english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. లెక్కించుట ప్రారంభం
అనుదిన మన్నా

లెక్కించుట ప్రారంభం

Wednesday, 11th of October 2023
1 1 886
"మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము." (కీర్తనలు 90:12)

నూతన సంవత్సరం 2024 ప్రారంభం కావడానికి దాదాపు రెండున్నర నెలలు మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం ఎంత వేగంగా గడిచిపోయింది. "సమయం మరియు ఆటుపోట్లు ఏ మనిషి కోసం వేచి ఉండవు" అని ఒకరు ఒకసారి అన్నారు. గడియారం యొక్క ప్రతి టిక్ ఒక తటస్థ, ఈ భూమి మీద మన జీవనం యొక్క పరిమిత స్వభావాన్ని గుర్తు చేస్తుంది.

బైబిలు మనలను హెచ్చరిస్తుంది, "దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి." (ఎఫెసీయులకు 5:15-16)

స్పష్టమైన విజయాలు లేదా ఎదుగుదల లేకుండా ఇసుక రేణువుల వలె దినాలు, వారాలు మరియు నెలలు కూడా మన వేళ్లతో సాగిపోయేలా చేయడం సులభం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు సూచించినట్లుగా, మన జీవితంలోని నడక యొక్క ఉద్దేశ్యం మరియు జ్ఞానంతో నిండి ఉండాలి. మరి 2024 సంవత్సరం మనల్ని లోతుగా ఆలోచించేలా చేయాలి. మనం మన దినాలను మన దైవ ఉద్దేశ్యానికి అనుగుణంగా జీవిస్తున్నామా?

తరచుగా, మన దృష్టి కోసం పోటీపడే స్వరాలు, కార్యాలు మరియు విన్నపములు మన చుట్టూ ఉంటాయి. అయితే వారు కోరే సమయానికి తగినవారా? మనం జాగ్రత్తగా ఉండకపోతే, దేవుడు మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడ నుండి దూరంగా ఉన్న దిశలలో మనం లాగబడవచ్చు.

"అయితే ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, 'నీవే నా దేవుడు' అని నేను చెప్తున్నాను. నా సమయాలు నీ చేతిలో ఉన్నాయి..." (కీర్తన 31:14-15)

గుర్తుంచుకోండి, మన సమయం ఒక దైవ వరము మరియు దానిని అలా పరిగణించడం చాలా అవసరం. ఉద్దేశపూర్వకంగా ఉండటం అంటే మన సమయం, వాస్తవానికి మన జీవితాలు సర్వశక్తిమంతుడి చేతిలో ఉన్నాయని అంగీకరించడం. మనకు ఇవ్వబడిన ప్రతి క్షణం ఆయన రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం.

సంవత్సరం ముగుస్తున్న కొద్దీ, దీనిని పరిగణించండి: మీ లక్ష్యాలు దేవుడు మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయా? మన ఆశయాలను దైవ ఉద్దేశ్యంతో సమకాలీకరించినప్పుడు, ప్రాపంచిక కార్యాలతో సరిపోలని నెరవేర్పు మరియు సమాధానమును మనం అనుభవిస్తాము.

మన కోసం దేవుని ప్రణాళికలు ప్రేమ, నిరీక్షణ మరియు సమృద్ధిలో పాతుకుపోయాయి. లోకములోని కోలాహలం మరియు గందరగోళం మధ్య ఆయన స్వరాన్ని గుర్తించడం చాలా కీలకం. ఈ వివేచన మన మార్గాన్ని మార్గనిర్దేశం చేస్తుంది, మన లక్ష్యాలు మన పట్ల ఆయన కోరికలను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది.

బహుశా, ఉద్దేశపూర్వకంగా జీవించడంలో అత్యంత సవాలుగా ఉండే అంశాలలో ఒకటి "కాదు" అని చెప్పడం. ప్రతి అవకాశాన్నీ దేవుడిచ్చినవి కావు. మరియు మన దారి దాటిన ప్రతి వ్యక్తి మనతో పాటు మన దైవ గమ్యస్థానానికి ప్రయాణించాలని కాదు.

"అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును." (1 సమూయేలు 16:7)

ఈ వచనము పరిధిగా ఉండనివ్వండి. లోకము అల్పజ్ఞానము మరియు ఆకర్షణీయమైన వాటికి విలువ ఇవ్వవచ్చు, కానీ దేవుడు లోపలి మనిషిని మరియు ప్రతిదాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలను చూస్తాడు. మీ కోసం దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలకు అనుగుణంగా లేని ప్రతిపాదనలు, బంధాలు లేదా అవకాశాలను తిరస్కరించే ధైర్యం కలిగి ఉండండి.
ప్రార్థన
తండ్రీ, నూతన సంవత్సరానికి లెక్కిచడం ప్రారంభమవుతుండగా, నీ చిత్తములో మమ్మల్ని ఉత్సాహపరచు. గడియారంలోని ప్రతి టిక్ మా హృదయాలలో నీ దైవ చిత్తం ప్రతిధ్వనిస్తు, నీ నామమును మహిమపరిచే మార్గాలను ఎంచుకోవడానికి మాత్రమే మాకు మార్గనిర్దేశం చేయును గాక. యేసు నామములో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
● కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● దెబోరా జీవితం నుండి పాఠాలు
● ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు
● వాగ్దాన దేశములోని బలగాలతో వ్యవహరించడం
● ప్రార్థన యొక్క పరిమళము
● యబ్బేజు ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్