అనుదిన మన్నా
పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
Thursday, 8th of February 2024
1
0
792
Categories :
ఆధ్యాత్మిక పందెం (Spiritual Race)
మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులకు 12:1)
జీవితం యొక్క పందెము 100 మీటర్ల అడ్డగీత కాదు; అది ఒక మారథాన్ (దీర్ఘ కాలిక పరుగు). మరియు ఒక మారథాన్ పరుగెత్తడానికి, మీకు ఓర్పు అవసరం. ఓర్పు అనేది సహనం మరియు పట్టుదల యొక్క కలయిక.
మీ కోసం విషయాలు సరిగ్గా పని చేయని సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో, మనం దేవుని వాగ్దానాలపై ఓపికగా నమ్మకంగా ఉండాలి, మనం చేయవలసిన పనిని చేయడంలో పట్టుదలతో ఉండాలి మరియు వెనకడుగు వేయకూడదు.
అందుకే ఆత్మహత్య అనేది దేవుని బిడ్డకు ఎంపిక కాదు; నిరాశ అనేది దేవుని బిడ్డకు ఒక ఎంపిక కాదు. అడ్డంకులు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి మరియు మోసాలు ఉంటాయి. కానీ మీ ముందు ఒక పందెం ఉంచబడి ఉంది; ఓర్పు మరియు పట్టుదలతో పరుగెత్తండి.
హిజ్కియా రాజు నీతిమంతుడైన రాజు, అతడు ప్రభువును హృదయపూర్వకంగా వెంబడించడానికి కట్టుబడి ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు, యూదా, ఎఫ్రాయిము మరియు మనష్షే అంతటా ఉత్తరాలు పంపాడు, ప్రతి సంవత్సరం జరిగే పస్కా పండుగ కోసం యెరూషలేము ప్రభువు మందిరానికి రావాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాడు.
ఆ లేఖలో "ఓ ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి" అనే సందేశం ఉంది. (2 దినవృత్తాంతములు 30:6)
అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలో నున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి. (2 దినవృత్తాంతములు 30:10)
అప్పుడు అపహాస్యం చేసేవారు ఉన్నారు, ఇప్పుడు అపహాస్యం చేసేవారు ఉన్నారు. అపహాస్యం చేసేవారు ప్రతి యుగంలోనూ ఉంటారు. ఓడను సిద్ధం చేసేట్టప్పుడు నోవహును అపహసించారు. మన ప్రభువైన యేసయ్యను అపహాస్యించిరి.
అంచెవాండ్రు అపహాస్యించబడ్డారు. కానీ మంచి విషయం ఏమిటంటే వారు అపహాస్యం చేసినప్పటికీ పరిగెడుతూనే ఉన్నారు. అపహాస్యం చేసేవారు అపహాస్యిస్తూనే ఉంటారు, మీరు పరిగెత్తుతూనే ఉండండి. దేవుడు నిన్ను పిలిచిన పనిని ఆపవద్దు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండు.
బైబిలు గలతీయులకు 6:7లో, "మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు" అని చెప్తుంది.
దేవుడు మనలను చేయమని పిలిచిన దానిని మనం చేస్తూనే ఉన్నప్పుడు, యెహోవా ఎంచుకున్న ప్రజలు ఖచ్చితంగా యెహోవా వైపు తిరుగుతారు. అప్పుడు మీరు దేవుడు ఇచ్చిన గమ్యాన్ని చేరుకుంటారు.
11 అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. 12 యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. (2 దినవృత్తాంతములు 30:11-12)
నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను, మీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు. మీరు ప్రశాంతమైన నివాసంలో స్థిరపడతారు. ఉంచబడిన పందెంలో పరుగెత్తడాన్ని ఆపవద్దు మరియు వెనుకడుగు వేయవద్దు.

ప్రార్థన
1. తండ్రీ, నేను పడిపోను, నేను విఫలమవను మరియు అలసిపోను. నేను వెనుకడుగు వేయను యేసు నామంలో.
2. తండ్రి, యేసు నామంలో, జీవితంలో నా దారిలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను, అడ్డంకిని నా అభివృద్ధికి, విజయానికి సోపానాలుగా ఉండను గాక.
3. నేను మరణించను కానీ భూమిపై నా దినములను పూర్తి చేయడానికి జీవిస్తాను. నేను క్రీస్తులో, జీవించే దేశంలో, యేసు నామంలో నా విధిని (కర్తవ్యాన్ని) నెరవేరుస్తాను. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● కోల్పోయిన రహస్యం● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
● మీరు చెల్లించాల్సిన వెల
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● కోపాన్ని (క్రోధాన్ని) అర్థం చేసుకోవడం
● మాదిరి కరంగా నడిపించబడుట
కమెంట్లు