అనుదిన మన్నా
15 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Monday, 25th of December 2023
0
0
725
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
అంధకార కార్యములను ఎదురించడం మరియు విరోధించడం
పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. (యిర్మీయా 1:10)
అంధకారపు (చీకటి) కార్యములను వ్యతిరేకించి నాశనం చేయాల్సిన బాధ్యత విశ్వాసులుగా మన మీద ఉంది. మీరు ఎదురించడంలో ఏది విఫలమైతే అదే కొనసాగుతుంది. చాలా మంది విశ్వాసులు తమ జీవితాల్లో అపవాదిని ఎదిరించడానికి దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. “అపవాదిని ఎదిరించే” బాధ్యతను మన మీద ఉంచే దైవ సిధ్ధాంతం గురించి వారికి తెలియదు.
చీకటి శక్తుల కార్యములు నిజమైనవి; వాటిని మన సమూహం, వార్తలు మరియు దేశములో చూడవచ్చు. చాలామంది దానిని వ్యాకరణముతో వివరించడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ విషయాలు ఆధ్యాత్మికంగా రూపొందించబడినవని ఆధ్యాత్మిక వ్యక్తికి తెలుసు.
విశ్వాసులుగా, మన లక్ష్యం క్రీస్తును వెంబడించడం ద్వారా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన అపవాది యొక్క కార్యములను ఎలా నాశనం చేసాడో తెలుసుకోవడం.
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించు చుండెను. (అపొస్తలుల కార్యములు 10:38)
శత్రువు యొక్క ఆయుధాలు ఏమిటి?
నేను శత్రువు యొక్క అన్ని ఆయుధాల గురించి చెప్పలేను; దుష్టున్ని కార్యాలకు మీ కళ్ళు తెరిపించే కొన్నింటిని మీకు అందించడమే లక్ష్యం. ఈ కొన్ని విషయాలు వాటికి సంబంధించిన లేఖనాల ద్వారా మీకు ఆధ్యాత్మిక అవగాహనను అందిస్తాయి.
1. అనారోగ్యం మరియు వ్యాధి
ఒక విశ్రాంతి దినాన, యేసు ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు, పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
ప్రభువైన యేసు ఇంకా సెలవిస్తూ, "ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమె." (లూకా 13:10-13, 16)
దుష్టుడు ఈ స్త్రీని 18 సంవత్సరాలు బంధించాడు, మరియు క్రీస్తు కనిపించకపోతే, ఆమె అనారోగ్యంతో చనిపోయేది. (లూకా 13:16-17)
2. ఆరోపణలు (నిందలు)
అపవాది ప్రజలతో పాపం చేయిస్తుంది మరియు ఇప్పటికీ దేవుని ముందు వారిని నిందిస్తుంది.
"మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకు డైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా." (జెకర్యా 3:1-2)
మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటినిరాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. (ప్రకటన 12:10)
అపవాది యొక్క ఆరోపణలను ఎదుర్కొన్నప్పుడు, దేవుని వాక్య సత్యములో మనం నిరీక్షణ మరియు బలాన్ని పొందవచ్చు. ప్రభువైన యేసయ్య స్వయంగా అపవాది నుండి ఆరోపణలను ఎదుర్కొన్నాడు మరియు ఆయన లేఖనాలను చెబుతూ, దేవుని కుమారుడిగా తన గుర్తింపులో స్థిరంగా నిలబడటం ద్వారా ప్రతిస్పందించాడు.
3. తారుమారు, భయం, సందేహం మరియు అబద్ధాలు
అపవాది దాడి అనారోగ్యం మరియు వ్యాధికి మాత్రమే పరిమితం కాదు. మీకు సత్యము తెలియకపోతే, అపవాది మీ కోసం అబద్ధాలను అమ్ముతుంది. తారుమారు మరియు అబద్ధాలు అనారోగ్యం, వ్యాధి, మరణం, పేదరికం మరియు అపవాది యొక్క అన్ని ఇతర దాడులకు తలుపులను తెరుస్తుంది.
ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను. (మత్తయి 4:3)
అపవాది మోసము యొక్క యజమానుడు మరియు సత్యాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడు మరియు మన మనస్సులలో సందేహాల విత్తనాలను నాటడానికి ప్రయత్నిస్తాడు. మన విశ్వాసానికి నిశ్చయమైన మరియు దృఢమైన పునాది అయిన దేవుని వాక్య సత్యాన్ని క్రమంగా చదవడం మరియు ధ్యానించడం ద్వారా మనం దీనిని ఎదుర్కోనవచ్చు
4. చెడు బాణాలు
చెడు బాణాలు ప్రజలను చంపడానికి లేదా వారి జీవితంలో తప్పుడు విషయాలను చేయడానికి వారి మీద కాల్చిన ఆధ్యాత్మిక బాణాలు.
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు
చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై
తమ బాణములు నారియందు సంధించి యున్నారు. (కీర్తనలు 11:2)
ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక లకు పదును పెట్టుదురు.
యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు, (కీర్తనలు 64:3)
ఈ చెడు బాణాలు అనేక రూపాలను తీసుకోవచ్చు; ఉదాహరణకు, చేదు మాటలు. ఎఫెసీయులకు 6:10-17 లో వివరించినట్లుగా, చెడు బాణాలను ఎదిరించడానికి ఒక మార్గం దేవుని కవచాన్ని ధరించడం.
5. అంధత్వం
మీ ఆధ్యాత్మిక జ్ఞానము తెరవబడినప్పుడు, మీరు సాతాను శక్తి నుండి దేవుని నుండి విడుదల పొందుతారు. ఇది శక్తివంతమైన మరియు రూపాంతరమైన అనుభవం కావచ్చు. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను. (అపొస్తలుల కార్యములు 26:18).
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను. (2 కొరింథీయులకు 4:4)
6. మరణం, నిరాశ మరియు గొడ్రాళ్ళుతనం (ఫలించక పోవడము)
మరణం యొక్క ఆత్మ వివిధ మార్గాల్లో పనిచేయగలదు, కొన్నిసార్లు, ప్రజలు కుంగిపోవచ్చు మరియు చనిపోవచ్చు, మరియు ఇతర సమయాల్లో ఇది ఆత్మహత్య, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు మొదలైన వాటి ద్వారా పనిచేయవచ్చు. దొంగతనం, చంపడం మరియు నాశనం చేయడం వెనుక అపవాది ఉంటాడు. చీకటి కార్యములను గుర్తించడంలో మీకు సహాయ పడుతుంది. (యోహాను 10:10)
7. వైఫల్యం మరియు పేదరికం
అపవాది చేతిలో పేదరికం అనేది ప్రధాన సాధనం. ప్రజల విధిని పరిమితం చేయడానికి వాడు దానిని ఉపయోగిస్తాడు. డబ్బు ఉంటే దేవుని రాజ్యానికి మీరు చేసే మంచి పనులు చాలా ఉన్నాయి. పేదరికం చాలా మందిని వ్యభిచారం, దోపిడీ మరియు నిరాశకు దారితీసింది. మీ అవసరాలన్నీ తీర్చబడాలని దేవుని చిత్తం.
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)
8. పాపము
పాపం అంటే దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించడం. అపవాది మీరు దేవునికి అవిధేయులయ్యేలా చేయగలిగితే, వాడు ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేయగలడు. దేవునికి మీ అవిధేయత అపవాదికి తలుపును తెరుస్తుంది.
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము. (1 యోహాను 3:4)
మనము చీకటి కార్యములను ఎలా నాశనం చేయగలము?
1. విశ్వాసం యొక్క శక్తిని కలిగి ఉండడం
మీరు విశ్వాసంతో పనిచేస్తున్నప్పుడు అసంభవం అనేది ఉండదు. దుర్మార్గుల అగ్ని బాణాలన్నిటినీ ఆర్పడానికి విశ్వాసం అవసరం. అపవాది ఏమి చేసినా, విశ్వాసం ఉన్నప్పుడే అది తిరగబడుతుంది. లాజరు అనారోగ్యంతో చంపబడ్డాడు (అపవాది చేతిపని), కానీ క్రీస్తు దార్శనిమిచ్చాడు మరియు చెడును తిప్పికొట్టాడు. మనుష్యులకు, ఇది అసాధ్యం అనిపించవచ్చు, కానీ విశ్వాసం ఉన్న వ్యక్తికి, ప్రతిదీ సాధ్యమే. (మార్కు 9:23)
2. సత్యాన్ని కలిగి ఉండడం
అనారోగ్యం, వ్యాధి, తారుమారు, అంధత్వం మరియు చీకటి యొక్క అనేక ఇతర పనుల ప్రభావాన్ని నాశనం చేయడానికి సత్యం అవసరం. సత్యం ఒక ఆయుధం, సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేము. నేను మరియు మీరు సత్యం కోసం ఆకలితో ఉండాలి; ఇది మీరు వ్యక్తిగతంగా చేయవలసిన విషయం. మీకు తెలిసిన సత్యమే మీరు ఆనందించే విజయాన్ని నిర్ణయిస్తుంది. (యోహాను 8:32,36)
3. ప్రేమ యొక్క శక్తిని కలిగి ఉండడం
దేవుడు ప్రేమస్వరూపి, మరియు మనం దేవుని ప్రేమను ఉపయోగించినప్పుడు, అది ఒక పరిస్థితి మీద దేవుని శక్తిని విడుదల చేయడానికి ప్రత్యక్ష మార్గం. మీరు ఎంత ఎక్కువగా ప్రేమలో నడుచుకుంటారో, అంత ఎక్కువగా దేవుని శక్తి విరుద్ధమైన పరిస్థితులను పరిష్కరిస్తుంది. మీరు చెడుతో చెడును జయించలేరు; మీరు దానిని మంచితో మాత్రమే జయించగలరు. ప్రేమ యొక్క శక్తివంతమైన రూపము ఉంది, ప్రేమ బలహీనమైనది కాదు, కానీ చాలామంది ఇంకా ప్రేమ యొక్క శక్తి రూపమును పొందుకోలేదు.
కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. (రోమీయులకు 12:21)
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. (1 యోహాను 4:8)
4. అభిషేకాని కలిగి ఉండడం
అభిషేకం నాశనం చేయడానికి కష్టం అనేది ఏది లేదు. (యెషయా 10:27) అభిషేకము దేవుని ఆత్మ మరియు వాక్యము. విశ్వాసులుగా, మీరు ఇప్పటికే మీలో అభిషేకం కలిగి ఉన్నారు; మీరు ఆజ్ఞాపించడం మరియు సరైన ఒప్పుకోలు చేయాలి మరియు దానితో ప్రార్థించాలి. యెషయా 10:27
5. క్రీస్తులో మీ అధికారాన్ని వినియోగించుకోండి
మన అధికారాన్ని ఉపయోగించడం అనేది మనం శత్రువుతో వ్యవహరించే చట్టపరమైన మార్గాలలో ఒకటి. శత్రువు ఏమి చేసినా దానిని తిప్పికొట్టడానికి మనకు క్రీస్తు అధికారం ఉంది. బంధించడంలో మన అధికారాన్ని ఉపయోగించడంలో విఫలమైతే, పరలోకంలో ఏమీ చేయలేము. (మత్తయి 15:13)
యేసు రాకడ యొక్క ఉద్దేశ్యం చీకటి కార్యములను నాశనం చేయడమే, మరియు ఆయన విశ్వాసులకు పనిని కొనసాగించే శక్తిని ఇచ్చాడు. మీరు చీకటి కార్యములను ఎదిరించడానికి మరియు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? (1 యోహాను 3:8) మూలుగుతూ కష్టపడడం మానేయండి. శత్రువు యొక్క శక్తి మీద మీ అధికారాన్ని ఉపయోగించాల్సిన సమయం ఇది. యేసు నామములో మీ జీవితంలో కార్యములు మంచిగా మారడం నేను చూస్తున్నాను.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రా
1. నా జీవితంలో మరియు నా కుటుంబంలో వైఫల్యం, అనారోగ్యం మరియు ఇబ్బందులను ప్రోత్సహించే ఏదైనా చెడు బలిపీఠాన్ని యేసు నామములో నేను పడద్రోస్తున్నాను. (మీకా 5:11-12)
2. యేసు నామములో ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ, నా శరీరంలో ఏదైనా దాగి ఉన్న అనారోగ్యం మరియు వ్యాధిని నాశనం అవును గాక. (యిర్మీయా 1:10)
3. నా ఇంటి చుట్టూ మరియు నా జీవితం చుట్టూ వేలాడుతున్న చెడు అపరిచితుడు, యేసు నామములో నీవు దాక్కున్న స్థలము నుండి దూరమవును గాక. (కీర్తనలు 68:1-2)
4. శత్రువు నాకు వ్యతిరేకంగా చేసిన ఏదైనా చెడును నేను యేసు నామsములో తిప్పి కొడుతున్నాను. (యెషయా 54:17)
5. నాకు చెందిన ప్రతి మంచి విషయం, ఇప్పుడు యేసు నామములో నా దగ్గరకు వచ్చును గాక. (ద్వితీయోపదేశకాండము 28:6)
6. అపవాది నాకు వ్యతిరేకంగా చేసిన ప్రతిదీని నేను యేసు నామములో నాశనం చేస్తున్నాను. (యెషయా 54:17)
7. నాకు మరియు నా కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పును చెప్పే ప్రతి చెడు నాలుకను నేను యేసు నామములో మౌనపరుస్తున్నాను. (యెషయా 54:17)
8. నా జీవితం మరియు కుటుంబానికి వ్యతిరేకంగా అన్యాయం మరియు ఆరోపణ యొక్క ప్రతి స్వరాన్ని నేను యేసు నామములో మౌనపరుస్తున్నాను. (ప్రకటన 12:10)
9. నేను దేవుని దూతలను వ్యూహాత్మక ప్రదేశాల్లోకి విడుదల చేస్తున్నాను మరియు నా ఆశీర్వాదాలు, కుటుంబం మరియు అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రతి సాతాను వివాదాన్ని పారద్రోలడం ప్రారంభించబడును గాక అని యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. (కీర్తనలు 34:7)
10. నా జీవితానికి వ్యతిరేకంగా ఏదైనా సాతాను ప్రణాళికను నేను తారుమారు చేస్తున్నాను; నా మంచి కోసం ప్రతిదీ కలిసి పనిచేయడం ప్రారంభించబడును గాక అని యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. (రోమీయులకు 8:28)
11. నా విధిని వృధా చేయడానికి కార్యం చేయబడిన ఏదైనా నేను యేసు నామములో రద్దు చేస్తున్నాను. (యిర్మీయా 29:11)
12. నా జీవితానికి మరియు నా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కనిపించే ఏదైనా చెడు, యేసు నామములో రద్దు చేయబడును గాక. (2 థెస్సలొనీకయులకు 3:3)
13. యేసు నామములో నా జీవితం మరియు ప్రతిష్టకు వ్యతిరేకంగా ఏదైనా చెడు చేతివ్రాత, ఏదైనా తీర్పు మరియు ఆరోపణలు నేను చెరిపివేస్తున్నాను. (కొలొస్సయులకు 2:14)
14. ఎదుగుదలకు వ్యతిరేకంగా కేటాయించిన ప్రతి దుష్ట వ్యక్తిత్వాన్ని మరియు రాజ్యాల మీద నేను యేసు రక్తం ద్వారా, యేసు నామములో విజయం పొందుతున్నాను. (ప్రకటన 12:11)
15. నా అభివృద్ధి మరియు కీర్తిని ప్రభావితం చేసే పురాతన కోటలను మరియు చెడు నిబంధనలను నేను యేసు నామములో పడద్రోస్తున్నాను. (2 కొరింథీయులకు 10:4)
16. చెడు, కష్టాలు, బాధలు మరియు విధ్వంసం నుండి నేను యేసు రక్తం ద్వారా, యేసు నామములో విడుదల పొందుతున్నాను. (నిర్గమకాండము 12:13)
17. బంధింపబడిన ప్రతి ప్రయోజనాలు మరియు ఆశీర్వాదాలను నేను యేసు నామములో కోల్పోతున్నాను. (యెషయా 45:2-3)
18. తండ్రీ, యేసు నామములో నా మంచి కోసం సమయాలను మరియు వాతావరమును మార్చు. (దానియేలు 2:21)
19. తండ్రీ, యేసు నామములో నా ఆత్మీయ మనిషిని శక్తివంతం చేయి. (ఎఫెసీయులకు 3:16)
20. తండ్రీ, ఈ ఉపవాస కార్యక్రమంలో నాకు మరియు ప్రతి ఒక్కరికి నీ జ్ఞానం మరియు ప్రత్యక్షత యొక్క ఆత్మను దయచేయి, తద్వారా మేము యేసు నామములో నీ గురించి ఎక్కువగా తెలుసుకుంటాము. (ఎఫెసీయులకు 1:17)
Join our WhatsApp Channel
Most Read
● పరీక్షలో విశ్వాసం● ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: పరిశుద్దాత్మ
● కోతపు కాలం - 1
● లైంగిక శోధనపై ఎలా విజయం పొందాలి - 1
● నిలకడ యొక్క శక్తి
● మీ మానసిక స్థితిని మెరుగుపరుచుట
● పన్నెండు మందిలో ఒకరు
కమెంట్లు