english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. యుద్ధం కొరకు శిక్షణ
అనుదిన మన్నా

యుద్ధం కొరకు శిక్షణ

Monday, 19th of February 2024
0 0 1179
Categories : ఆధ్యాత్మిక యుద్ధం (Spiritual Warfare)
దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. (1 దినవృత్తాంతములు 12:1-2)

దావీదును వెంబడించిన మనుష్యుల ప్రధాన లక్షణాలలో ఒకటి వారి యుద్ధ సామర్థ్యం. రాళ్లను విసరడం కోసం కుడిచేతితోనూ, ఎడమచేత్తోనూ యుద్ధం చేయడం నేర్చుకున్నారు.

మీరు ఎప్పుడైనా బంతిని విసిరినట్లయితే, మీరు మీ ఆదీనంలో ఉండిన చేతితో సమర్థవంతంగా గురి పెట్టగలరని మీకు తెలుసు; కానీ పక్క (ఎడమ) చేతితో ప్రయత్నించండి; ఖచ్చితంగా విసరడం చాలా కష్టం. కానీ దావీదును వెంబడించిన మనుష్యులు రెండు చేతులతో ప్రభావవంతంగా విసరడం నేర్చుకున్నారు! అలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నెలల తరబడి శిక్షణ తీసుకోవాలి.

మనం కూడా యుద్ధం చేయడం నేర్చుకుంటున్నాము, శరీరంతో కాదు, ఆత్మతో. మన ఆధ్యాత్మిక ఆయుధాలను ఉపయోగించేందుకు మరియు వాటిని ఖచ్చితంగా ఉపయోగించేందుకు మనం శిక్షణ తీసుకోవాలి. నైపుణ్యం మరియు ఆధ్యాత్మిక అధికారంతో ఉపయోగించినప్పుడు దేవుని వాక్యం పదును గల కత్తి.

వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి (హెబ్రీయులకు 11:33)

పరిస్థితికి తగట్టుగా సరైన లేఖనం అద్భుతమైన స్వస్థత మరియు విడుదలను తెస్తుంది. అయితే, మనం వాక్యాన్ని తెలుసుకోవాలి మరియు దానిని యుద్ధంలో ఉపయోగించగలిగేలా ఆత్మలో నడవాలి.

ప్రభావవంతమైన ప్రార్థన యోధులుగా ఉండాలంటే, మన ప్రార్థనలు ఆత్మలోకి ప్రవేశించడానికి లేజర్‌ల వలె మారడానికి మన మనస్సులకు మరియు చిత్తానికి శిక్షణ ఇవ్వాలి. ఈ అంతిమ యుగంలో, ప్రభువైన యేసు మనల్ని ఆధ్యాత్మిక యుద్ధానికి పిలుస్తున్నాడు మరియు కార్యసిద్ధికి మరియు విజయానికి మన శిక్షణ చాలా కీలకం.

మనం వాక్యాన్ని తెలుసుకోవాలి మరియు దానిని నైపుణ్యంగా ఉపయోగించాలి మరియు దీనికైతే మనం పిలువబడ్డాము దానికై ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం ప్రార్థనలో దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. చీకటి శక్తులతో మన యుద్ధంలో లక్ష్యాన్ని సాధించడానికి శ్రద్ధగా శిక్షణ పొందుతూ దావీదు యొక్క శక్తివంతమైన వ్యక్తులచే ప్రేరణ పొందుదాం!
ఒప్పుకోలు
నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.


Join our WhatsApp Channel


Most Read
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
● 06 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
● 23వ రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అభ్యంతరం లేని జీవితం జీవించడం
● ఇవ్వగలిగే కృప - 2
● మీరు ద్రోహాన్ని అనుభవించారా
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్