి అధిక మహిమ వరకు అభివృద్ధి చెందుతూనే ఉంది. (2 కొరింథీయులు 3:18) నేను మాత్రమే ఊహించగలను, ఈ వ్యక్తి తన భార్యను విడిచిపెట్టినట్లయితే ఏమి జరుగుండేది? ఇది మనలో చాలా మందికి మేల్కొలుపు పిలుపు లాంటిది.
ముందుగా, మీరు ఇష్టపడే వ్యక్తులను అంత తేలికగా వదులుకోకండి.
రెండవదిగా, ఆత్మ నేత్రాలతో చూడటం ద్వారా మీ విశ్వాసాన్ని విడుదల చేయండి.
మీ జీవితంలో ఏమి చేయాలని మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు? మొదటిగా, మీ ప్రార్థనకు సమాధానం లభించిందని విశ్వాసపు నేత్రాలతో చూడటం ప్రారంభించండి (హెబ్రీయులకు 11:1) ఆపై ఆ విషయాన్ని మాట్లాడటం ప్రారంభించండి. దేవుని మహిమ కొరకు ఇది జరుగుతుంది.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామంలో, నీ వాక్యం నాలో భాగమయ్యే వరకు ధ్యానించడానికి నాకు సహాయం చేయి. ఆత్మ పరిధిలో నా ప్రార్థనలు విప్పి చూడడానికి నా మనో నేత్రములను తెరువు. ఆమెన్.
కుటుంబ రక్షణ
యేసు నామములో, నేను, నా కుటుంబ సభ్యులు మరియు సంఘం అటూ ఇటూ తిరుగకూడదని మరియు మనుష్యుల సిద్ధాంతం లేదా మోసపూరితమైన ప్రతి గాలిని మోసుకెళ్లకూడదని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
యేసు నామములో, నేను, నా కుటుంబ సభ్యులు మరియు సంఘం మోసపూరిత పన్నాగం యొక్క మోసపూరిత కుటిలత్వం నుండి రక్షించబడ్డామని నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు మేము జాగ్రత్తగా దాచిపెట్టిన అవాస్తవాలను స్పష్టంగా చూస్తాము మరియు వాటిని పూర్తిగా తిరస్కరిస్తాము.
ఆర్థిక అభివృద్ధి
నా దేవుడు క్రీస్తుయేసు ద్వారా మహిమలో తన ఐశ్వర్యాన్ని బట్టి నా అవసరాలు మరియు నా కుటుంబ సభ్యుల అవసరాలన్నీ తీరుస్తాడు.
KSM సంఘం ఎదుగుదల
తండ్రీ, పాస్టర్ మైఖేల్ మరియు ఆయన బృంద సభ్యులను నీ ఆత్మ యొక్క తాజా అభిషేకంతో అభిషేకించు, ఫలితంగా నీ ప్రజలలో సూచక క్రియలు మరియు అద్భుతాలు మరియు శక్తివంతమైన కార్యములు జరుగును. దీని ద్వారా ప్రజలను నీ రాజ్యానికి చేర్చుకో. యేసు నామములో.
దేశం
తండ్రీ, యేసు నామములో, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలోని ప్రజల హృదయాలు నీ వైపు మళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడి యేసును తమ ప్రభువు మరియు రక్షకునిగా ఒప్పుకుందురు గాక.
Most Read
● 02 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన● లోకమునకు ఉప్ప లేదా ఉప్పు స్తంభం
● యబ్బేజు ప్రార్థన
● జూడస్ జీవితం నుండి పాఠాలు -1
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 1
● శీర్షిక: కొంత మట్టుకు రాజి పడటం