english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 2
అనుదిన మన్నా

అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 2

Sunday, 11th of February 2024
0 0 1173
Categories : అప్పు (Debt)
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, "నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పుల వాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టెను." (2 రాజులు 4:1) 

ఆ వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయి భార్యాపిల్లలను వదిలేశాడు. బైబిలు సెలవిస్తుంది, "మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును" (సామెతలు 13:22)

అలా మీరు మరియు నేను అవుతారని నేను ప్రవచిస్తున్నాను. ఈ జీవితంలో మీరు చేస్తున్నది మీతోనే ముగియకూడదు. మీరు మరియు నేను భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదం కావడానికి పిలువబడ్డాము.

ఎలీషా, "నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను." అందుకామె, "నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను." (2 రాజులు 4:2)

విధవరాలు కాస్త వింతగా సమాధానం చెప్పింది. "నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఎంతో కొంత ఉంది." దేవుడు మీకు ఇప్పటికే ఇచ్చిన దానిని ఎల్లప్పుడూ ఉపయోగిస్తాడు. మోషేతో నీ చేతిలో ఏమి ఉందని దేవుడు అడిగాడు. మోషే చేతిలో చిన్నగా కనిపించే కఱ్ఱ మాత్రమే ఉంది. దేవుడు దానిని సమస్త దేశాన్ని విడిపించడానికి ఉపయోగించాడు.

ఇశ్రాయేలులో దావీదును ప్రసిద్ధి చేయడానికి దేవుడు ఒక వలను మరియు కొన్ని రాళ్లను మాత్రమే ఉపయోగించాడు. ఐదు వేల మందికి పైగా ప్రజలకు ఆహారం ఇవ్వడానికి దేవుడు కేవలం ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను (బహుశా అవి తాజావి కూడా కాదు) ఉపయోగించాడు. నీ దగ్గర ఉన్నది ఆ దేవుడు నీకు చూపించాలని నా ప్రార్థన. అది బహుశా ప్రతిభ, వరము కావచ్చు; అది ఎంత చిన్నదైనా, నిన్ను అప్పుల ఊబి నుండి బయటికి తీసుకురావడానికి ప్రభువు దానిని ఉపయోగిస్తాడు. ఈ వచనాన్ని స్వీకరించండి.

అతడు (ప్రవక్త), "నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరి యొద్ద దొరుక గలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము; అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా" (2 రాజులు 4:3-4)

దేవుని దాసుడు విధవరాలుకి ప్రవచనాత్మకమైన సూచన (ఉపదేశము) ఇచ్చాడు. అది ఎలా జరగబోతోందో దాని గురించి ఆమె తర్కించలేదు, కానీ ఆమె ప్రవచనాత్మకమైన వాక్యాన్ని నమ్మింది. మీరు పాటించాలని నిర్ణయించుకున్న సూచన మీరు కలిగించే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక సూచన నిర్మాణాన్ని తెస్తుంది. సూచన లేకపోవడం నాశనాన్ని తెస్తుంది.

మీ కోసం నా దగ్గర ప్రవచనాత్మకమైన సూచన ఉంది.
మీ అప్పులన్నింటినీ గురించి ఒక కాగితంపై రాయండి. మీరు ప్రార్థించే ప్రతిసారీ, ఈ వరుసలోని ప్రతి ప్రార్థన అంశములను ఉపయోగించండి మరియు ఆ అప్పుని తుడిచివేయమని ప్రభువును అడగండి. ఇది చాలా సరళంగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఈ ప్రవచనాత్మక సందేశాన్ని విశ్వసించే వారికి ఇది పని చేస్తుంది.

ప్రార్థన

ప్రతి ప్రార్థన అస్త్రాన్ని మీ హృదయం నుండి వచ్చేంత వరకు కనీసం ఒక నిమిషం పాటు పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి.


1. ప్రభువా, నీవు నాకు ఏమి ఇచ్చావో చూడడానికి నా కళ్ళు తెరువు.

2. ప్రభువా, ఇతరులు సులభంగా చూడని వాటిని చూడటానికి నా కళ్ళు తెరువు. నేను నిన్ను దైవిక అవకాశాల కోసం వేడుకుంటున్నాను.

3. నా జీవితంలో, నా కుటుంబంలో అప్పుల యొక్క ప్రతి పర్వతం; యేసు నామంలో నిర్మూలించబడును గాక.

4. యేసు రక్తం, నా తరపున మాట్లాడు, యేసుక్రీస్తు నామంలో ఈ రోజు నుండి నా జీవితం నుండి అప్పు తీసుకోవడం అనే శాపాన్ని విచ్ఛిన్నం చేయి మరియు తిరిగి పంపించు. ఆమెన్.

5. నేను నా కుటుంబ క్రమములో రాణించను అని చెప్పే ప్రతి శక్తి, నీవు అబద్ధాలకోరివి, యేసుక్రీస్తు నామంలో అగ్ని ద్వారా చనిపోవును గాక.


Join our WhatsApp Channel


Most Read
● విశ్వాసంతో నడవడం
● శపించబడిన వస్తువును తీసివేయుడి
● అంత్య దినం - ప్రవచనాత్మక కావలివాడు
● దేవుడు సమకూరుస్తాడు
● మాటల శక్తి
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్