ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, ఉదయపు వెలుతురు కోసం ఎదురుచూడలేనంత అత్యవసర సందేశంతో కనిపించాడు. "ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను" (మత్తయి 2:13).
మనోహరమైన విషయం ఏమిటంటే, యోసేపు వెనుకాడలేదు. క్షణం యొక్క అసంబద్ధత, అసౌకర్యం మరియు ప్రమాదం ఉన్నప్పటికీ, యోసేపు లేచి తన కుటుంబాన్ని రాత్రిపూట ఐగుప్తునకు తీసుకెళ్లాడు. అతని తక్షణ విధేయత యేసును రక్షించింది, ఈ ప్రవచనాన్ని నెరవేర్చింది: "ఐగుప్తులోనుండి నేను నా కుమారుని పిలిచితిని" (మత్తయి 2:15).
మన జీవితాలు శబ్దంతో నిండిపోయాయి: సోషల్ మీడియా అప్‌డేట్‌లు, సమాచార విషయాలు మరియు తాజా ట్రెండ్‌లు. ఈ సందడి మధ్య, దేవుని స్వరం తరచుగా "మృదువైన గుసగుసగా" వస్తుంది. “ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. (1 రాజులు 19:12).
దేవదూత యోసేపుతో కలలో మాట్లాడినట్లే, దేవుడు ఇప్పుడు మీతో నిశ్చలమైన, చిన్న స్వరంతో మాట్లాడుతున్నాడు, సంభావ్య హాని నుండి లేదా గొప్ప ఆశీర్వాదం వైపు మిమ్మల్ని ఒక దిశ వైపు నడిపిస్తాడు.
యోసేపు యొక్క విధేయత కేవలం ఖచ్చితమైనది కాదు; అది సమయానుకూలమైనది. "అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లెను" (మత్తయి 2:14). మన ఆధ్యాత్మిక నడకలో, కేవలం దేవుని స్వరాన్ని వినడానికి సరిపోదు; సమయపాలన ముఖ్యం.
నోవహు ఓడను నిర్మించడం (ఆదికాండము 6) లేదా మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడం గురించి ఆలోచించండి (నిర్గమకాండము 12-14). ఇది కేవలం దేవుడు చెప్పినట్లు చేయడం గురించి కాదు కానీ ఆయన చెప్పినప్పుడు చేయడం.
యోసేపు విషయము, దైవ మార్గదర్శకత్వం వినడం మరియు దాని ప్రకారం పనిచేయడం అనేది మన అవగాహనకు మించిన అలల ప్రభావాలను కలిగిస్తుందని చూపిస్తుంది. మీరు ఈరోజు నడుస్తున్నప్పుడు, మీ చెవులను ఆయన స్వరాని వినగలిగేలా చేయండి మరియు కదలడానికి సిద్ధంగా ఉండండి. మీ విధేయత మీరు ఇంకా చూడలేని భవిష్యత్తుకు అంశముగా కావచ్చు.
ప్రార్థన
తండ్రీ, నీ స్వరాన్ని స్పష్టంగా వినడానికి మాకు చెవులు దయచేయి మరియు నీ సూచనల ప్రకారం వేగంగా పని చేయడానికి విధేయులైన హృదయాలను దయచేయి. యేసు నామములో. ఆమెన్!
Join our WhatsApp Channel
Most Read
● వరుడిని కలవడానికి సిద్ధపడుట● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 3
● విశ్వాసపు పాఠశాల
● పెంతేకొస్తు యొక్క ఉద్దేశ్యం
● 21 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
● పరలోకము యొక్క వాగ్దానం
కమెంట్లు