అనుదిన మన్నా
18 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Thursday, 28th of December 2023
1
0
682
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
శాపాలను విచ్చినం చేయడం
"నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు." (సంఖ్యాకాండము 23:23)
శాపాలు శక్తివంతమైనవి; విధిని పరిమితం చేయడానికి శత్రువు వాటిని ఉపయోగించవచ్చు. చాలా మంది విశ్వాసులకు తెలియని శాపాల చుట్టూ కొన్ని రహస్యాలు ఉన్నాయి.
చాలా మంది విశ్వాసులకు దేవుని వాక్యాన్ని ఎలా సరిగ్గా అర్థం చేసుకోవాలో తెలియదు. గలతీయులకు 3:13 ప్రకారం క్రీస్తు మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఏ విధమైన శాపం నుండి క్రీస్తు మనలను విడిపించాడు? అది "మోషే ధర్మశాస్త్రానికి" జతచేయబడిన శాపం.
మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను కోరుకునే మూడు ప్రధాన రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అవి:
1. పది ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను "ధర్మశాస్త్రం" అని కూడా అంటారు.
2. పంచశాస్త్రం, ఇది మొదటి ఐదు పుస్తకాలు (ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము): వీటిని "ధర్మశాస్త్రం" అని కూడా సూచిస్తారు.
3. దేవుని వాక్యము. దేవుని నోటి నుండి వెలువడే ప్రతి వాక్యం "ధర్మశాస్త్రం" అని కూడా సూచించబడుతుంది, ఎందుకంటే దేవుడు ఒక మహారాజు, మరియు మహారాజు యొక్క ప్రతి మాట చెప్పబడిన ధర్మశాస్త్రం.
మోషే ధర్మశాస్త్రంలో ఉన్న శాస్త్రాల నుండి క్రీస్తు మనలను విమోచించాడు. ఆయన నీతి కోసం చేసిన ఇతర ఆచారబద్ద శాస్త్రాల నుండి కూడా మనలను విమోచించాడు.
ఒక క్రైస్తవుడు శపించబడుతాడా?
నిజమేమిటంటే, దేవునితో బలమైన సంబంధం కలిగి ఉన్న క్రైస్తవుడు శపించబడడు. క్రైస్తవునికి వ్యతిరేకంగా శాపాలు పని చేసే సందర్భాలు ఉన్నాయి, కానీ క్రైస్తవుడు "నేరుగా శపించబడ్డాడు" అని దీని అర్థం కాదు.
క్రైస్తవునికి వ్యతిరేకంగా శాపం పని చేసే పరిస్థితులు ఏమిటి?
క్రైస్తవుడు దేవుని సహవాసానికి వెలుపల నడిస్తే శాపాలు అతనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి.
ఒక క్రైస్తవుడు పాపపు జీవనశైలిని గడపడం ద్వారా కంచెను విచ్ఛిన్నం చేసినట్లయితే శాపాలు అతని మీద పని చేస్తాయి. మనం ఇంకా 100 శాతం పరిపూర్ణంగా లేనందున, ఎప్పుడో ఒకసారి పాపం చేయడం సాధ్యమే కాని వ్యక్తికి శాశ్వతమైన పాపపు జీవనశైలి ఉన్నప్పుడు, అతడు అపవాదికి చోటు ఇచ్చాడు కాబట్టి అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా శాపాలు పని చేస్తాయి. (ఎఫెసీయులకు 4:27)
క్రైస్తవునికి తన నిబంధన యొక్క రక్షణ, స్థానం మరియు హక్కు గురించి తెలియకుంటే ఒక శాపం క్రైస్తవునికి వ్యతిరేకంగా పని చేస్తుంది.
క్రైస్తవుడు దేవునికి దూరంగా ఉన్న లేదా దేవుని వస్తువులను అగౌరవపరిచినా ఒక క్రైస్తవుడికి వ్యతిరేకంగా శాపం పని చేస్తుంది.
క్రైస్తవుడు దేవునికి అవిధేయతతో జీవిస్తున్నట్లయితే ఒక శాపం క్రైస్తవునికి వ్యతిరేకంగా పని చేస్తుంది.
క్రైస్తవుడు ప్రార్థన చేయలేకపోతే మరియు శాపాలకు వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించలేకపోతే ఒక శాపం క్రైస్తవుడికి వ్యతిరేకంగా పని చేస్తుంది. మీరు అమలు చేసేది మీరు ఆనందిస్తారు. ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక యుద్ధంలో నిష్క్రియంగా ఉండకూడదు.
క్రైస్తవుడు ఇతరులను మోసం చేసినా లేదా ఇతరులకు చెడు చేసినా, వారు అతనిని శపించినట్లయితే, అది పని చేయగలదు. శాపం పనిచేయడానికి ఒక కారణం ఉంది. శాపం పనిచేయడానికి చట్టపరమైన కారణం ఉంది. (సామెతలు 26:2) ఇలా చెబుతోంది, "రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు ..... శాపము తగులకపోవును."
శాపాల గురించి వాస్తవాలు
- మీరు జీవితంలో ఎంత వేగంగా మరియు ఎంత దూరం వెళ్లగలరో శాపాలు నిర్ణయిస్తాయి.
- శాపాలు విధికి వ్యతిరేకంగా ప్రయోగించగల ఆధ్యాత్మిక ఆయుధాలు.
- శాపాలు అనారోగ్యం, వైఫల్యం మరియు మరణానికి దారితీయవచ్చు.
- శాపాలు దీవెనలకు వ్యతిరేకమైనవి.
- శాపాలు వినాశకరమైనవి.
- శాపాలు విచ్చినం చేయవచ్చు.
శాపాలు విడుదల చేయబడినప్పుడు, నిర్దిష్ట సమయం జతచేయబడకపోతే, అది ఒక తరం నుండి మరొక తరానికి అమలు అవుతుంది.
అధికార స్థానాలలో ఉన్నవారు శపించే లేదా ఆశీర్వదించే అధికారం కలిగి ఉంటారు.
వ్యక్తిగత ప్రేరేపిత శాపాలు శాపాల యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపాలలో ఒకటి.
వంశ పారంపర్య ఆశీర్వాదాలు ఉన్నాయి. వంశ పారంపర్య శాపాలు కూడా ఉన్నాయి.
శాపాల కార్యముల యొక్క బైబిలు ఉదాహరణలు
1. గేహజీ మరియు అతని తరం కుష్టువ్యాధితో శపించబడ్డారు. (2 రాజులు 5:27)
2. యెహోషువ యెరికోను శపించాడు. యెహోషువ 6:26లో, యెహోషువ యెరికోను శపించాడు మరియు దాదాపు 530 సంవత్సరాల తర్వాత, హీయేలు అనే వ్యక్తి యెరికోను పునర్నిర్మించాడు మరియు ఆ వ్యక్తి యొక్క మొదటి మరియు చివరి సంతానం మీద శాపం సక్రియం చేయబడింది. (1 రాజులు 16:34 చూడండి)
హీయేలు శాపాన్ని తృణీకరించాడు, లేదా అతడు దాని గురించి తెలియనివాడు. అజ్ఞానం ఒక వ్యక్తిని శాపం యొక్క ప్రతికూల ప్రభావం నుండి మినహాయించదు, అందుకే రక్తసంబంధంలో ఉన్న ఏదైనా శాపం గురించి అజ్ఞానం అంటే మినహాయింపు అని క్రైస్తవుడు భావించకూడదు.
3. ఆదాము ఆశీర్వదించబడ్డాడు, కానీ అతని అవిధేయత శాపాలకు దారితీసింది. దేవుడు పాపాన్ని క్షమించడు; ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపం పట్ల మన నిర్లక్ష్య వైఖరిని సహించడు. మనం పాపానికి వ్యతిరేకంగా పోరాడాలి. (ఆదికాండము 3:17-19)
4. బాలాకు మరియు బిలాము. బాలాకు బిలామును నియమించుకున్నాడు; అతడు ఇశ్రాయేలీయులను శపించాలనుకున్నాడు, తద్వారా అతడు వారిని ఓడించాడు. బాలాకు ఎవరినైనా శపించడం యొక్క ఆధ్యాత్మిక ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడు మరియు భౌతిక యుద్ధంలో పాల్గొనే ముందు ఆధ్యాత్మిక బాణం (శాపం) ప్రయోగించాలనుకున్నాడు. బిలాము ఇశ్రాయేలీయులను శపించడంలో విజయం సాధించినట్లయితే, మోయాబీయులతో జరిగిన ఏదైనా భౌతిక యుద్ధంలో వారు ఓడిపోయి ఉండేవారు.
శాపాలను ఎలా విచ్ఛిన్నం చేయాలి?
కార్యములో శాపం ఉంటే ఆధ్యాత్మికంగా గుర్తించండి.
శాపానికి గల కారణముకై ప్రార్థనాపూర్వకంగా దైవ ప్రత్యక్షతను కోరండి.
అపవాది మరియు శాపానికి చట్టబద్ధమైన చోటును అందించే ఏదైనా తెలిసిన మరియు తెలియని పాపం గురించి పశ్చాత్తాపపడండి.
మీరు ఆత్మ యొక్క ఖడ్గంగా ఉపయోగించే దేవుని వాగ్దానాన్ని ఎంచుకోండి. మీరు లేఖనాలను పరిశోధించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మీరు శాపాల కోట మరియు కార్యాలను పడగొట్టడం దేవుని చిత్తం.
పరిస్థితిపై యేసు రక్తాన్ని ప్రయోగించండి మరియు ఆ శాపాల ద్వారా చట్టపరమైన కారణాలను తిప్పికొట్టండి.
దేవుని చిత్తాన్నికై ప్రార్థించండి మరియు దేవుడు భాగమవ్వాలని ప్రార్థించండి. ఆ అపవాది శాపాలతో కార్యం చేయకుండా కట్టడి చేయడానికి యుద్ధ ప్రార్థనలు అవసరం.
ప్రవచనాత్మక శాసనాలు మరియు ప్రకటనలను విడుదల చేయడం ద్వారా క్రీస్తులో మీ అధికారాన్ని అమలు చేయండి. మీరు ఆ శాపాలను ఎదుర్కొనే ఆశీర్వాదాలను ఒప్పుకోవడం కొనసాగించాలి.
పరిశుద్ధతో జీవించండి. పాపభరితమైన జీవనశైలికి తిరిగి వెళ్ళొదండి.
శాపాలు శక్తివంతమైనవి, మరియు మీరు మీ జీవితంలో వాటి మీద యుద్ధం చేయాలి. మీ విధిని ప్రభావితం చేసే చీకటి కార్యములను మీరు నాశనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, అది మీ బాధ్యత, మరియు మీకు అధికారం ఉంది. మీ ఆత్మలో పౌరుషంగా ఉండండి మరియు మీ జీవితానికి వ్యతిరేకంగా తయారు చేయబడిన చెడు శాపాలను నాశనం చేయండి. మీ జీవితానికి వ్యతిరేకంగా పనిచేసే ఏదైనా శాపం ఈ రోజు యేసు నామములో విచ్ఛిన్నమవుతుందని నేను మీ జీవితం మీద ప్రకటిస్తున్నాను.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రా
1. నా విధికి వ్యతిరేకంగా పనిచేసే ఏదైనా ప్రతికూల నిబంధనలు యేసు నామములో నాశనం అవును గాక. (యెషయా 54:17)
2. నా వంశము యొక్క ప్రతి ప్రతికూల శాపాన్ని యేసు నామములో నేను విచ్ఛిన్నం చేస్తున్నాను. (గలతీయులకు 3:13)
3. పూర్వీకుల శాపాలు మరియు చెడు బలిపీఠాల నుండి యేసు నామములో నన్ను నేను వేరుపరచుకుంటున్నాను. (యెహెజ్కేలు 18:20)
4. నన్ను శపించే ఏ క్షుద్రవ్యక్తిపైనా నేను అధికారం కలిగి ఉన్నాను; ఆ శాపాలు యేసు నామములో దీవెనకరంగా మార్చు. (లూకా 10:19)
5. నా జీవితానికి వ్యతిరేకంగా విడుదల చేయబడిన ఏదైనా శాపం, తండ్రీ, వాటిని యేసు నామములో దీవెనకరంగా మార్చు. (ద్వితీయోపదేశకాండము 23:5)
6. నా అభివృద్ధికి మరియు సంపదకు వ్యతిరేకంగా పనిచేసే ఏదైనా మూలాన్ని యేసు నామములో నేను బంధిస్తున్నాను. (ఎఫెసీయులకు 6:12)
7. నా రక్తసంబంధంలో విగ్రహారాధన యొక్క ప్రతికూల ప్రభావాలను యేసు నామములో నేను నాశనం చేస్తున్నాను. (1 యోహాను 5:21)
8. తండ్రీ, యేసు నామములో నా విధికి వ్యతిరేకంగా పనిచేసే ఏదైనా శాపం నుండి నన్ను విడిపించు. (కీర్తనలు 34:17)
9. యేసు రక్తం ద్వారా, యేసు నామములో నా విధికి వ్యతిరేకంగా ప్రతి తల్లిదండ్రుల శాపాన్ని నేను తటస్థీకరిస్తున్నాను. (యెహెజ్కేలు 18:20)
10. నేను వైఫల్యం యొక్క ఆత్మను తిరస్కరిస్తున్నాను మరియు నా జీవితం మీద ఆజ్ఞాపిస్తున్నాను; నేను యేసు నామములో విజయం సాధిస్తాను. (ఫిలిప్పీయులకు 4:13)
11. దేవుని శక్తి, యేసు నామములో వారసత్వంగా వచ్చిన ప్రతి పూర్వీకుల శాపం నుండి నన్ను విడిపించు. (గలతీయులకు 3:13)
12. మంచి విషయాలు నా దగ్గరకు రాకుండా ఏదైనా చెడు శాపం ఉంటే, యేసు నామములో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా నేను నిన్ను విచ్ఛిన్నం చేస్తున్నాను. (యెషయా 54:17)
Join our WhatsApp Channel
Most Read
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు● కాలేబు యొక్క ఆత్మ
● రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● కాముకత్వం మీద విజయం పొందడం
● సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
● పరిశుద్ధత యొక్క ద్వంద్వ కోణాలు
కమెంట్లు