english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. పరిశుద్ధత యొక్క ద్వంద్వ కోణాలు
అనుదిన మన్నా

పరిశుద్ధత యొక్క ద్వంద్వ కోణాలు

Friday, 22nd of September 2023
1 1 1180
పరిశుద్ధత అనేది క్రైస్తవ విశ్వాసంలో లోతుగా పాతుకుపోయిన భావన, ఇది తరచుగా చేరుకోలేనిదిగా అనిపించే ఉన్నతమైన ఆదర్శంగా పరిగణించబడుతుంది. అయితే, పరిశుద్ధతకు రెండు కోణాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

1. స్థానము మరియు
2. ప్రవర్తన

ఈ కోణాల్లోకి లోతుగా వెళ్ళుద్దాం మరియు విశ్వాసులు నేటికి దేవునితో ఎలా నడవాలో దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం.

స్థానపరమైన పరిశుద్ధత
మీరు యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకునిగా అంగీకరించినప్పుడు, నమ్మశక్యం కానిది జరుగుతుంది-మీ ఆధ్యాత్మిక స్థితి మారుతుంది. మీరు ఇకపై దేవుని దృష్టిలో పాపిగా కనిపించరు; బదులుగా, మీరు పవిత్రంగా మరియు నిర్దోషిగా కనిపిస్తారు. ఎఫెసీయులకు 1:4 చెప్పినట్లు, "మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను."

మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, "నేనా? పరిశుద్దగనా? కానీ నేను ఇప్పటికీ ప్రతిరోజూ పాపంతో పోరాడుతున్నాను!" మరియు మీరు ఒకరే  కాదు; ఇది ప్రతి విశ్వాసి ఎదుర్కొనే పోరాటం. అయినప్పటికీ, స్థానపరమైన పరిశుద్ధత ఒక బహుమానం, మనం సంపాదించేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై చేసిన త్యాగం ద్వారా, దేవుడు మనల్ని శుద్ధి, పరిశుద్ధంగా మరియు పవిత్రంగా చూస్తాడు. 2 కొరింథీయులకు 5:21 మనకు గుర్తుచేస్తున్నట్లుగా, " ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను."

ప్రవర్తనపరమైన పరిశుద్ధత:
స్థానపరమైన పరిశుద్ధత తక్షణం మరియు శాశ్వతమైనది అయితే, ప్రవర్తనాపరమైన పరిశుద్ధత ఒక ప్రయాణం. పరిశుద్ధత యొక్క ఈ అంశం మన క్రియలు, ఎంపికలు మరియు జీవనశైలికి సంబంధించినది. ఉదాహరణకు వివాహం యొక్క సారూప్యతను తీసుకోండి. మీరు వివాహం చేసుకున్న రోజు, మీ స్థితి "వివాహం"గా మారుతుంది. అయినప్పటికీ, మీరు ఒంటరిగా జీవించడం కొనసాగిస్తే, మీ ప్రవర్తన మీ నూతన స్థితికి విరుద్ధంగా ఉంటుంది.

అదే విధంగా, క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన విశ్వాసులుగా, మన క్రియలు మన నూతన గుర్తింపును ప్రతిబింబించాలి. 1 పేతురు 1:16, "నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైయుండుడి." ఇది మనము క్రీస్తులో ఇప్పటికే ఉన్న పరిశుద్ధముగా జీవించమని దేవుని ఆజ్ఞ.

స్థానపరమైన మరియు ప్రవర్తనపరమైన మధ్య వ్యత్యాసం
"అక్కడే నిద్రపోతూ" కొనసాగించే వివాహితుడు వారి వైవాహిక స్థితికి విరుద్ధంగా ఉన్నట్లే, పాపంలో కొనసాగే క్రైస్తవుడు వారి స్థానపరమైన పరిశుద్దకు విరుద్ధంగా ఉంటాడు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు ​​6:1-2లో ఈ వ్యత్యాసమును ఉద్దేశించి ఇలా అడిగాడు, "ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?"

రెండింటిని సమలేఖనం చేయడం
మన ప్రవర్తనపరమైన పరిశుద్ధత మన స్థానపరమైన పరిశుద్ధతతో సమలేఖనం చేయడమే మన లక్ష్యం. ఇది పరిపూర్ణతను సాధించడం గురించి కాదు కానీ విశ్వాసం ద్వారా ఇప్పటికే మనకు చెందిన క్రీస్తులాంటి లక్షణాలను పొందుపరచడానికి తీవ్రంగా కృషి చేయడం. గలతీయులు 5:22-23 "ఆత్మ ఫలం"-ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికము మరియు ఆశనిగ్రహము వంటి లక్షణాలను వర్ణిస్తుంది-మనం పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మన జీవితంలో సహజంగా ఉద్భవించే లక్షణాలు.

ఎడతెగని కృప
అదృష్టవశాత్తూ, మనం తడబడినప్పుడు-మరియు మనం-దేవుని కృప చాలు. 1 యోహాను 1:9 మనకు హామీ ఇస్తోంది, "మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మకమైనవాడు మరియు నీతిమంతుడు మరియు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేస్తాడు." కానీ కృప పాపానికి లైసెన్స్ కాకూడదు; బదులుగా, అది మనల్ని ప్రతిరోజూ మరింత సంపూరణముగా దేవుని ఘనపరిచాలే పురికొల్పాలి.

ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, పరిశుద్ధత అనేది దోషరహిత పరిపూర్ణత యొక్క స్థితి కాదు, కానీ ప్రతిరోజూ క్రీస్తు వలె మారే ప్రయాణం. స్థానపరమైన పరిశుద్ధత ద్వారా, మనము ఇప్పటికే వేరుగా ఉన్నాము; ప్రవర్తనపరమైన పరిశుద్ధత ద్వారా, మనం లోకములో ఈ దైవిక గుర్తింపును జీవిస్తాము. ఈ రెండు కోణాలు సమలేఖనం అయినప్పుడు, మనం క్రీస్తుకు ప్రభావవంతమైన రాయబారులమవుతాము మరియు ఆయన కృప యొక్క పరివర్తన శక్తికి మన జీవితాలు సాక్ష్యంగా మారతాయి.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. తొందరపడకండి.

1. పరలోకపు తండ్రీ, నీ కుమారుడైన యేసుక్రీస్తు త్యాగం ద్వారా నీవు నాకు అనుగ్రహించిన స్థానపరమైన పరిశుద్దకై నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. శత్రువు యొక్క ప్రతి కార్యానికి వ్యతిరేకంగా నేను ఈ పరిశుద్దతను నా కవచంగా పొందుకుంటాను. (ఎఫెసీయులకు 6:16) నీ దృష్టిలో నా స్థానపరమైన పరిశుద్ధమైనది మరియు నిందారహితమైనదిగా గుర్తించాను. యేసు నామములో.

2. ప్రభువైన దేవా, నీవు పరిశుద్ధుడవైనట్లే నన్ను కూడా పరిశుద్ధముగా ఉండుమని నీ వాక్యము ఆజ్ఞాపిస్తుంది (1 పేతురు 1:16). క్రీస్తులో నా పరిశుద్ధ స్థానంతో నా ప్రవర్తనలు మరియు క్రియలను సమలేఖనం చేయడంలో నాకు సహాయం చేయి. నా జీవితంలో శత్రువుకు ఏది స్థావరం ఇస్తుందో, దానిని నిర్మూలించబడును గాక. యేసు నామములో. ఆమెన్!

Join our WhatsApp Channel


Most Read
● దేవదూతల సహాయాన్ని ఎలా సక్రియం చేయాలి
● విధేయత ఒక ఆధ్యాత్మిక గుణము
● 20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● కలుసుకోవడం యొక్క సామర్థ్యం
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - II
● రక్తంలోనే ప్రాణము ఉంది
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్